ప్రపంచంలోని 31 చిత్తడి నేల నగరాల జాబితాలో చేరిన ఇండోర్, ఉదయ్‌పూర్‌లను అభినందించిన ప్రధానమంత్రి
January 25th, 05:52 pm
ప్రపంచంలోని 31 చిత్తడి నేల నగరాల జాబితాలో చేరిన ఇండోర్, ఉదయ్‌పూర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఈ గుర్తింపు సుస్థిర అభివృద్ధి, ప్రకృతి - పట్టణాభివృద్ధి మధ్య సమతుల్యత పెంపొందించడం పట్ల భారతదేశ బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.