- భారతదేశం ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ, భూటాన్ ప్రధాని మాన్య శ్రీ డాక్టర్ లొటే శెరింగ్ ఆహ్వానాన్ని అందుకొని 2019వ సంవత్సరం ఆగస్టు 17వ, 18వ తేదీల లో భూటాన్ రాజ్యం లో ఆధికారిక పర్యటన జరిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2019వ సంవత్సరం మే నెల లో రెండో సారి పదవీబాధ్యతల ను స్వీకరించిన అనంతరం జరుపుతున్న ద్వైపాక్షిక పర్యటనల లో ఇది మొదటి ది.
- ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పారో విమానాశ్రయం లో దిగగానే, భూటాన్ ప్రధాని మాన్య శ్రీ డాక్టర్ లోటే శెరింగ్, మంత్రివర్గ సభ్యులు మరియు ప్రభుత్వం లోని సీనియర్ అధికారులు ఆచారబద్ధ గౌరవ వందనం తో స్వాగతం పలికారు.
- ప్రధాన మంత్రి శ్రీ నరేద్ర మోదీ భూటాన్ రాజు మాన్య శ్రీ జిగ్మే ఖేసర్ నమ్ గ్యెల్ వాంగ్ చుక్ తో భేటీ అయ్యారు. మాన్య శ్రీ రాజు మరియు మాన్య శ్రీమతి రాణి లు భారతదేశం ప్రధాన మంత్రి గౌరవార్ధం మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. మాన్య శ్రీ రాజు, మాన్య శ్రీమతి రాణి లు వారికి అనుకూలమైన కాలం లో భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.
- ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భూటాన్ ప్రధాని డాక్టర్ శెరింగ్ లు అటు పరిమిత ప్రాతిపదిక చర్చల లో, ఇటు ప్రతినిధివర్గ స్థాయి చర్చల లో పాలు పంచుకొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ గౌరవార్ధం ఏర్పాటైన ఒక ఆధికారిక విందు కు ఆతిథేయి గా భూటాన్ ప్రధాని డాక్టర్ శెరింగ్ వ్యవహరించారు.
- ప్రధాన మంత్రి శ్రీ మోదీ తో భూటాన్ నేశనల్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత అయిన డాక్టర్ పేమా గ్యాంత్శో భేటీ అయ్యారు.
- ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2019వ సంవత్సరం మే నెల 30వ తేదీ న జరిగిన తన పదవీప్రమాన స్వీకారోత్సవానికి హాజరైనందుకు గాను భూటాన్ ప్రధాని డాక్టర్ శెరింగ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ సందర్భం గా జరిగిన చర్చలను ఇరువురు గుర్తుకు తెచ్చుకొన్నారు. భారతదేశం, భూటాన్ ల మధ్య క్రమం తప్పక ఉన్నత స్థాయి సంప్రదింపులు జరిపే సంప్రదాయం ప్రత్యేకమైనటువంటి మరియు విశేషాధికారంతో కూడిన సంబంధానికి ఒక ముఖ్య సంకేతంగా ఉన్నట్లు ఇరువురు నాయకులు అంగీకరించారు.
- ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ముఖ్యమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల కు సంబంధించిన అన్ని అంశాలను ఉభయ ప్రధానులు వారి చర్చల క్రమం లో సమగ్రంగా సమీక్షించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, ఉమ్మడి చారిత్రక సంబంధాలు, సాంస్కృతిక సంబంధలు, ఆర్ధిక సంబంధాలు, అభివృద్ధి పరమైన సంబంధాలు, రెండు దేశాల ప్రజలకు మధ్య నెలకొన్నటువంటి సంబంధాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు శ్రేష్ఠమైన రీతి లో ఉండడం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా, భూటాన్ కు చెందిన దూరదృష్టి గల రాజులు నిర్వహిస్తున్న పాత్ర ను, సమీప పొరుగు దేశాల మధ్య సహకారాన్ని, సంబంధాల ను పెంపొందించడంలో స్నేహాని కి అద్భుత ఉదాహరణ గా నిలచిన భూటాన్ యొక్క మరియు భారతదేశం యొక్క అనుక్రమిక నాయకత్వాన్ని ఇరు పక్షాలు ప్రశంసించాయి.
