Cabinet approves Rs 1,526.21 crore upgrade of NH-326 in Odisha

December 31st, 03:11 pm

The Union Cabinet chaired by PM Modi has approved the widening and strengthening of existing 2-Lane to 2-Lane with Paved Shoulder of NH-326 in Odisha worth Rs.1,526.21 crore. Improved road connectivity will benefit local communities, industries, educational institutions, and tourism centres, thereby contributing to the region’s inclusive growth.

విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభం.. ప్రధానమంత్రి హర్షం

October 14th, 02:30 pm

ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యం తొణికిసలాడుతూ ఉండే విశాఖపట్నం నగరంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటరుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సహా అనేక వసతులకు నిలయమైన ఈ కేంద్రం.. ‘వికసిత్ భారత్‌’ను ఆవిష్కరించాలన్న మన దృష్టికోణంతో సరిపోలేదిగా ఉందని శ్రీ మోదీ అన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ప్రభావవంతమైన శక్తిగా నిలుస్తుంది. ఇది ఏఐని అందరి చెంతకు చేరుస్తూ, మన ప్రజలకు ఆధునిక సేవలను సమకూరుస్తూ, మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడంతో పాటు ప్రపంచానికి సాంకేతిక మార్గదర్శి భారత్ అనే హోదాను కూడా ఇస్తుంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.

29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

యోగా ఉద్యమాన్ని బలపరచడానికి ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రశంసలు

June 22nd, 02:10 pm

యోగాను దైనందిన జీవనంలో ఒక భాగంగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిన ప్రేరణదాయక నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఆరోగ్యం, వెల్‌నెస్ కోసం చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమానికి దీనితో మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

June 21st, 07:06 am

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు కె. రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ జాదవ్ ప్రతాపరావు గణపత్‌రావు గారు, చంద్రశేఖర్ గారు, భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీసోదరీమణులందరికీ నా నమస్కారాలు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

June 21st, 06:30 am

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐవైడీ) కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి సామూహిక యోగా సాధనలో పాల్గొన్నారు.

జూన్ 20-21 తేదీల్లో ప్రధానమంత్రి బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటన

June 19th, 05:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 20-21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. జూన్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీహార్‌లోని శివాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

25 మే 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 122 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 25th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం... నేడు యావద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమై ఉంది. ఆగ్రహంతో ఉంది. సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే. మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి హిందుస్థానీ శిరస్సును ఉన్నతంగా నిలిపింది. సరిహద్దు దాటి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత అద్భుతం. 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.

మే 1,2 తేదీల్లో మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన

April 30th, 03:42 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మే 1న ఉదయం 10.30 గం.లకు ముంబయిలో వరల్డ్ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్)ను ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో మృతులకు ప్రధాని సంతాపం

April 30th, 09:53 am

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో మరణించినవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక స్థానం: ప్రధాని

January 17th, 05:45 pm

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో, మనస్సులో విశిష్ట స్థానముందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ‘‘కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా ఈక్విటీని అందించి దన్నుగా నిలవాలని నిన్నటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించాం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

8,9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ప్రధాని పర్యటన

January 06th, 06:29 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా జ‌న‌వ‌రి 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పర్యటించనున్నారు. సుస్థిరాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం.. దాదాపు రూ. 2 లక్షల కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 9న ఉదయం 10 గంటలకు భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ)ను కూడా ఆయన ప్రారంభిస్తారు.

PM Modi addresses public meetings in Telangana’s Kamareddy & Maheshwaram

November 25th, 02:15 pm

Ahead of the Telangana assembly election, PM Modi addressed emphatic public meetings in Kamareddy and Maheshwaram today. He said, “Whenever I come to Telangana, I see a wave of hope among the people here. This wave is the wave of expectation. It is the wave of change. It is the wave of the sentiment that Telangana should achieve the height of development that it deserves.”

We are moving towards a future where the Blue Economy will be the medium to create a Green Planet: PM Modi

October 17th, 11:10 am

PM Modi inaugurated the 3rd edition of Global Maritime India Summit 2023 in Mumbai via video conferencing. PM Modi said that history bears testimony that India's maritime capabilities have always benefited the world. PM Modi listed the systematic steps undertaken to strengthen the sector in the last few years. He underlined the transformative impact of the historic G20 consensus on the proposed India-Middle East Europe Economic Corridor. He said that as the Silk Route of the past changed the economy of many countries, this corridor too will transform the picture of global trade.

