కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు-విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి అధ్యక్షతన 3వ అత్యున్నత స్థాయి సమావేశం
August 20th, 09:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం తన అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వంలోని భారత ప్రభుత్వ కార్యదర్శులతో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, భద్రత, విదేశీ వ్యవహారాలు, పరిపాలన సంబంధ వ్యవహారాలపై వారితో చర్చించారు. న్యూఢిల్లీలోని నం.7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోగల అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన కూలంకషంగా సమీక్షించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
August 06th, 06:55 pm
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.PM chairs CCS Meeting to review the situation in context of ongoing West Asia Conflict
July 30th, 07:38 pm
Prime Minister Shri Narendra Modi today chaired a meeting of the Cabinet Committee on Security (CSS) to review the situation in the context of ongoing West Asia conflict and measures taken by various Ministries and Departments. This was the 4th special CCS meeting on the issue.పార్లమెంటు వర్షాకాల సమావేశాలు - 2026 ప్రారంభం ప్రధాని ప్రసంగం
July 20th, 10:30 am
రుతుపవనాల సానుకూల ప్రభావం మొదలైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. రుతుపవనాలయినా, పార్లమెంటు సమావేశాలయినా.. క్రియాశీలంగా ఉంటేనే అవెంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవి ప్రయోజనకరంగా ఉంటేనే దేశ శ్రేయస్సుకు, సమస్త జీవరాశి సంక్షేమానికి దోహదపడతాయి. ఇదే ఆశతో రుతుపవనాలు సానుకూలంగా కొనసాగాలని, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ఫలప్రదంగా సాగాలని ఆశిస్తూ ప్రార్థిద్దాం.వర్షాకాల సమావేశాలు- 2026 ప్రారంభం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన
July 20th, 10:00 am
వర్షాకాల సమావేశాలు - 2026 ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు ప్రాంగణంలో ఈ రోజు మీడియాతో మాట్లాడారు. కొత్త పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి విచ్చేసిన పాత్రికేయులకు స్వాగతం పలికారు. ప్రకృతి వాతావరణ సరళికి, శాసనపరమైన సత్ఫలితాలకూ మధ్య ఒక ఆలోచనాత్మకమైన పోలికను చెప్పారు. క్రియాశీలక, ముందుచూపుతో కూడిన చర్యలు దేశ సమగ్ర శ్రేయస్సుపై ఎంతగానో ప్రభావం చూపుతాయన్నారు. అంతిమంగా ప్రతి జీవరాశికి ప్రయోజనం చేకూర్చే అత్యంత నిర్మాణాత్మక ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘రుతుపవనాలు క్రియాశీలంగా కొనసాగాలని, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ఫలప్రదంగా సాగాలని మేం ప్రార్థిస్తున్నాం’’ అని శ్రీ మోదీ అన్నారు.భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
July 11th, 07:59 am
న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ చరిత్రాత్మక ఘట్టం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, సహకారంలో ఒక కొత్త దిశకు మార్గనిర్దేశం చేస్తోంది.రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం
July 04th, 12:50 pm
ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 30th, 09:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో టెలిఫోన్ లో మాట్లాడారు.2026 వ సంవత్సరం జూన్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 135 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 28th, 11:30 am
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్‌కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫోన్లో మాట్లాడిన ఖతార్ అమీరు
June 23rd, 10:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఖతార్ అమీరు శ్రీ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు.ఎవియాన్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షునితో సమావేశమైన ప్రధానమంత్రి
June 18th, 05:04 am
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో 2026 జూన్ 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7-సదస్సులో “అందరి కోసం సమతుల్యమైన,
June 18th, 05:00 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైన, ఉమ్మడిదైన, సుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.జి7 శిఖరాగ్ర సదస్సులో ‘అందరి కోసం సమతుల.. సమష్టి.. సుస్థిర ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ’పై సంధాన గోష్ఠి’లో ప్రధానమంత్రి ప్రసంగం
June 17th, 06:07 pm
అధ్యక్షులు మాక్రాన్ సహా గౌరవనీయ అతిథి సమూహానికి వందనం!జి7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ చాన్సలర్‌తో ప్రధానమంత్రి సమావేశం
June 17th, 05:34 pm
ఈ సందర్భంగా భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్య పునరుజ్జీవనంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో చాన్సలర్ భారత పర్యటనకు రాగా, భారత-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించారు. ఈ ఏడాదిలోనే భారత్-జర్మనీ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, కాలుష్య రహిత సుస్థిర అభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, రవాణా తదితర రంగాల్లో సహకార బలోపేతంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. రక్షణ పారిశ్రామిక సహకారంపై వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికపై సంతకాలు పూర్తి కావడంపై వారు హర్షం ప్రకటించారు. జర్మనీ మీదుగా ప్రయాణించే భారత పౌరులకు ట్రాన్సిట్ వీసా మినహాయింపు విధానానికి శ్రీకారం చుట్టడాన్ని స్వాగతించారు.జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
June 17th, 12:38 am
2026 జనవరిలో అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారత్‌లోనూ, 2026 మేలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూఏఈలోనూ పర్యటించారు. ఈ పర్యటనల అనంతరం రెండు దేశాల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని, సానుకూల మార్పులను ఇద్దరు నాయకులు సమీక్షించారు. వాటిలో సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ రంగాలున్నాయి. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నాయకులిద్దరూ తమ ఆలోచనలను పంచుకున్నారు.జీ7 సదస్సు నేపథ్యంలో యూకే ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
June 17th, 12:36 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైపాక్షిక సమావేశం నిర్వహించారు.పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను స్వాగతించిన ప్రధాని
June 15th, 01:21 pm
పశ్చిమాసియాలో ఘర్షణను ముగించే విషయంలో అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.Prime Minister Shri Narendra Modi speaks with the Amir of Kuwait
June 09th, 03:33 pm
Prime Minister Shri Narendra Modi held a telephone conversation today with the Amir of the State of Kuwait, His Highness Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al Sabah.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి
May 23rd, 04:20 pm
అమెరికా విదేశాంగ మంత్రి గౌరవ మార్కో రూబియో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.