- ఇరు పక్షాలు వాటి ఉమ్మడి భద్రత ప్రయోజనాల ను పునరుద్ఘాటించాయి; అలాగే, ప్రతి ఒక్క పక్షం యొక్క భద్రతపరమైన ప్రయోజనాలను, జాతీయ పరమైన ప్రయోజనాల ను ప్రభావితం చేసే అంశాల లో సమన్వయాన్ని కొనసాగించడానికి కూడా రెండు పక్షాలు తమ వచన బద్ధత ను పునరుద్ఘాటించాయి.
- భూటాన్ రాజ్యం లోని ప్రజల యొక్క, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాల కు, ఆకాక్షల కు అనుగుణం గా, భూటాన్ ఆర్ధిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. మధ్యాదాయ వర్గాని కి చెందిన దేశం గా మారినందుకు భూటాన్ ప్రజల ను, భూటాన్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అభినందించారు. ‘‘స్థూల జాతీయ సంతోషం’’ అనే భూటాన్ కు చెందిన ఒక ప్రత్యేక అభివృద్ధి తత్వాని కి అనుగుణం గా, తమ ఉన్నత సాంస్కృతిక వారసత్వాన్ని, అమూల్యమైన పర్యావరణాన్ని సమాంతరం గా పరిరక్షించుకొంటూ, ఈ అభివృద్ధి ని సాధించిన భూటాన్ ప్రజల కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
- ప్రధాని డాక్టర్ శెరింగ్ 2018 నవంబర్ లో పదవీబాధ్యతల ను స్వీకరించిన అనంతరం, 2018 డిసెంబర్ లో తన మొదటి విదేశీ యాత్ర గా చేపట్టిన భారతదేశ పర్యటన ను గుర్తు చేసుకొన్నారు. భూటాన్ కు చెందిన 12వ పంచ వర్ష ప్రణాళిక అమలు లో భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్దతు కు గాను ఆయన ధన్యవాదాలు పలికారు. భూటాన్ అభివృద్ధి కి దశబ్దాలు గా భారతదేశం అందిస్తున్న సహకారానికి ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
- పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక సహకారాని కి, జల విద్యుత్తు అభివృద్ధి అతి ముఖ్యమైన ప్రాధాన్యాంశాల లో ఒకటి గా ఇరు పక్షాలు గుర్తించాయి.
ఇటీవల పూర్తి అయిన 720 మెగా వాట్ల మాంగ్ దేఛూ జల విద్యుత్తు ప్లాంటు ను ఇద్దరు ప్రధానులు లాంఛనం గా ప్రారంభించారు. ప్రాజెక్టు సకాలం లో పూర్తి కావడాన్ని అభినందించారు. ప్రాజెక్టు సాధికార సంస్థ, యాజమాన్యం చూపిన సమర్పణభావాని కి, సామర్ధ్యాని కి గాను వారిని అభినందించారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి లో అమలు లోకి రావడం తో భూటాన్ లో విద్యుదుత్పత్తి సంయుక్త సామర్ధ్యం 2,000 మెగా వాట్ కు పెరిగినట్లు ఇరు పక్షాలు గుర్తించాయి. ఈ ముఖ్యమైన మైలు రాయి ని అధిగమించడం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా పునత్ సంగ్ చు -1, పునత్ సంగ్ చు -2, ఖోలాంగ్ చు ప్రాజెక్టుల ను పూర్తి చేయడానికి కలిసి పనిచేయాలని తీర్మానించారు. సంతోష్ రిజర్వాయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అంశం లో కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చల ను ఇరు పక్షాలు సమీకించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు దేశాల కు లభించే భారీ ప్రయోజనాల ను దృష్టిలో పెట్టుకొని, ప్రాజెక్టు నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేయడానికి అనుసరించవలసిన విధి విధానాలను ఖరారు చేయాలని వారు అంగీకరించారు. జల విద్యుత్తు రంగం లో, భారతదేశం, భూటాన్ ల మధ్య పరస్పర ప్రయోజనకర సహకారం ప్రారంభమై ఐదు దశాబ్దాలు పూర్తి అయినా సందర్భం గా రూపొందించిన స్మారక తపాలా స్టాంపుల ను ఇద్దరు ప్రధానులు కలసి విడుదల చేశారు.
