ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 28th, 12:15 pm

ప్రారంభోత్సవం అయిపోయిందా? ప్రారంభోత్సవం అయిపోయిందా ? లేదు.. సగం పనే పూర్తయింది. నేను కేవలం ఆ కర్టెన్‌ను (తెరను) మాత్రమే తొలగించాను. కానీ నేడు ఇక్కడ ఉన్న మీ అందరి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీయండి. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయండి.. మీరే దీనిని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినట్లుగా ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. ఇది మీ ఆస్తి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కష్టం.. అందుకే దీని ప్రారంభోత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ మీ చేతులెత్తి, ఫ్లాష్‌లైట్లను పూర్తిగా చూపించండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయింది.

సుమారు రూ. 11,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ తొలి దశను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 28th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తపరుస్తూ.. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ అభియాన్‌లో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఈ విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేసి, నేడు తానే ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ భారీ విమానాశ్రయం పేరు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి ఉండటం మరో విశేషమని చెబుతూ.. నన్ను ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిన ఈ రాష్ట్ర గుర్తింపు, ఇప్పుడు ఈ అద్భుతమైన విమానాశ్రయంతో ముడిపడి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 25th, 01:06 pm

ఉత్తరప్రదేశ్ ప్రముఖ, కర్మయోగి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, మా పాత శక్తివంతమైన సహచరుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జనరల్ వీకే సింగ్ జీ, సంజీవ్ బల్యాన్ జీ, ఎస్పీ సింగ్ బఘేల్ జీ మరియు బి ఎల్ వర్మ జీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి జీ, శ్రీ జై ప్రతాప్ సింగ్ జీ, శ్రీకాంత్ శర్మ జీ, భూపేంద్ర చౌదరి జీ, శ్రీ నందగోపాల్ గుప్తా జీ, అనిల్ శర్మ జీ, ధరమ్ సింగ్ సైనీ జీ, అశోక్ కటారియా జీ మరియు శ్రీ జి ఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు డా. మహేశ్ శర్మ జీ, శ్రీ సురేంద్ర సింగ్ నగర్ జీ మరియు శ్రీ భోలా సింగ్ జీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధీరేంద్ర సింగ్ జీ, వేదికపై కూర్చున్న ఇతర ప్రజాప్రతినిధులందరూ మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా.

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 01:01 pm

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.

నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి నవంబర్ 25 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

November 23rd, 09:29 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 నవంబర్ 25 న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో ఉత్తర్ప్రదేశ్ లో నోయెడా ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ (ఎన్ఐఎ) కు గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోని జేవర్ లో శంకుస్థాపన చేయనున్నారు. దీనితోఉత్తర్ ప్రదేశ్ భారతదేశం లో అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాల ను కలిగి ఉండేటటువంటిఒకే రాష్ట్రం కానున్నది.