కర్ణాటకలోని బెంగళూరులో వివిధ మెట్రో ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 10th, 01:30 pm
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారూ, కేంద్రంలోని నా సహచరులు మనోహర్ లాల్ ఖట్టర్ గారూ, హెచ్ డీ కుమారస్వామి గారూ, అశ్విని వైష్ణవ్ గారూ, వి. సోమన్న గారూ, శోభ గారూ, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారూ, కర్ణాటక మంత్రి బి. సురేశ్ గారూ, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ గారూ, ఎంపీ తేజస్వి సూర్య గారూ, డాక్టర్ మంజునాథ్ గారూ, ఎమ్మెల్యే విజయేంద్ర యడియూరప్ప గారూ, కర్ణాటక సోదర సోదరీమణులారా...కర్ణాటకలోని బెంగళూరు లో సుమారు రూ.22,800 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల ప్రారంభం...శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
August 10th, 01:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని బెంగళూరులో సుమారు రూ.7,160 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో యెల్లో లైన్‌ను ప్రారంభించారు. మరోపక్క రూ.15,610 కోట్లకు పైగా విలువైన బెంగళూరు మెట్రో 3వ దశ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కర్ణాటక నేలపై కాలుపెట్టగానే ఒక అనిర్వచనీయ అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కర్ణాటక సంస్కృతి వైభవం, ప్రజల స్నేహపూర్వకత, హృదయాన్ని హత్తుకునే కన్నడ భాష మాధుర్యాన్ని ప్రస్తావిస్తూ... శ్రీ మోదీ ముందుగా బెంగళూరుకు అధిష్ఠాన దేవత అన్నమ్మ తాయికి నమస్కరించారు. శతాబ్దాల క్రితం నాదప్రభు కెంపెగౌడ బెంగళూరు నగరానికి పునాది రాయి వేశారని గుర్తుచేసిన ప్రధానమంత్రి, సంప్రదాయాలతో మమేకమై అభివృద్ధి శిఖరాలను అధిరోహించే నగరాన్ని కెంపెగౌడ ఆనాడే ఊహించారని అన్నారు. “బెంగళూరు ఎల్లప్పుడూ ఆ భావాన్ని కొనసాగిస్తూ దాన్ని కాపాడుతూ వచ్చింది. ఈ రోజు ఆ కలను సాకారం చేసుకుంటోంది” అని ప్రధాని అన్నారు.ఝరియా మాస్టర్ ప్లాన్ సవరణ.. ఆమోదం తెలిపిన మంత్రిమండలి
June 25th, 03:14 pm
సవరించిన ఝరియా మాస్టర్ ప్లాన్‌కు (జేఎంపీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఝరియా బొగ్గు క్షేత్రంలో మంటలు చెలరేగడం, నేల కుంగడం వంటి సవాళ్లు ఎదురైతేనో, ప్రభావిత కుటుంబాలకు పునరావాసాన్ని కల్పించవలసివస్తేనో ఈ తరహా పరిస్థితులను తట్టుకొని ముందుకు పోవడానికి ఝరియా మాస్టర్ ప్లాన్‌ను సవరించారు. ఈ సవరించిన ప్లానును అమలు చేయడానికి మొత్తం రూ.5,940.47 కోట్లు ఖర్చవుతుంది. దశలవారీగా దీనిని అమలుపరిస్తే గనక మంటలు, నేల కుంగుబాటు సమస్యల్ని ఎదుర్కొనే స్థితికి తోడు ప్రభావిత కుటుంబాలకు అత్యంత ప్రమాదభరిత ప్రదేశాల నుంచి ప్రాథమ్య క్రమం ప్రాతిపదికన సురక్షిత పునరావాసాన్ని అందించేందుకు వీలు ఉంటుంది.ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 20th, 04:16 pm
ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన మన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఘీ, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ జువాల్ ఓరం, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ అశ్వినీ వైష్ణవ్, ఒడిశా ఉప ముఖ్యమంత్రులు శ్రీ కనక్ వర్ధన్ సింగ్ దేవ్, శ్రీమతి ప్రవతి పరీడా, రాష్ట్ర మంత్రులూ, పార్లమెంటు సభ్యు లూ, శాసనసభ సభ్యులూ, ఇంకా నా ఒడిశా సోదరసోదరీమణులారా!ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రూ. 18,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు
June 20th, 04:15 pm
ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భువనేశ్వర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఒడిశా సమగ్ర అభివృద్ధి పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా.. తాగునీరు, నీటిపారుదల, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, గ్రామీణ రహదారులు-వంతెనలు, జాతీయ రహదారుల విభాగాలు, కొత్త రైల్వే లైన్ పనులు సహా కీలక రంగాలకు సంబంధించి, రూ. 18,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.అరుణోదయ ఈశాన్య పెట్టుబడిదారుల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:00 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ సుకాంత మజుందార్, మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ హిమంత బిశ్వ శర్మ, శ్రీ పెమా ఖండు, శ్రీ మాణిక్ సాహా, శ్రీ కాన్రాడ్ సంగ్మా, శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, శ్రీ నైఫూ రియో, శ్రీ లాల్‌ధుమా సహా వివిధ పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు, సోదరీసోదరులందరికీ ప్రణామం!రైజింగ్ నార్త్ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు-2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 10:30 am
రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు- 2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రధానమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈశాన్య ప్రాంతంపై ఆత్మీయతను, పురోగతిపై అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతం గర్వకారణమన్నారు. ఈ మధ్యే భారత్ మండపంలో అష్టలక్ష్మీ మహోత్సవాన్ని నిర్వహించామని, నేటి కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడుల వేడుకను తలపిస్తోందని చెప్పారు. సదస్సుకు భారీగా పారిశ్రామికవేత్తలు హాజరవడంపై హర్షణీయమన్న ప్రధానమంత్రి.. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు గల అవకాశాలు వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని శ్రీ మోదీ అభినందించారు. ఈ ప్రాంత నిరంతర అభివృద్ధి, సంక్షేమాలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి.. నార్త్ఈస్ట్ రైజింగ్ సదస్సును అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.మే 22న రాజస్థాన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
May 20th, 01:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 22న రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఆయన ఉదయం సుమారు 11 గంటలకు బీకానేర్‌కు వెళ్తారు. దేశ్‌నోక్‌లో కరణీ మాత ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు.కేరళలోని తిరువనంతపురంలో విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
May 02nd, 02:06 pm
కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ జీ, ముఖ్యమంత్రి శ్రీ పి. విజయన్ జీ, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, కేరళకు చెందిన నా సోదర సోదరీమణులారా...కేరళలో రూ. 8,800 కోట్లతో నిర్మించిన విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 02nd, 01:16 pm
కేరళలోని తిరువనంతపురంలో రూ.8,800 కోట్ల విలువైన విజింజామ్ అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. భగవాన్ ఆదిశంకరాచార్య జయంతి శుభ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ల కిందట సెప్టెంబరులో ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలాన్ని సందర్శించే భాగ్యం తనకు లభించిందని గుర్తు చేసుకున్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీలోని విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్సులో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆది శంకరాచార్యుల అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానానికీ బోధనలకూ గౌరవంగా ఈ విగ్రహ స్థాపనను ఆయన అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదారనాథ్ ధామ్‌లో ఆది శంకరాచార్యుల దివ్య విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కూడా తనకు దక్కిందన్నారు. ఈరోజుకు మరో ప్రత్యేకత ఉందని, కేదారనాథ్ ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకునే విశేష దినమని తెలిపారు. కేరళకు చెందిన ఆదిశంకరాచార్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మఠాలను స్థాపించి దేశాన్ని జాగరూకం చేశారని ప్రధానమంత్రి మోదీ గుర్తు చేశారు. ఆయన కృషి వల్ల ఏకీకృతమైన, ఆధ్యాత్మిక చేతన గల భారత్‌కు పునాదులు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు.ప్రధానమంత్రి అధ్యక్షతన 46వ ‘ప్రగతి’ సమావేశం
April 30th, 08:41 pm
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చురుకైన పాలన, సకాలంలో ప్రాజెక్టుల అమలుకు ఉద్దేశించిన ‘ఐసిటి’ ఆధారిత బహుళ రంగ వేదిక ‘ప్రగతి’ 46వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్షత వహించారు.ప్రధాన మంత్రి థాయ్‌లాండ్ పర్యటనలో ముఖ్యాంశాలు
April 03rd, 08:36 pm
డిజిటల్ సాంకేతికతల రంగంలో సహకారంపై ఆదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సమాజ (సొసైటీ) మంత్రిత్వ శాఖ.. భారతదేశ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖల మధ్య అవగాహన ఒప్పందం.వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
