ఫిబ్రవరి 21న హెచ్సీఎల్ - ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని
February 20th, 06:50 pm
ఉత్తరప్రదేశ్లోని యమునా ఎక్స్ప్రెస్వే పారిశ్రామిక అభివృద్ధి అథారిటీ (వైఈఐడీఏ)లో హెచ్సీఎల్ - ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ఇండియా చిప్ కంపెనీ భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. 2026 ఫిబ్రవరి 21న సాయంత్రం 5 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.