ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు
October 06th, 04:28 pm
న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత పారా అథ్లెట్ బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఈ పోటీల్లో భారత్ అత్యుత్తమ సంఖ్యలో పతకాలను సాధించింది. 6 స్వర్ణాలతో సహా 22 పతకాలను సొంతం చేసుకుని, జాతీయ పారా క్రీడల ప్రయాణంలో సరికొత్త విజయాన్ని నమోదు చేసింది. ఈ తరహా ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మొదటిసారి భారత్‌లో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.