ఉజ్బెకిస్తాన్‌ యువత ఉత్సాహం పట్ల ప్రధానమంత్రి హర్షం

August 29th, 05:46 pm

ఉజ్బెకిస్తాన్‌లో తన పర్యటనకు ముందు ఆ దేశ యువ మిత్రులు చూపిన ఉత్సాహం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. వారి ఉత్సాహాన్ని తెలియజేస్తున్న ఒక వీడియోను పంచుకుంటూ, వారు హిందీలో ఇంత అందంగా మాట్లాడుతుంటే చూడటం హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం

August 26th, 10:22 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రపంచం ఇప్పుడు భారతీయ స్టార్టప్‌ల వైపు చూస్తూ ఉండాలి: స్పేస్ స్టార్టప్ సీఈఓలతో సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీ

August 23rd, 11:42 am

ప్రధాని మోదీ స్పేస్ స్టార్టప్ సీఈఓలతో సంభాషిస్తూ, ఒక కొత్త రంగంలోకి ప్రవేశించేందుకు వారు చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ సంభాషణలో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం, భారతీయ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు, రోబోటిక్ అంతరిక్ష నౌకలు, తరచుగా జరిగే రాకెట్ ప్రయోగాలు మరియు భారతదేశపు మొట్టమొదటి స్పేస్-ఫార్మా స్టార్టప్ వంటి అనేక ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది.

అంతరిక్ష స్టార్టప్ సీఈఓలతో ముచ్చటించిన ప్రధాని మోదీ

August 23rd, 11:30 am

ప్రధాని మోదీ అంతరిక్ష స్టార్టప్ సీఈఓలతో ముచ్చటించి, ఒక కొత్త రంగంలోకి ప్రవేశించేందుకు వారు చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ ముచ్చటలో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం, భారతీయ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు, రోబోటిక్ అంతరిక్ష నౌకలు, తరచూ రాకెట్ ప్రయోగాలు, భారతదేశపు మొట్టమొదటి స్పేస్-ఫార్మా స్టార్టప్ వంటి పలు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది.

ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

August 21st, 09:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విధాన రూపకర్తలు, అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి- ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంపై ప్రగాఢ ఆనందం వెలిబుచ్చారు.

ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 21st, 08:25 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విధాన రూపకర్తలు, అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి- ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంపై ప్రగాఢ ఆనందం వెలిబుచ్చారు.

అంతరిక్ష రంగ అంకుర సంస్థల సీఈవోలు, వ్యవస్థాపకులతో ప్రధాని సమావేశం

August 21st, 02:21 pm

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను, కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షించే దాని సామర్థ్యాన్ని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, పరిశ్రమల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, యువతను అంతరిక్షం వైపు ప్రోత్సహించేందుకు మరింతగా కృషి చేయాలని ఆయన ప్రోత్సహించారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు-విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి అధ్యక్షతన 3వ అత్యున్నత స్థాయి సమావేశం

August 20th, 09:37 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం తన అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వంలోని భారత ప్రభుత్వ కార్యదర్శులతో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, భద్రత, విదేశీ వ్యవహారాలు, పరిపాలన సంబంధ వ్యవహారాలపై వారితో చర్చించారు. న్యూఢిల్లీలోని నం.7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోగల అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన కూలంకషంగా సమీక్షించారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు

August 15th, 04:44 pm

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈరోజు ఎర్రకోట ప్రాంగణం నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, గత 12 సంవత్సరాలుగా తయారీ రంగం, డిజిటల్ వృద్ధి మరియు పౌర సేవల రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆయన సమర్పించారు. జాతీయ ఆశయాలను సాధించడం కోసం ఏడు కీలక రంగాలతో కూడిన పరివర్తనాత్మక సప్తధారను కూడా ఆయన ఆవిష్కరించారు.

12 ఏళ్ల పరివర్తన: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

August 15th, 01:18 pm

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 12 ఏళ్లలో భారత్ సాధించిన పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సదుపాయాలు, ఇంధన భద్రత, యువత సాధికారత, ఆవిష్కరణలు, సామాజిక భద్రత, ఇతర కీలక రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరించారు.

