అండమాన్, నికోబార్ దీవుల్లో పరాక్రమ దివస్ సందర్భంగా పీఎం ప్రసంగం
January 23rd, 05:15 pm
అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె జోషి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ట్రస్ట్ ఛైర్మన్ బ్రిగేడియర్ ఆర్.ఎస్. చికారా, భారత స్వాతంత్ర్య సమరయోధులు, ఐఎన్ఏ అజరామరుడు లెఫ్టినెంట్ ఆర్.మాధవన్...అండమాన్, నికోబార్ దీవుల్లో జరిగిన పరాక్రమ్ దివస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 23rd, 05:00 pm
అండమాన్, నికోబార్ దీవుల్లో నిర్వహించిన పరాక్రమ్ దివస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అని, ఇది ఒక అద్భుతమైన, గర్వించదగ్గ రోజు అని పేర్కొన్నారు. నేతాజీ వీరత్వం, ధైర్యసాహసాలు మనకు ఎల్లప్పుడూ స్పూర్తినిస్తాయని, ఆయన పట్ల మనకు గౌరవభావాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో పరాక్రమ్ దివస్ దేశ స్ఫూర్తిలో ఒక అంతర్భాగమైన పండుగగా మారిందని ఆయన వెల్లడించారు. జనవరి 23 పరాక్రమ్ దివస్, జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, జనవరి 29 బీటింగ్ రిట్రీట్, జనవరి 30 పూజ్య బాపూజీ వర్ధంతి ఇలా వరుసగా రావడం గణతంత్ర మహోత్సవాన్ని జరుపుకునే కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తోందని అన్నారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్’ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 29th, 06:45 pm
దేశంలోని రైతుల కోసం ఈ రోజు జగన్నాథ స్వామి ఆశీస్సులతో ‘వ్యవసాయాభివృద్ధి సంకల్ప కార్యక్రమం’ (వికసిత కృషి సంకల్ప్ అభియాన్) పేరిట విశిష్ట పథకానికి శ్రీకారం చుడుతున్నాం. రుతుపవనాలు వచ్చేశాయి... ఖరీఫ్ సాగుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 12 నుంచి 15 రోజుల్లో శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రగతిశీల రైతులతో కూడిన 2,000 బృందాలు దేశవ్యాప్తంగా గ్రామ సందర్శనకు బయల్దేరుతాయి. ఈ కార్యక్రమంపై 700కుపైగా జిల్లాల్లోని లక్షలాది రైతులకు ఈ బృందాలు అవగాహన కల్పిస్తాయి. ఈ విశిష్ట కార్యక్రమం, దీనిపై విస్తృత ప్రచారం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత వ్యవసాయ రంగ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ రైతులందరితోపాటు ప్రచార బృందాలకు నా శుభాకాంక్షలు.వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 29th, 06:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత కృషి సంకల్ప్ అభియాన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వికసిత కృషి సంకల్ప్ అభియాన్ రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. వర్షాకాలం దగ్గరపడుతున్న కొద్ది, ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లు చేయటం మొదలవుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే 12 నుంచి 15 రోజుల పాటు 2000 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రగతిశీల రైతులతో కూడిన బృందాలు 700 లకు పైగా జిల్లాల్లో సందర్శించి లక్షల మంది రైతులను చేరుకుంటారని తెలిపారు. ఈ బృందాల్లో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన భారత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు వారికి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.