ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 27th, 11:45 am
ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారు. ఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పేరు, చిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుంది. అక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నాను. అతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండి. వెనక మీ పేరు, చిరునామా రాసి ఉంటే, నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. ఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకు, చిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 27th, 11:30 am
ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత నవరాత్రి పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామచండీలు కొలువైన పవిత్ర భూమిని సందర్శించి.. ఇక్కడి ప్రజలను కలిసే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు పాల్గొనడం ఆనందంగా ఉందన్న ప్రధానమంత్రి.. వారి ఆశీర్వాదాలే నిజమైన బలమన్నారు. ప్రజలకు వందనాలు తెలిపిన ఆయన.. అందరికీ శుభాకాంక్షలూ తెలిపారు.బీహార్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
September 26th, 11:30 am
ఈ నవరాత్రి పర్వదిన సమయాన ఇవాళ బీహార్ రాష్ట్ర నారీశక్తి ఆనందంలో పాలుపంచుకునే అదృష్టం నాకు దక్కింది. ఇక్కడ టీవీ తెరపై లక్షలాదిగా తల్లులు..చెల్లెమ్మలు నాకు కనిపిస్తున్నారు. ఈ పండుగ వేళ మీ ఆశీస్సులే మాకు ఎనలేని ఉత్సాహాన్నిస్తాయి. ఇందుకుగాను మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్రంలో “ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం” నేటి నుంచి అమలులోకి వచ్చింది. నాకు లభించిన సమాచారం ప్రకారం... ఇప్పటికే 75 లక్షల మంది అక్కచెల్లెళ్లు ఈ పథకంలో చేరగా, ఇప్పుడు వారందరి బ్యాంకు ఖాతాలకు ఏకకాలంలో తలా రూ.10,000 వంతున నగదు జమ చేశారు.బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 26th, 11:00 am
బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నవరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ మహిళలతో కలిసి వారి వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ఈ రోజు ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇప్పటికే 75 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమంలో చేరారని శ్రీ మోదీ తెలిపారు. ఈ 75 లక్షల మంది మహిళల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలకు ఒకేసారిగా రూ. 10,000 బదిలీ చేసినట్లు ఆయన ప్రకటించారు.మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 17th, 11:20 am
మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీ సోదరులారా!మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం
September 17th, 11:19 am
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి - వాగ్దేవికి నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజు దేవశిల్పీ, నైపుణ్యం, సృజనాత్మకతకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతి అని చెబుతూ ఆయనకు శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. హస్త కళా నైపుణ్యం, అంకితభావంతో దేశ నిర్మాణంలో పాలుపంచు కొంటున్న కోట్లాది సోదరీసోదరులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
September 17th, 10:18 am
విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సృష్టిలో కీలక పాత్రను పోషించిన మహనీయుడిని విశేషంగా ఆరాధించడానికి ఈ పవిత్ర దినాన్ని జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా, నవీన సృజనలో నిమగ్నమైన కర్మయోగులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.‘స్థానికులకు స్వరం’ – మన్ కీ బాత్ లో, ప్రధాన మంత్రి మోదీ స్వదేశీ గర్వంతో పండుగలను జరుపుకోవాలని కోరారు
August 31st, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన వారికి సహాయం అందించిన భద్రతా దళాలు మరియు పౌరులకు ప్రధాన మంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్‌లో క్రీడా కార్యక్రమాలు, సౌరశక్తి, ‘ఆపరేషన్ పోలో’ మరియు భారతీయ సంస్కృతి యొక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. పండుగ సీజన్‌లో మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని పౌరులకు గుర్తు చేశారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
September 17th, 09:07 am
విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలను తెలియజేశారు. నిర్మాణ రంగం తోను, సృజనాత్మక రంగం తోను ముడిపడ్డ నిపుణులకు, కష్టించి పనిచేసే సృజనశీలురు అందరికీ నేను నమస్కరిస్తున్నాను అని ఆయన అన్నారు. స్వయంసమృద్ధియుక్త భారతదేశాన్ని, ‘వికసిత్ భారత్’ను నిర్మించుదాం అనే సంకల్పాన్ని సాధించుకోవడంలో వారు అందించే తోడ్పాటు సాటిలేనిది కాగలదన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.విశ్వకర్మ జయంతిసందర్భం లో భగవాన్ విశ్వకర్మ కు ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
September 17th, 08:41 pm