ప్రపంచ సముద్ర భారత సదస్సు-2023కు ప్రధాని శ్రీకారం

October 17th, 10:44 am

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తూ- 2021లో సదస్సు నిర్వహించిన సమయంలో కోవిడ్ మహమ్మారి ప్రభావిత అనిశ్చితితో యావత్‌ ప్రపంచం ఎంత తల్లడిల్లిందో గుర్తుచేశారు. జన జీవనాన్ని అతలాకుతలం చేసిన ఆనాటి దుస్థితి నుంచి నేడు సరికొత్త ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచం ఇవాళ కొత్త ఆకాంక్షలతో భారతదేశం వైపు చూస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. యావత్‌ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిరంతరం బలపడుతున్నదని వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ పరివర్తన చెందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గాల పాత్రను ప్రధాని వివరిస్తూ- కరోనా అనంతర ప్రపంచంలో విశ్వసనీయ ప్రపంచ సరఫరా శ్రేణి అవసరాన్ని నొక్కిచెప్పారు.

తెలంగాణలోని మహబూబ్ నగర్ లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 01st, 02:43 pm

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, పార్లమెంటులో నా సహచరులు శ్రీ సంజయ్ కుమార్ బండి గారు, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నమస్కారం!

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పథకాలు జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధాని

October 01st, 02:42 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో రూ.13,500 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప‌థ‌కాలను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాప‌న చేశారు. వీటిలో రహదారి, రైల్వే, పెట్రోలియం-సహజ వాయువు, ఉన్నత విద్య వంటి కీలక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగానే ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ సదుపాయం ద్వారా ఒక కొత్త రైలు‌ను కూడా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ- పండుగల సమయం ఆసన్నం అవుతున్నదని గుర్తుచేశారు. మరోవైపు పార్లమెంట్‌లో ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు (నారీశక్తి వందన్ అధినియం)కు ఆమోదం ద్వారా నవరాత్రి వేడుకల ఆరంభానికి ముందే నారీశక్తి పూజా స్ఫూర్తి ఆవిష్కృతమైందని ఆయన అభివర్ణించారు.

Chhattisgarh is a powerhouse of development of the country: PM Modi

September 14th, 03:58 pm

PM Modi dedicated to the nation several rail sector projects in Raigarh, Chhattisgarh. Chhattisgarh is a powerhouse of development of the country, PM Modi remarked as he noted that a country will move forward only if its powerhouses are working at full strength.

చత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో రూ.6,350 కోట్ల విలువ గల రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన పిఎం

September 14th, 03:11 pm

చత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో రూ.6350 కోట్ల విలువ గల పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. చత్తీస్ గఢ్ లోని 9 జిల్లాల్లో 50 పడకల ‘‘క్రిటికల్ కేర్ బ్లాక్’’లను జాతికి అంకితం చేయడంతో పాటు 1 లక్ష సికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. రైల్వే ప్రాజెక్టుల్లో చత్తీస్ గఢ్ ఈస్ట్ రైల్ ప్రాజెక్ట్ తొలి దశ, చంపా-జంగా మధ్య మూడో రైల్వే లైను, పెండ్రా రోడ్డు-అనుప్పూర్ మధ్య మూడో రైల్వే లైను, తలైపల్లి బొగ్గు గనిని ఎన్ టిపిసికి చెందిన లారా సూపర్ ధర్మల్ విద్యుత్కేంద్రంతో అనుసంధానం చేసే ఎంజిఆర్ (మెర్రీ-గో-అరౌండ్) వ్యవస్థ ఉన్నాయి.

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 18th, 11:17 pm

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాతో ఉన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు! డిజిటల్ మాధ్యమం ద్వారా మాతో పాటు చేరిన భారతదేశం తో పాటు విదేశాల నుండి వీక్షకులకు మరియు పాఠకులకు శుభాకాంక్షలు. ఈ కాన్క్లేవ్ థీమ్ - ది ఇండియా మూమెంట్ అని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనాపరులు ఇది భారతదేశపు క్షణమని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. కానీ ఇండియా టుడే గ్రూప్ ఈ ఆశావాదాన్ని ప్రదర్శించినప్పుడు, అది 'ఎక్స్‌ట్రా స్పెషల్'. చెప్పాలంటే, 20 నెలల క్రితం ఎర్రకోట ప్రాకారాల నుండి నేను చెప్పాను - ఇదే సమయం, సరైన సమయం. కానీ ఈ స్థానానికి చేరుకోవడానికి 20 నెలలు పట్టింది. అప్పుడు కూడా అదే స్ఫూర్తి – ఇది భారతదేశం యొక్క క్షణం.