పంజాబ్, హర్యానాలో మిశ్రమ వార్షిక చెల్లింపు విధానంలో రూ. 1878.31 కోట్లతో 19.2 కి.మీ. పొడవైన 6 వరుసల రద్దీ రహిత జిరాక్‌పూర్ బైపాస్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
April 09th, 03:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. పంజాబ్, హర్యానాల్లో ఎన్‌హెచ్ (ఓ) కింద, మిశ్రమ వార్షిక చెల్లింపు విధానంలో ఆరు వరుసల జిరాక్‌పూర్ బైపాస్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-7 (జిరాక్‌పూర్-పటియాలా) జంక్షన్ నుంచి మొదలై జాతీయ రహదారి-5 (జిరాక్‌పూర్- పర్వనూ) జంక్షన్ వద్ద ముగుస్తుంది. దీని మొత్తం పొడవు 19.2 కి.మీ. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళిక కింద సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.