ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొనడానికి మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వెళ్లిన ప్రధానమంత్రి
July 10th, 08:21 am
ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథోనీ అల్బానీజ్, విక్టోరియా ప్రీమియర్ జెసిండా ఎలన్‌తో పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వెళ్లారు. భారత్, ఆస్ట్రేలియా క్రీడా సంబంధాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్శనను ఏర్పాటు చేశారు. శ్రీ స్టీవ్ వా, లిసా స్థలేకర్ సహా ఆస్ట్రేలియాకు చెందిన మేటి క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడలు, సాంస్కృతిక మార్పిడులు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు నానాటికీ భారత్, ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మూలాధారాలుగా మారుతున్నాయని ఇది నిరూపించింది.సీషెల్స్ 50వ స్వాతంత్ర్య ఉత్సవాలకు హాజరయిన ప్రధానమంత్రి
June 29th, 08:00 am
సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు ఆ దేశ 50వ స్వాతంత్ర ఉత్సవాలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్ర్య ఉత్సవాల్లో పాల్గొన్న తొలి భారత ప్రధాని ఆయనే.వర్చువల్ మాధ్యమం ద్వారా భారతదేశాని కి, సెశెల్స్ కు మధ్య జరుగనున్న ఉన్నత స్థాయి కార్యక్రమం (ఏప్రిల్ 8, 2021)
April 07th, 06:02 pm
సెశెల్స్ లో భారతదేశాని కి చెందిన అనేక పథకాల ను ప్రారంభించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెశెల్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ వేవెల్ రామ్ కలావన్ తో పాటు ఈ నెల 8న ఒక ఉన్నత స్థాయి వర్చువల్ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.