29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మారిషస్ ప్రధానమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 24th, 09:54 pm

మారిషస్ ప్రధానమంత్రి గౌరవనీయ డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులామ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం (ఈ నెల 24న) టెలిఫోన్‌లో మాట్లాడారు.

78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని ప్రసంగం

May 20th, 04:42 pm

ప్రముఖులు, ప్రతినిధులకు నమస్కారం. 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

జెనీవాలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78వ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

May 20th, 04:00 pm

జెనీవాలో జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78వ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సమావేశాన్నుద్దేశించి మాట్లాడుతూ, ఈ ఏడాది ఇతివృత్తమైన ‘ఆరోగ్యంపై ప్రపంచ ఐక్యత (వన్ వరల్డ్ ఫర్ హెల్త్)’ను ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన సభకు హాజరైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం భారత లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉందన్నారు. 2023 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సందర్భంగా ‘ఒక భూమి, ఒకే ఆరోగ్యం’ గురించి మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమ్మిళితత్వం, సమగ్ర దృక్పథం, సహకారంపైనే భవిష్యత్ ఆరోగ్యకరమైన ప్రపంచం ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.