Prime Minister reaffirms commitment to wildlife conservation on World Wildlife Day; shares Sanskrit Subhashitam
March 03rd, 08:56 am
On World Wildlife Day, PM Modi said it is a day to acknowledge everyone working towards wildlife protection and reaffirm our commitment to conservation, sustainable practices and protecting habitats. He added that our scriptures pray for the welfare of all living beings and inspire sensitivity towards wildlife. He also shared a Sanskrit verse highlighting the importance of conserving both tigers and forests.వన్యప్రాణుల సంరక్షణ పట్ల దేశ నిబద్ధతను ప్రముఖంగా చాటిన ప్రధానమంత్రి
March 03rd, 07:14 pm
ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వివిధ వన్యప్రాణుల సంరక్షణ పట్ల దేశం పూర్తి నిబద్ధత కలిగి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తెలిపారు. మైగవ్ఇండియా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్ట్ కు ప్రధానమంత్రి స్పందిస్తూ:గత పదేళ్లలో, పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా కూడా పెరిగింది.. ఇది వన్యప్రాణుల సంరక్షణకు మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, వాటికి చాలా కాలం కొనసాగగల నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో సూచిస్తోంది: ప్రధానమంత్రి
March 03rd, 12:36 pm
గత పది సంవత్సరాల్లో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ, వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను వాటికి కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం తెలియజేస్తోందన్నారు.నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మన భూమి మీదున్న అపురూప జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తామన్న నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
March 03rd, 08:37 am
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఈ రోజు. మన భూగ్రహంలో అలరారుతున్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలన్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.23 ఫిబ్రవరి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 119 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 23rd, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతిచోటా క్రికెట్ వాతావరణం ఉంది. క్రికెట్‌లో సెంచరీ థ్రిల్ ఏమిటో మనందరికీ బాగా తెలుసు. ఈ రోజు నేను మీతో క్రికెట్ గురించి మాట్లాడను. కానీ భారతదేశం అంతరిక్షంలో చేసిన అద్భుతమైన సెంచరీ గురించి మాట్లాడతాను. గత నెలలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని దేశం యావత్తూ తిలకించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మన అంతరిక్ష రంగ ప్రయాణం చాలా సాధారణ రీతిలో ప్రారంభమైంది. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మన శాస్త్రవేత్తలు ముందుకు సాగుతూ, విజయం సాధించారు. కాలక్రమేణా అంతరిక్ష రంగ ప్రయాణంలో మన విజయాల జాబితా చాలా పెద్దదిగా మారింది. అది ప్రయోగ వాహన తయారీ కావచ్చు. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్-1 విజయం కావచ్చు. ఒకే రాకెట్‌తో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అపూర్వమైన కృషి కావచ్చు. ఏదైనా ఇస్రో విజయాల పరిధి చాలా పెద్దది. గత 10 సంవత్సరాలలోనే దాదాపు 460 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇందులో ఇతర దేశాలకు చెందిన అనేక ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో మనం గమనిస్తోన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ఈ రోజు అంతరిక్ష రంగం మన యువతకు ఇష్టమైనదిగా మారడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రాంతంలో స్టార్టప్‌లు, ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థల సంఖ్య వందలకు చేరుకుంటుందని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉంటారు! జీవితంలో ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన పని ఏదైనా చేయాలనుకునే మన యువతకు అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన ఎంపికగా మారుతోంది.ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల ఔత్సాహికులకు ప్రధాని శుభాకాంక్షలు
March 03rd, 10:12 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల ఔత్సాహికులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి సంరక్షకులకు, ఔత్సాహికులకు ప్రధాని శుభాకాంక్షలు
March 03rd, 06:50 pm
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి సంరక్షకులకు, ఔత్సాహికులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ ల మధ్య వర్చువల్ సమిట్
March 03rd, 09:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే ఈ నెల 5న, స్వీడన్ ప్రధాని గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ తో కలసి ఒక వర్చువల్ సమిట్ లో పాల్గొననున్నారు.