ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో మొక్కను నాటిన ప్రధానమంత్రి
June 05th, 10:11 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొక్కను నాటారు.డామన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 07:20 pm
మీరంతా ఇక్కడకు ఎలాగైతే వచ్చారో అలాగే లక్షద్వీప్‌లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనతో అనుసంధానమయ్యారు. ఈరోజు లక్షద్వీప్‌లో అభివృద్ధికి ఒక కొత్త ఆరంభం జరిగింది. లక్షద్వీప్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఒక కొత్త ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడంతో పాటు కొన్ని పథకాలకు శంకుస్థాపనలు కూడా చేశాం.డామన్‌లో సుమారు రూ. 2,970 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు... ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 07:15 pm
డామన్‌లో సుమారు రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన గత పర్యటనను గుర్తుచేసుకుంటూ, తాను గతంలో చేసిన పరిశీలన ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన మన దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నివసించే వివిధ ప్రాంతాల ప్రజలతో యావత్ దేశపు అందమైన దృశ్యాన్ని అందిస్తూ, మినీ ఇండియాకు సజీవ ఉదాహరణగా డామన్ నిలుస్తోంది అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 04:30 pm
విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 04:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
June 05th, 09:53 am
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ సంరక్షణ పట్ల మక్కువను కనబరిచే వారందరినీ ఆయన ప్రశంసించారు.29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఢిల్లీలో భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్క నాటిన ప్రధానమంత్రి
June 05th, 01:33 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరచడంలో భాగంగా ఆయన ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ఒక మొక్కను నాటారు.పట్టణాల్లో స్వచ్ఛ, హరిత రవాణాను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధానమంత్రి
June 05th, 12:46 pm
పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధిని, హరిత రవాణా సాధనాలను ప్రోత్సహించే ధ్యేయంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటిన ప్రధానమంత్రి
June 05th, 11:50 am
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటి దానికి నీళ్లు పోశారు. గుజరాత్‌లో కచ్ఛ్‌కు చెందిన సాహసిక మాతృమూర్తులు, సోదరీమణులు కానుకగా ఆయనకు అందజేసిన మొక్క అది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ కాలంలో కచ్ఛ్‌కు చెందిన మాతృమూర్తులు, సోదరీమణులు మొక్కవోని ధైర్య-సాహసాలతో పాటు గొప్ప దేశభక్తిని ప్రదర్శించారు. ప్రధాని ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన సంగతిని గుర్తుచేసుకున్నారు...నాకు బహుమతిగా ఇచ్చిన సిందూర్ మొక్క మన దేశ నారీశక్తి శౌర్యంతో పాటు ప్రేరణకు కూడా ఒక ప్రబలమైన ప్రతీకగా అలరారుతుందని ప్రధానమంత్రి అన్నారు.పర్యావరణ పరిరక్షణ పట్ల అంకితభావాన్ని మరింత పెంపొందించుకోవాలని దేశ పౌరులకు ప్రధాని పిలుపు
June 05th, 09:07 am
పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను దేశ పౌరులు మరింత పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని మరింత పచ్చగా, మెరుగ్గా మార్చేందుకు క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నవారిని అభినందించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, ‘ఏక్ పేడ్ మాఁ కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మొక్కల పెంపకం కార్యక్రమానికి నేతృత్వం వహించనున్న ప్రధాని
June 04th, 01:20 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, గురువారం (జూన్ 5న) ఉదయం 10.15 గంటలకు న్యూఢిల్లీ లోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో చేపట్టే మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించనున్నారు. పర్యావరణ సంరక్షణ, హరిత ప్రధాన రవాణా సదుపాయాలు .. వీటి పట్ల భారత్ నిబద్దతను ప్రధాని పునరుద్ఘాటించనున్నారు.రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.జి-7 విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
June 14th, 09:54 pm