- భారతదేశం జారీ చేసిన రూపే కార్డులు భూటాన్ లో ఉపయోగించుకునే సౌకర్యాన్ని, ఇరువురు ప్రధానులు లాంఛనం గా ప్రారంభించారు. ఇది భూటాన్ లో పర్యటించే భారతీయుల కు నగదు ను తీసుకువెళ్లే అవసరాన్ని తగ్గించడం ద్వారా ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది. భూటాన్ ఆర్థిక వ్యవస్థ ను వృద్ధి చేయడానికి కూడా దోహదపడుతుంది. తద్వారా రెండు దేశాల ఆర్ధిక వ్యవస్థల ను ఇది మరింత సమగ్ర పరచడం లో తోడ్పడుతుంది. భారతదేశాన్ని సందర్శించే భూటాన్ ప్రయాణికుల కు ప్రయోజనం చేకూరే విధం గా, భూటాన్ కు చెందిన బ్యాంకులు రూపే కార్డుల ను జారీ చేయడం వంటి తదుపరి ప్రాజెక్టు ను వేగవంతం గా అమలు చేయాలని ఇరు పక్షాలు తీర్మానించాయి. ఆ విధం గా ఒక దేశాని కి చెందిన రూపే కార్డులు మరొక దేశం లో వినియోగించుకోడానికి రెండు దేశాల లో అవకాశం కలుగుతుంది. ఇరు దేశాల మధ్య నగదు రహిత చెల్లింపుల ను ప్రోత్సహించడం కోసం, రూపే కార్డుల ఆవిష్కరణ తో పాటు భారత దేశానికి చెందిన “భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ” – భీమ్ – యాప్ ను భూటాన్ లో వినియోగించడానికి గల సాధ్యాసాధ్యాల ను అధ్యయనం చేయాలని కూడా ఉభయ దేశాలు అంగీకరించాయి.
- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహకారం తో థింపూ లో నిర్మించిన దక్షిణాసియా ఉపగ్రహ కేంద్రాన్ని, ఇద్దరు ప్రధానులు కలసి ప్రారంభించారు. దక్షిణాసియా ప్రాంత దేశాల కు ఒక బహుమతి గా, 2017 లో దక్షిణాసియా ఉపగ్రహం (ఎస్ఎఎస్)ను ప్రారంభించిన భారత ప్రధాన మంత్రి శ్రీ మోదీ దూరదృష్టి ని భూటాన్ ప్రధాని డాక్టర్ శెరింగ్ అభినందించారు. దీనివల్ల భూటాన్ ప్రసార సేవల పరిధి విస్తరించడం తో పాటు అందుకు అయ్యే వ్యయం కూడా తగ్గింది. రాజ్యం లో విపత్తు నిర్వహణ సామర్ధ్యం కూడా మెరుగుపడింది.
