ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 16th, 03:00 pm
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ప్రజాదరణ పొందిన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏలు అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు...ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.13,430 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 16th, 02:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత అహోబిలంలోని నరసింహ స్వామితోపాటు మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పించారు. అలాగే సకలజన సౌభాగ్యం ఆకాంక్షిస్తూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కోరారు.