మున్ముందుగా నన్ను ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించడంతోపాటు అత్యంత గౌరవ మర్యాదలతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మెలోనీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాన్సలర్ ఓలాఫ్ షోల్ట్స్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జి-7 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకమైనదేగాక, దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ మేరకు కూటమి 50వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయ మిత్రులైన జి-7 దేశాధినేతలందరికీ నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.జి-7 సదస్సులో కృత్రిమ మేధ ఇంధనం ఆఫ్రికా మధ్యధరా ప్రాంతం అంశాలపై విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 14th, 09:41 pm
ఇటలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
June 05th, 02:21 pm
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. శ్రీ నరేంద్ర మోదీ దిల్లీ లోని బుద్ధ జయంతి పార్కు లో ఒక రావి మొక్క ను నాటారు. మన భూ గ్రహాన్ని మెరుగైంది గా మలచడం లో అందరు వారి వంతు తోడ్పాటు ను అందించవలసింది అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. గడచిన పది సంవత్సరాల లో భారతదేశం చేపట్టిన అనేక ఉమ్మడి ప్రయాస లు దేశం లో అటవీ ప్రాంత విస్తీర్ణం పెరిగేందుకు దారితీశాయి అని ఆయన అన్నారు. స్థిరమైన అభివృద్ధి దిశ లో మనం పడుతున్న తపన లో ఇది ఒక మహత్కార్యం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 సందర్భంగా ప్రధాన మంత్రి వీడియో సందేశం
June 05th, 03:00 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, మన దేశానికి, ప్రపంచానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించాలన్నదే ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం. గత 4-5 సంవత్సరాలుగా, ప్రపంచ చొరవ కంటే ముందే భారతదేశం ఈ సమస్యపై స్థిరంగా పనిచేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించడానికి 2018లోనే భారత్ రెండు స్థాయిల్లో చర్యలు ప్రారంభించింది. ఒకవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తూనే మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ ను తప్పనిసరి చేశాం. ఫలితంగా భారత్ లో దాదాపు 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ను తప్పనిసరిగా రీసైక్లింగ్ చేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వార్షిక ప్లాస్టిక్ వ్యర్థాలలో ఇది 75 శాతం. నేడు, సుమారు 10,000 మంది ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు , బ్రాండ్ యజమానులు ఈ ప్రయత్నంలో చురుకుగా పాల్గొంటున్నారు.ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటైన సమావేశాన్నిఉద్దేశించి వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 05th, 02:29 pm
ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.జర్మనీలో జరిగిన జి7 సమ్మిట్‌లో 'స్ట్రాంగర్ టుగెదర్: అడ్రస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అడ్వాన్సింగ్ జెండర్ ఈక్వాలిటీ' సెషన్‌లో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
June 27th, 11:59 pm
ప్రపంచ ఉద్రిక్తత వాతావరణం మధ్య మనం కలుస్తున్నాము. భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో కూడా, మేము సంభాషణ మరియు దౌత్య మార్గాన్ని నిరంతరం కోరాము. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత ప్రభావం కేవలం యూరప్‌కే పరిమితం కాదు. ఇంధనం, ఆహార ధాన్యాల ధరలు పెరగడం అన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన మరియు భద్రత ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నాయి. ఈ సవాలు సమయంలో, భారతదేశం అవసరమైన అనేక దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. మేము గత కొన్ని నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయంగా సుమారు 35,000 టన్నుల గోధుమలను పంపాము. మరియు అక్కడ భారీ భూకంపం తర్వాత కూడా, సహాయ సామాగ్రిని అందించిన మొదటి దేశం భారతదేశం. మా పొరుగున ఉన్న శ్రీలంకకు కూడా ఆహార భద్రత కల్పించేందుకు మేము సహాయం చేస్తున్నాము.Prime Minister’s remarks at the session on ‘Investing in a better Future: Climate, Energy, Health’ at G7 Summit in Germany
June 27th, 07:47 pm
At the session on ‘Investing in a better Future: Climate, Energy, Health’ during G7 Summit in Germany, PM Modi said, There is a misconception that poor countries and poor people cause more damage to the environment. But, India’s history of over thousands of years completely refutes this view.