- భూటాన్ సామాజిక, ఆర్ధికాభివృద్ధి పై ఎస్ఎఎస్ సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తూ, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భూటాన్ అవసరాలకు అనుగుణంగా అదనపు ట్రాన్స్ పాండర్ పై బ్యాండ్ విడ్త్ ను- భూటాన్ ప్రజల కు బహుమతి గా- పెంచనున్నట్లు ప్రకటించారు. భారత ప్రధాన మంత్రి ప్రకటన ను, భూటాన్ ప్రధాని డాక్టర్ శెరింగ్ స్వాగతిస్తూ, దేశ ప్రయోజనాల కోసం అంతరిక్ష వనరుల ను వినియోగించుకోవాలన్న మాన్య శ్రీ రాజు ఆశయాన్ని సాకారం చేయడం లో ఇది ఒక పెద్ద ముందడుగు అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల లో ఇది ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించడం తో పాటు అంతరిక్ష రంగానికి సైతం ఈ సంబంధాలను విస్తరించగలదని పేర్కొన్నారు.
- భూటాన్ కోసం ఒక చిన్న ఉపగ్రహాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయడం లో సహకరించుకోవాలని కూడా ఇరువురు నేతలు అంగీకరించారు. రిమోట్ సెన్సింగ్, భౌగోళిక, ప్రాదేశిక సమాచారాన్ని ఉపయోగించి, భూటాన్ సహజ వనరులు, విపత్తు నిర్వహణ కోసం ఒక భౌగోళిక వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు, ఈ ప్రాజెక్టు అమలు, ఇతర కార్యకలాపాల నిర్వహణకు ఒక సంయుక్త కార్యాచరణ బృందం (జెడబ్ల్యుజి)ని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు.
- దేశ సామాజిక అభివృద్ధి ని, ఆర్థికాభివృద్ధి ని వేగవంతం చేయడం లో అద్భుతమైన సామర్ద్యాన్ని అందించడం లో, డిజిటల్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించడం లో అంతరిక్ష సాంకేతికత ను గుర్తిస్తూ – ఈ అంశాల లో సహకారాన్ని పటిష్ఠ పరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇరు పక్షాలు అంగీకరించాయి.
- భారత జాతీయ నాలెడ్జ్ నెట్ వర్క్ మరియు భూటాన్ పరిశోధన విద్యా నెట్ వర్క్ ల మధ్య అంతర్గత అనుసంధాన వ్యవస్థ కు కూడా ఇద్దరు ప్రధాన మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. రెండు దేశాల కు చెందిన విశ్వవిద్యాలయాలు, విద్యార్థుల మధ్య పరస్పర సంప్రదింపుల ప్రోత్సాహాని కి, సమాచార వారధి ఏర్పాటు కు ఈ అనుసంధానం దోహదపడుతుందని ఇరు పక్షాలు గుర్తించాయి.
- ఈ క్రింద పేర్కొన్న అవగాహనపూర్వక ఒప్పంద పత్రాల పై / ఒప్పందాల పై ఈ పర్యటన సందర్భం గా సంతకాలు అయ్యాయి :
- i) దక్షిణాసియా ఉపగ్రహ వినియోగం కోసం సెట్ కామ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడానికి భూటాన్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ, టెలికం శాఖ మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) కుదిరింది.
- ii) జాతీయ నాలెడ్జ్ నెట్ వర్క్ (ఎన్ కెఎన్) మరియు భూటాన్ కు చెందిన ద్రూ పరిశోధన, విద్యా నెట్ వర్క్ (ద్రూక్ ఆర్ఇఎన్) ల మధ్య పీరింగ్ అరేంజిమెంట్ కోసం ఎమ్ఒయు కుదిరింది.
iii) విమానాల ప్రమాదాలు మరియు సంఘటనలపై దర్యాప్తు కోసం, భారతదేశానికి ఎయిర్ క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) మరియు భూటాన్ కి చెందిన ఎయిర్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (ఎఎఐయు) ల మధ్య ఎమ్ఒయు కుదిరింది.
iv – vii) భూటాన్ కు చెందిన రాయల్ యూనివర్సిటీ మరియు కాన్ పుర్, ఢిల్లీ, ముంబయి ల లోని ఐఐటి లు, సిల్ చర్ ఎన్ఐటి ల మధ్య అకడమిక్ ఎక్సేంజ్ ల మెరుగుదల మరియు ఎస్ టిఇఎమ్ సహకారం పై నాలుగు ఎమ్ఒయు లు కుదిరాయి.
