బేగమ్ ఖలీదా జియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి

December 01st, 10:30 pm

బంగ్లాదేశ్ ప్రజా జీవనం లో ఏళ్ల తరబడి సేవలను అందించిన బేగమ్ ఖలీదా జియా ఆరోగ్య స్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె శీఘ్రంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అన్ని విధాలుగా సాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ మోదీ అన్నారు.

బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 01st, 06:18 pm

బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు చెక్కుచెదరని సంకల్పాన్నీ, అత్యున్నత వృత్తి నైపుణ్యాన్నీ బీఎస్ఎఫ్ సూచిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది సేవలందిస్తారు. వారి శౌర్యంతోపాటు మానవతా స్ఫూర్తి కూడా అసాధారణమైనది అని మోదీ అన్నారు.

శ్రీ ఎల్.కె. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

November 08th, 08:23 pm

శ్రీ ఎల్.కె. అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి శ్రీ ఎల్.కె. అద్వానీ విశిష్టమైన సేవలు అందించారని, అవి మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయని శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

October 28th, 07:56 am

ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్ఎస్‌జీ స్థాపక దినోత్సవం.. ఎన్ఎస్‌జీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

October 16th, 09:09 pm

ఎన్ఎస్‌జీ స్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ఎస్‌జీ సిబ్బంది సాటి లేని పరాక్రమాన్నీ, అంకిత భావాన్నీ ప్రశంసించారు. ‘‘ఉగ్రవాద భూతం బారి నుంచి మన దేశ ప్రజలను కాపాడుతుండటంలో ఎన్ఎస్‌జీ కీలకపాత్రను పోషించింది. ఈ దళం మన దేశ పౌరుల భద్రతకు పూచీపడటంతో పాటు దేశ ముఖ్య సంస్థలను కూడా కంటికి రెప్పలా చూసుకుంటోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

నవరాత్రి సందర్భంగా రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 23rd, 09:23 am

నవరాత్రి సందర్భంగా రెండో రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించారు.

అనువాదం: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నిర్వహించిన ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 20th, 11:00 am

భావ్‌నగర్‌లో ఒక ఉత్తేజకరమైన వాతావరణం కనిపిస్తోంది. వేదిక ముందున్న జన సంద్రం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద జనసమూహం నాకు ఆశీస్సులు ఇచ్చేందుకు వచ్చింది. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 20th, 10:30 am

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. 'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ఈ నెల 17న తనకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు గొప్ప బలమన్నారు. దేశంలో విశ్వకర్మ జయంతి నుంచి గాంధీ జయంతి వరకు అంటే ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. గత 2-3 రోజుల్లో గుజరాత్‌లో అనేక సేవా కార్యక్రమాలు.. వందలాది ప్రదేశాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారన్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మంది రక్తదానం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. అనేక నగరాల్లో నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమాల్లో లక్షలాది మంది పౌరులు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,000 కి పైగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామనీ, ప్రజలకు.. ముఖ్యంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు

September 17th, 08:27 pm

తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆప్యాయత నిండిన సందేశాలు అందించిన జనశక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ తనకు శక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

PM Modi expresses gratitude to world leaders for birthday wishes

September 17th, 03:03 pm

The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.

గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

July 10th, 09:04 am

గురు పూర్ణిమ విశిష్ట సందర్భం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

July 01st, 09:37 am

వైద్యుల దినోత్సవం సందర్బంగా వైద్యులందరికీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నైపుణ్యంతో, సేవాభావంతో మన వైద్యులు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొన్నారు. వారు కనబరిచే కరుణ కూడా అంతే విశిష్టమైంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

సిక్కిం 50 వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

May 16th, 10:13 am

సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సిక్కిం రాష్ట్రంగా అవతరించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనది! ప్రకృతి రమణీయత, సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలు, కష్టపడే తత్వం ఉన్న ప్రజలతో కూడిన రాష్ట్రమే సిక్కిం’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

November 08th, 08:50 pm

శ్రీ ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం ఆరాధించదగిన రాజనీతిజ్ఞుడు శ్రీ ఎల్‌కే అద్వానీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు అద్వానీ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు

October 16th, 01:58 pm

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ని కలిసిన సంగీతకారుడు డాక్టర్ భరత్ బల్వల్లి, పాత్రికేయుడు అభిజిత్ పవార్

October 14th, 10:50 pm

ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు డాక్టర్ భరత్ బల్వల్లి.. సకల్ మీడియా పాత్రికేయుడు శ్రీ అభిజిత్ పవార్‌లు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి దేవికి ప్రధాని ప్రార్థనలు

October 11th, 08:29 am

నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి దేవికి ప్రధాని ప్రార్థనలు చేశారు.

నవరాత్రి పర్వదినాల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవిని పూజించిన ప్రధాని

October 10th, 07:35 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవికి ప్రార్థన చేశారు.

నవరాత్రి ఆరో రోజు- కాత్యాయనీ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

October 08th, 09:07 am

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో రోజున కాత్యాయనీ అమ్మవారిని ప్రధానమంత్రి అర్చించారు.

నవరాత్రి అయిదో రోజున స్కందమాతను అర్చించిన ప్రధానమంత్రి

October 07th, 08:37 am

నవరాత్రి పర్వదినాల్లో అయిదో రోజైన నేడు, స్కందమాత రూపంలోని అమ్మవారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజించారు.