ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలని, ఊబకాయాన్ని ఎదుర్కోవాలని ప్రధానమంత్రి పిలుపు
April 19th, 01:13 pm
ప్రజలందరూ అవగాహనతో కూడిన ఆహార పద్దతులను అవలంబించాలని, ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ పిలుపునిచ్చారు. చిన్న చిన్న ప్రభావవంతమైన మార్పుల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని.. నూనెల వాడకం తగ్గించటం వంటి పనులు పూర్తి ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి గణనీయంగా దోహదం చేస్తాయని అన్నారు.