January 06th, 01:00 pm
తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు గారు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ గారు, నా మంత్రివర్గ సహచరులు - శ్రీ అశ్వనీ వైష్ణవ్ గారు, శ్రీ జి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ సోమయ్య గారు, శ్రీ రణవీత్ సింగ్ బిట్టూ గారు, శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, విశిష్ట అతిథులు, సోదర, సోదరీమణులారా!వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 06th, 12:30 pm
వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించడమే కాక కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజనును ప్రధాని ప్రారంభించారు. ఆయన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, తెలంగాణలో చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషనును ప్రారంభించారు.డిసెంబరు 17న రాజస్థాన్‌లో ప్రధానమంత్రి పర్యటన
December 16th, 03:19 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 17న రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్ వర్ష్ - పరిణామ్ ఉత్కర్ష్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇంధనం, రహదారులు, రైల్వేలు, నీటికి సంబంధించిన, రూ.46,300 కోట్లకు పైగా విలువైన 24 ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.గుజరాత్ లోథాల్‌లోని నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్‌ఎంహెచ్‌సీ) అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
October 09th, 03:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ గుజరాత్ లోథాల్‌లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్‌ఎంహెచ్‌సీ) అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు.మూడు వందే భారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్ల అనువాద సారాంశం
August 31st, 12:16 pm
అశ్విని వైష్ణవ్ జీ సహా కేంద్ర ప్రభుత్వంలోని నా గౌరవ సహచరులు; ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ జీ; తమిళనాడు గవర్నర్, ఆర్ ఎన్ రవి, కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్, నా ఇతర క్యాబినెట్ సహచరులు, రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులు, సోదర సోదరీమణులారా!వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 31st, 11:55 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మూడు వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి నేడు ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ వంటి ప్రధాని దార్శనికతను సాకారం చేస్తూ, ఈ అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు మూడు మార్గాల్లో ప్రయాణ సదుపాయాలను మెరుగుపరిచాయి. మీరట్-లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై-నాగర్‌కోయిల్. ఈ రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అనుసంధానతను పెంచుతాయి.We will make East India the growth engine of Viksit Bharat: PM Modi in Barrackpore
May 12th, 11:40 am
Today, in anticipation of the 2024 Lok Sabha elections, Prime Minister Narendra Modi sparked enthusiasm and excitement among the audience with his speech in Barrackpore, West Bengal. Expressing gratitude to the numerous mothers and sisters in attendance, he remarked, This scene indicates a forthcoming change in Bengal. The victory of 2019 is poised to be even greater for the BJP this time around.PM Modi electrifies crowds with his speeches in Barrackpore, Hooghly, Arambagh & Howrah, West Bengal
May 12th, 11:30 am
Today, in anticipation of the 2024 Lok Sabha elections, Prime Minister Narendra Modi sparked enthusiasm and excitement among the audience with his speeches in Barrackpore, Hooghly, Arambagh and Howrah, West Bengal. Expressing gratitude to the numerous mothers and sisters in attendance, he remarked, This scene indicates a forthcoming change in Bengal. The victory of 2019 is poised to be even greater for the BJP this time around.