ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ

August 19th, 07:34 pm

కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. టియాంజిన్లో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పంపిన ఆహ్వానాన్ని వాంగ్ యీ ప్రధానమంత్రికి అందజేశారు. అలాగే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంపైనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి తాను సహాధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశంపైనా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.