శ్రీ ఎ. బాలకృష్ణన్ జీ కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం

August 27th, 12:11 pm

వివేకానంద కేంద్రం అఖిల భారత అధ్యక్షుడు శ్రీ ఎ. బాలకృష్ణన్ గారి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సమాజానికి శ్రీ ఎ. బాలకృష్ణన్ గారు అందించిన గొప్ప సేవలను శ్రీ మోదీ స్మరించుకుంటూ, స్వామి వివేకానంద ఆదర్శాలకూ, దేశ సేవకూ ఆయన తన జీవితంలో అయిదు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలాన్ని అంకితం చేశారన్నారు. ‘‘ఆయనకు భారతదేశ ఈశాన్య ప్రాంతంతో విశిష్ట అనుబంధం ఉంది. విద్య, సామాజిక, దేశ నిర్మాణ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్రను పోషించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.

కష్టపడే స్వభావం, జ్ఞానంతో పాటు నైతిక ప్రవర్తన ప్రధానం.. ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

August 27th, 11:24 am

ధర్మబద్ధ సమాజాన్ని నిర్మించడంలో జ్ఞానం, కష్టపడే స్వభావం, నైతిక నడవడిక ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. వెలుగుతో నిండిన, జ్ఞానపూర్వక మార్గాన్ని అనుసరించాల్సిందిగానూ, ప్రయత్నాల్లో జాగరూకత కలిగి, ప్రయత్నాల్లో దృఢనిశ్చయులై ఉంటూ నైతిక, ధర్మబద్ధ సమాజాన్ని ఆవిష్కరించేందుకు తోడ్పాటును అందించాల్సిందిగానూ మనకు ఈ శ్లోకం సూచిస్తోంది.

Our government is fully committed to creating a modern sports ecosystem for the 21st century in India: PM Modi

August 27th, 11:15 am

PM Modi participated in the Khelo India Dialogue programme. Addressing the occasion, he highlighted the contribution of hockey legend Major Dhyan Chand ji to strengthening sporting ties between India and New Zealand. He also stressed the need to expand India’s participation across sporting disciplines ahead of the 2036 Olympics and underlined the role of sports in promoting fitness, building resilience and keeping young people away from drugs.

సోషల్ మీడియా కార్నర్ 26 ఆగష్టు 2026

August 26th, 07:30 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

నేపాల్ ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి వరదల్లో ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

August 26th, 06:02 pm

నేపాల్ ప్రధాని శ్రీ బాలేంద్ర షాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేపాల్‌లో వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని తమ సోదరీసోదరులకు భారతీయులంతా అండగా నిలుస్తారని శ్రీ మోదీ పేర్కొన్నారు.

తెలంగాణ.. సూర్యాపేటలో దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

August 26th, 02:21 pm

తెలంగాణ.. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సంభవించి ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ప్రార్థించారు.

‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం

August 26th, 10:22 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

పరస్పర అభ్యసన-శ్రవణ ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

August 26th, 10:05 am

పరస్పర అభ్యసనం-శ్రవణ ప్రాధాన్యాన్ని వివరించే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. పరస్పర అవగాహనతో అధ్యయనం, శ్రవణం దిశగా ఉత్సాహం చూపేవారు జ్ఞానుల ప్రశంసలు పొందుతారనే ఆ సుభాషిత అర్థాన్ని ఆయన వివరించారు. అలాంటి వారు స్వార్థ త్యాగులుగా నిలవడమేగాక నిగూఢ యోచనల నుంచి విముక్తులవుతారని తెలిపారు. అలాగే, అన్ని విధాలా ఆనందోత్సాహాలలో వర్ధిల్లుతారని వ్యాఖ్యానించారు:

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

August 26th, 10:01 am

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఓనం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

August 26th, 09:58 am

ఓనం పండగ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఓనం పండగ కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండగ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పండగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సుల స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.