ఏడాదిలో కోటి మంది యువతకు కృత్రిమ మేధ నైపుణ్య శిక్షణ: ప్రధానమంత్రి ప్రకటన

August 15th, 01:01 pm

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కృత్రిమ మేధ విద్య, క్రీడలు, పౌర రక్షణ, సెమీకండక్టర్ తయారీ, అణు విద్యుత్, మహిళా సాధికారత రంగాలలో అనేక నూతన కార్యక్రమాలను, నిర్దేశిత లక్ష్యాలను ప్రకటించారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: వికసిత్ భారత్ దిశగా తదుపరి దశ కోసం ప్రధాని పిలుపు

August 15th, 12:51 pm

2047 నాటికి వికసిత్ భాతర్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. దేశ పనితీరు, ఆలోచన విధానం, ఆశయాల పరిధిలో మార్పు రావాలని కోరుతూ.. ప్రజలు, ప్రభుత్వాలు, పరిశ్రమలు, రైతులు, యువత, సమాజంలోని ఇతర వర్గాలు కలసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారు.

మీరు కేవలం పతకాల సంఖ్యను పెంచడమే కాదు, ఒక తరాన్నే తీర్చిదిద్దారు: సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ప్రధాని మోదీ

August 10th, 10:00 am

గత 12 ఏళ్లుగా తాను క్రీడాకారులను క్రమం తప్పకుండా కలుస్తున్నానని హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ భారత సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ముచ్చటించారు. ఛాంపియన్లు తమ సన్నాహాలు, కార్గిల్ విజయ్ దివస్ నాడు పాకిస్థాన్‌ను ఓడించడం మరియు ఖేలో ఇండియా పథకం విజయంతో సహా సీడబ్ల్యూజీలో తమ అనుభవాలను పంచుకున్నారు. జో ఖేలేగా, వో ఖిలేగా (ఎవరు ఆడతారో, వారే గెలుస్తారు) అనే పదబంధంతో ప్రధాని మోదీ ఈ సంభాషణను ముగించారు.

కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

August 10th, 09:30 am

కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు. గత దశాబ్ద కాలంగా భారత క్రీడా రంగం మారుతున్న తీరును ప్రస్తావిస్తూ… గత 12-13 ఏళ్ల పదవీ కాలంలో జాతీయ క్రీడాకారులను తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించటం సాధారణ, అపూర్వమైన సంప్రదాయంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. సాధారణ ప్రచారాల కన్నా అంకితభావం, నిరంతర కృషితో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు... పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. పాఠశాలలకు వెళ్లి మనం చెప్పిన మాటల కన్నా, మీ పతకాలు వారికి ఎక్కువ స్ఫూర్తిని కలిగిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

జీవితంలో మీ ఉత్సుకతను సజీవంగా ఉంచుకోండి: ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ

August 08th, 11:15 am

ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని ఉత్సుకత, ధైర్యం మరియు నూతన ఆవిష్కరణ స్ఫూర్తితో స్వీకరించాలని వారిని కోరారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిశోధనలు కొనసాగించాలని, వికసిత భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి దోహదపడాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం

August 08th, 11:00 am

ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని జిజ్ఞాస, ధైర్యం, నూతన ఆవిష్కరణల స్ఫూర్తితో స్వీకరించాలని వారిని కోరారు. యువత నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిశోధనలు కొనసాగించాలని, వికసిత భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతీయ యువత కృషిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

August 04th, 11:25 am

భారతీయ యువతి కృషిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం యువతకు గట్టిగా అండగా నిలుస్తుంది: ప్రధాని మోదీ

August 02nd, 11:25 am

‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీసీ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, యువతను మాదకద్రవ్యాలనే ప్రాణాంతక ముప్పుకు దూరంగా ఉంచడమే ఈ ప్రచార లక్ష్యమని ఆయన నొక్కి చెప్పారు. యువతను భారతదేశపు అమృత తరం అని అభివర్ణిస్తూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ, ఈ ఉచ్చు నుండి యువతను కాపాడాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ రోజు తీసుకున్న ఈ ప్రతిజ్ఞ రాబోయే 100 వారాల పాటు కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లో భాగంగా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

August 02nd, 11:00 am

వికసిత భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 28,000 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన కోటిమందికి పైగా యువతకు ప్రధానమంత్రి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరిస్తూ, ఈ సమావేశాన్ని ఒక ప్రగాఢమైన జాతీయ ప్రతిజ్ఞగా అభివర్ణించారు. ఈరోజు మన దేశవాసులందరం ఒక గొప్ప, అత్యంత ముఖ్యమైన సంకల్పం కోసం ఏకమయ్యాం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త్ యువ’ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి

August 01st, 04:04 pm

‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా యుక్త్ యువ’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించనున్నారు. యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచేలా ప్రేరేపించడం, వారి కమ్యూనిటీల్లో సానుకూల సామాజిక మార్పునకు యువత కృషి చేసేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.