Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)

June 09th, 07:20 pm

PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.

‘వివా టెక్’ 5వ విడత సదస్సులో ప్రధానమంత్రి కీలకో ప్రసంగ పాఠం

June 16th, 04:00 pm

ఎక్కడ సంప్రదాయకత విఫలమవుతుందో అక్కడ ఆవిష్కరణ తోడ్పాటునిస్తుందన్నది నా విశ్వాసం. మన శకంలో అత్యంత విచ్ఛిన్నకర కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి విజృంభణ సమయంలో ఈ సత్యం ప్రస్ఫుటమైంది. అన్నిదేశాలూ అనేక కష్టనష్టాలకు లోనుకావడమేగాక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. మన సంప్రదాయక విధానాలకు కోవిడ్‌-19 విషమ పరీక్ష పెట్టినప్పటికీ, ఆవిష్కరణలే మనను ఆదుకున్నాయి.

వివాటెక్ 5 వ ఎడిషన్‌ లో కీలకోపన్యాసం చేసిన - ప్రధానమంత్రి

June 16th, 03:46 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, వివాటెక్ 5వ ఎడిషన్‌లో, దృశ్య మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు. ఐరోపాలో అతిపెద్ద డిజిటల్ మరియు అంకురసంస్థల కార్యక్రమాల్లో ఒకటిగా నిర్వహిస్తున్న, వివాటెక్-2021 లో కీలకోపన్యాసం చేయడానికి ప్రధానమంత్రి ని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. 2016 నుండి ప్రతి సంవత్సరం పారిస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ నెల 16న వివాటెక్ అయిదో సంచిక ను ఉద్దేశించి కీల‌కోప‌న్యాసం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

June 15th, 02:16 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 16న సాయంత్రం 4 గంట‌ల వేళ లో వివాటెక్ అయిదో సంచిక ను ఉద్దేశించి కీల‌కోప‌న్యాసం ఇవ్వ‌నున్నారు. వివా టెక్ 2021 కార్య‌క్ర‌మం లో కీల‌కోప‌న్యాసం ఇవ్వ‌డానికి ప్ర‌ధాన మంత్రి ని గౌర‌వ అతిథి గా ఆహ్వానించ‌డ‌మైంది.