కేరళలోని తిరువనంతపురంలో విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
May 02nd, 02:06 pm
కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ జీ, ముఖ్యమంత్రి శ్రీ పి. విజయన్ జీ, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, కేరళకు చెందిన నా సోదర సోదరీమణులారా...కేరళలో రూ. 8,800 కోట్లతో నిర్మించిన విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 02nd, 01:16 pm
కేరళలోని తిరువనంతపురంలో రూ.8,800 కోట్ల విలువైన విజింజామ్ అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. భగవాన్ ఆదిశంకరాచార్య జయంతి శుభ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ల కిందట సెప్టెంబరులో ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలాన్ని సందర్శించే భాగ్యం తనకు లభించిందని గుర్తు చేసుకున్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీలోని విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్సులో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆది శంకరాచార్యుల అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానానికీ బోధనలకూ గౌరవంగా ఈ విగ్రహ స్థాపనను ఆయన అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదారనాథ్ ధామ్‌లో ఆది శంకరాచార్యుల దివ్య విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కూడా తనకు దక్కిందన్నారు. ఈరోజుకు మరో ప్రత్యేకత ఉందని, కేదారనాథ్ ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకునే విశేష దినమని తెలిపారు. కేరళకు చెందిన ఆదిశంకరాచార్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మఠాలను స్థాపించి దేశాన్ని జాగరూకం చేశారని ప్రధానమంత్రి మోదీ గుర్తు చేశారు. ఆయన కృషి వల్ల ఏకీకృతమైన, ఆధ్యాత్మిక చేతన గల భారత్‌కు పునాదులు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు.మే 1,2 తేదీల్లో మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
April 30th, 03:42 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మే 1న ఉదయం 10.30 గం.లకు ముంబయిలో వరల్డ్ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్)ను ప్రారంభిస్తారు.