viii) భారతీయ విశ్వవిద్యాలయాని కి చెందిన జాతీయ న్యాయ పాఠశాల మరియు థింపూ లోని జిగ్మే సింగ్వే వాంగ్ చుక్ న్యాయ పాఠశాల ల మధ్య న్యాయ విద్య, పరిశోధన అంశాల లో రెండు పక్షాల మధ్య సంబంధాల ను మెరుగుపరచుకోవడానికి వీలుగా ఎమ్ఒయు కుదిరింది.
- ix) న్యాయ విద్య, పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం లో సహకారం పై, భూటాన్ నేశనల్ లీగల్ ఇన్ స్టిట్యూట్, భోపాల్ లోని జాతీయ జ్యుడిషియల్ అకాడెమి ల మధ్య ఎమ్ఒయు కుదిరింది.
- x) పి టి సి ఇండియా లిమిటెడ్ మరియు భూటాన్ లోని ద్రూక్ గ్రీన్ పవర్ కార్పొరేశన్ ల మధ్య మాంగ్ దేఛూ హైడ్రో-ఇలెక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదిరింది.
- భూటాన్ లోని రాయల్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం లో భూటాన్ యువత ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రసంగించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న లోతైన ఆధ్యాత్మిక భావం మరియు బౌద్ధ మతం పట్ల ప్రజల కేంద్రీకృత స్వభావాన్ని ఆయన నొక్కి పలికారు. భారతదేశం, భూటాన్ ల సంబంధాల ను నూతన శిఖరాల కు తీసుకు వెళ్ళడానికి వీలు గా విద్య, ఉన్నత సాంకేతికతల కు చెందిన రెండు దేశాల యువత ప్రాముఖాన్ని ఆయన వివరించారు. భూటాన్ లో అభివృద్ధి, పర్యావరణం, సంస్కృతి భిన్నం గా లేవు, అవి సమష్టి గా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. సంతోషాని కి ప్రాధాన్యం తో పాటు ఈ సామరస్యం మానవాళి కి భూటాన్ అందజేస్తున్న సందేశం. అంతరిక్షం, డిజిటల్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల లో నూతన అధ్యాయాల ను గురించి ఆయన వివరించారు. నూతన ఆవిష్కరణ ల కోసం, స్థిరమైన అభివృద్ధి కోసం వాటి ని వినియోగించుకోవాలంటూ యువత ను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం లో భూటాన్ ప్రధాని డాక్టర్ శెరింగ్, జాతీయ అసెంబ్లీ, జాతీయ కౌన్సిల్ లకు చెందిన గౌరవ సభ్యులు కూడా పాల్గొన్నారు.
- భూటాన్ పౌరుల కు అందుబాటు లో నాణ్యమైన ఆరోగ్య రక్షణ సేవల ను మెరుగు పరచడం కోసం ప్రధాని డాక్టర్ శెరింగ్ తీసుకున్న వ్యక్తిగత నిబద్ధత ను భారతదేశం ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు. ఈ విషయం లో, భూటాన్ లో కొత్తగా అన్ని సౌకర్యాల తో సూపర్ స్పెశాలిటీ ఆసుపత్రి ని నెలకొల్పడానికి వీలు గా సాంకేతిక సహకారాన్ని అందించడానికి భారతదేశ నిపుణుల బృందమొకటి ఇటీవల భూటాన్ లో పర్యటించిన విషయాన్ని రెండు పక్షాలు గుర్తించాయి.
- ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరింత విస్తరించుకోవాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. భూటాన్ ప్రధాని డాక్టర్ శెరింగ్ 2018 వ సంవత్సరం డిసెంబర్ లో భారతదేశం లో పర్యటించిన సందర్భం లో భారత ప్రభుత్వం 4 బిలియన్ భారతీయ రూపాయల మేర పరివర్తన వాణిజ్య మద్దతు సౌకర్యం ప్రకటించడం పట్ల రాయల్ గవర్న మెంట్ ఆఫ్ భూటాన్ (ఆర్ జిఒబి) మరోసారి ప్రశంసించింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, ఆర్ధిక లింకేజీ ని బలోపేతం చేయడం కోసం ప్రకటించిన ఈ సహాయంలో మొదటి విడతగా 800 మిలియన్ భారతీయ రూపాయలను విడుదల చేసినందుకు భారత ప్రభుత్వానికి భూటాన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఎస్ఎఎఆర్ సి కరెన్సీ స్వాప్ ఫ్రేమ్ వర్క్ లో భాగం గా కరెన్సీ స్వాప్ లిమిట్ ను పెంచాలన్న భూటాన్ అభ్యర్ధన ను సానుకూలం గా పరిశీలిస్తామని, భూటాన్ ప్రధాని డాక్టర్ శెరింగ్ కు భారతదేశం ప్రధాన మంత్రి శ్రీ మోదీ హామీ ఇచ్చారు. మధ్యంతర చర్యగా ప్రధాన మంత్రి శ్రీ మోదీ తాత్కాలిక స్వాప్ అరెంజ్ మెంట్ లో భాగం గా అదనంగా 100 మిలియన్ అమెరికా డాలర్ల ను ఇవ్వజూపారు.
- ప్రస్తుతం నెలకు 700 మెట్రిక్ టన్నులు గా ఉన్న రాయితీ తో కూడిన ఎల్ పిజి సరఫరా ను, రాయల్ గవర్న మెంట్ ఆఫ్ భూటాన్ విజ్ఞప్తి మేరకు ఒక్కొక్క నెల కు 1000 మెట్రిక్ టన్నుల కు పెంచుతున్నట్లు, భారత ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల లో పెరిగిన ఎల్ పిజి వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
- ప్రధాన మంత్రి శ్రీ మోదీ థింపూ లోని చరిత్రాత్మక సెంతోఖాజోంగ్ వద్ద ప్రార్ధన లు చేశారు. ఇక్కడ భూటాన్ రాష్ట్ర వ్యవస్థాపకుడైన జబ్ డ్రంగ్ నగవాంగ్ నంగ్యల్ విగ్రహం ఉంది. దీనికి భారతదేశం రుణ సహాయం చేసింది. రెండు దేశాల మధ్య నెలకొన్న బలమైన సాంస్కృతిక, నాగరిక సంబంధాల నేపథ్యం లో, ఈ రుణ చెల్లింపు కాల పరిమితి ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రకటించారు. నాలందా విశ్వవిద్యాలయం లో విద్యను అభ్యసించే భూటాన్ విద్యార్థుల ఉపకార వేతనాల ను 2 నుంచి 5 కు పెంచుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
- భారతదేశం, భూటాన్ లు చాలా కాలం గా సహకరించుకొంటున్న రంగాల లోను, నూతన రంగాలలోను మరింత గా సమన్వయాన్ని నెలకొల్పుకోవడానికి మరీ ముఖ్యం గా యువ బృందాల ను ఇటు నుండి అటు కు పంపించుకోవాలని, అటు నుండి ఇటు కు రప్పించుకోవాలని ఇరు పక్షాలు కట్టుబడ్డాయి.
- 2 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన సందర్భం గా స్నేహపూర్వకంగాను, ఆప్యాయంగా ను జరిగిన సంభాషణ లు భారత, భూటాన్ ల మధ్య దీర్ఘ కాలం గా నెలకొన్నటువంటి ప్రత్యేక మైత్రీభావన ను, పరస్పర నమ్మకాన్ని, సహకారాన్ని, గౌరవ భావాన్ని ప్రతిఫలింప చేశాయి.