విశ్వకర్మ జయంతి సందర్భం లో భగవాన్ విశ్వకర్మ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు.యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 17th, 06:08 pm
నేడు భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను. దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.న్యూఢిల్లీలో భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి
September 17th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
September 17th, 09:27 am
విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావం, ప్రతిభ, కృషితో సమాజంలో నవ్యావిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్న హస్తకళాకారులు, సృష్టికర్తలందరికీ ఆయన అభివాదం చేశారు.విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు సాంప్రదాయక చేతివృత్తుల వారు మరియుశిల్పకారుల కోసం ‘పిఎమ్ విశ్వకర్మ’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 15th, 12:36 pm
విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు ఉదయం సుమారు 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పిఎమ్ విశ్వకర్మ’ అనే పేరు తో ఒక క్రొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు.దివ్యాంగుల కోసం సౌలభ్య భారతం దిశగా కృషి చేస్తున్నాం: ప్రధాని నరేంద్ర మోదీ
August 15th, 05:01 pm
భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోట బురుజుల నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా- వచ్చేనెల విశ్వకర్మ జయంతి నాడు 'విశ్వకర్మ యోజన'కు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. ఈ పథకం సంప్రదాయ వృత్తి నైపుణ్యం గల వారి కోసం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. హస్త కౌశలంతోపాటు పరికరాలను ఉపయోగించి పనిచేసే ఓబీసీ వర్గాలవారు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. వీరిలో వడ్రంగులు, స్వర్ణకారులు, రాతి పరికరాలు తయారు చేసేవారు, రజకులు, క్షురకులు తదితరులు ఉన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు తమ కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో చేయూత ఇవ్వగలరు. ఈ పథకం 13 నుంచి 15 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు.శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రపంచం అంగీకరించింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
September 25th, 11:00 am
ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐటిఐ కౌశల్ దీక్షాంత్ సమరోహ్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 17th, 04:54 pm
21 వ శ తాబ్దంలో ముందుకు సాగుతూ ఈ రోజు మ న దేశంలో ఒక కొత్త చ రిత్ర సృష్టించబడింది. తొలిసారిగా 9 లక్షల మందికి పైగా ఐటీఐల విద్యార్థులతో కౌశల్ దీక్షాంత్ సమారోహ్ నిర్వహించారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 40 లక్షల మందికి పైగా విద్యార్థులు కూడా మాతో కనెక్ట్ అయ్యారు. మీ అందరికీ కౌశల్ దీక్షాంత్ సమారో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ రోజు కూడా చాలా పవిత్రమైన సందర్భం. ఈ రోజు విశ్వకర్మ జన్మదినం కూడా. నైపుణ్యాలతో సృజనాత్మక మార్గంలో మీ మొదటి అడుగు అయిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జరగడం ఎంత అద్భుతమైన యాదృచ్ఛికం! మీ ప్రారంభం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, భవిష్యత్తుకు మీ ప్రయాణం కూడా మరింత సృజనాత్మకంగా ఉంటుందని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. మీకు, దేశప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు.విశ్వకర్మ జయంతి సందర్భంగా కౌశల్ దీక్షాంత్ సమారోహ్ ను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 17th, 03:39 pm
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లోని విద్యార్థుల ను ఉద్దేశించి మొట్ట మొదటి కౌశల్ దీక్షాంత్ సమారోహ్ లో వీడియో సందేశం ద్వారా ప్రmసంగించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు.మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో జరిగిన మహిళా స్వయం సహాయక బృందాల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 17th, 01:03 pm
మధ్యప్రదేశ్ గవర్నర్, శ్రీ మంగుభాయ్ పటేల్ గారు , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ జి చౌహాన్, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో వచ్చిన ఇతర ప్రముఖులు, ఈ రోజు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు గా నిలుస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న తల్లులు, సోదరీమణులకు నా నమస్కారాలు.PM addresses Women Self Help Groups Conference in Karahal, Madhya Pradesh
September 17th, 01:00 pm
PM Modi participated in Self Help Group Sammelan organised at Sheopur, Madhya Pradesh. The PM highlighted that in the last 8 years, the government has taken numerous steps to empower the Self Help Groups. “Today more than 8 crore sisters across the country are associated with this campaign. Our goal is that at least one sister from every rural family should join this campaign”, PM Modi remarked.