ప్రధానమంత్రిని కలిసిన ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి
April 15th, 09:54 am
ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి నిన్న యమునానగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిశారు. యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయడంలో ఆమె కృషిని ప్రధాని ప్రశంసించారు.నమ్మశక్యం కాని భక్తి! ప్రధానమంత్రి మోదీని కలవడానికి 14 సంవత్సరాలుగా హర్యానా వ్యక్తి చెప్పులు లేకుండా నడుస్తున్నాడు
April 14th, 06:04 pm
ఈరోజు యమునానగర్‌లో జరిగిన బహిరంగ సభలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్యానాలోని కైతాల్‌కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్‌ను కలిశారు. పద్నాలుగు సంవత్సరాల క్రితం, శ్రీ కశ్యప్ ఒక ప్రతిజ్ఞ చేశారు - నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యే వరకు మరియు ఆయనను స్వయంగా కలిసే వరకు తాను పాదరక్షలు ధరించనని.హర్యానాలోని యమునా నగర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం/శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 12:00 pm
ప్రజాదరణ చూరగొన్న హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహరల్ లాల్, ఇందర్‌జీత్ సింగ్, శ్రీ క్రిషన్‌పాల్, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు-శాసనసభ సభ్యులు సహా నా ప్రియ సోదరీసోదరులారా... హర్యానాలోని సహోదరులారా... మీకందరికీ ఇవే మోదీ శుభాకాంక్షలు!హర్యానాలోని యమునానగర్ లో అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
April 14th, 11:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని యమునా నగర్లో పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హర్యానా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవిత్ర భూమి హర్యానాకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. ఇది సరస్వతీ మాత జన్మస్థలం, మంత్రాదేవి నివాసం, పంచముఖి హనుమాన్ జీ స్థానం, అలాగే పవిత్ర కపాలమోచన్ సాహిబ్ ఉన్న ప్రదేశంగా పేర్కొంటూ, హర్యానా సంస్కృతి, భక్తి అంకితభావ సంగమం అని ఆయన వర్ణించారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. బాబాసాహెబ్ దార్శనికత, ప్రేరణ ఇప్పటికీ భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న హర్యానాలో పర్యటించనున్న ప్రధానమంత్రి
April 12th, 04:48 pm
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు హిసార్‌కు చేరుకుని, అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లే వాణిజ్య విమానాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అలాగే హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.