డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 01:00 pm

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూ, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టా, రాష్ట్ర మంత్రులు, వేదికను అలంకరించిన ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 09th, 12:30 pm

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 22nd, 11:36 am

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవ కే.టీ. పర్నాయక్ గారు, ప్రజాదరణతో.. చైతన్యవంతమైన పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు కిరణ్ రిజిజు గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, నా సహ పార్లమెంటు సభ్యులు నబమ్ రెబియా గారు, తపిర్ గావ్ గారు, అందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అరుణాచల్ ప్రదేశ్‌లోని నా ప్రియమైన సోదరీ సోదరులారా,

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

September 22nd, 11:00 am

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భగవాన్ డోన్యీ పోలోకు ప్రణామాలు అర్పించి, అందరిపై ఆయన ఆశీస్సులు ప్రసరించాలని ప్రార్థించారు.

జపాన్ రాష్ట్రాల గవర్నర్లతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 30th, 08:00 am

ఈ సమావేశ మందిరంలో నేను సైతామా నగర వేగాన్నీ, మియాగీ నగర స్థిరత్వాన్నీ, ఫుకోకా నగర చైతన్యాన్నీ, నారా పట్టణపు వారసత్వపు గొప్పతనాన్నీ అనుభూతి చెందుతున్నాను. కుమామోటో నగర వెచ్చదనం, నాగానో నగర తాజాదనం, షిజోకా సౌందర్యం, నాగసాకి ప్రాణనాడిని మీరు కలిగి ఉన్నారు. మీరంతా ఫ్యుజీ పర్వత బలాన్ని, సాకురా పూల మొక్క స్ఫూర్తినీ కలిగి ఉన్నారు. కలిసికట్టుగా మీరు జపాన్‌ను ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.

బీహార్లోని మోతీహారీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

July 18th, 11:50 am

ఈ పవిత్ర శ్రావణ మాసంలో నేను బాబా సోమేశ్వర నాథ్ పాదాలకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను. ఆయన ఆశీర్వాదంతో బీహార్ ప్రజలందరికీ సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తున్నాను.

బీహార్లోని మోతీహారిలో రూ.7,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 18th, 11:30 am

బీహార్‌లోని మోతీహారీలో రూ.7,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా బాబా సోమేశ్వరనాథ్‌కు నమస్సులు అర్పిస్తూ.. బీహార్ ప్రజల జీవితాల్లో సంతోషం, సంక్షేమం నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. చరిత్ర గతిని మార్చిన భూమి... చంపారన్ అనీ, స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహాత్మాగాంధీకి ఈ నేల కొత్త దిశను చూపించిందని చెప్పారు. ఈ నేల అందించిన స్ఫూర్తే ఇప్పుడు బీహార్ భవిష్యత్తును తీర్చిదిద్దుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సమావేశానికి హాజరైన వారికి, బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్రినిడాడ్, టొబాగో దేశంలోని ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 04th, 05:56 am

ఈ సాయంత్రం వేళ ఇలా మీ అందరినీ కలవడం గర్వాన్నీ, అమితానందాన్నీ ఇస్తోంది. చక్కని ఆతిథ్యమిచ్చి, నా గురించి ఆత్మీయంగా మాట్లాడిన ప్రధానమంత్రి కమ్లా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!

ట్రినిడాడ్ టొబాగోలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 04th, 04:40 am

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా స్వాగతిస్తూ, ట్రినిడాడ్ టొబాగోలో అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో’’తో ఆయనను సత్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవాన్ని తనకు ఇస్తున్నందుకు ఆమెతో పాటు ట్రినిడాడ్ టొబాగో ప్రజానీకానికి తన హృదయపూర్వక కృతజ్ఞత‌లను ప్రధానమంత్రి తెలియజేశారు.

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

June 06th, 12:50 pm

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారూ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారూ జితేంద్ర సింగ్ గారూ వి. సోమన్న గారూ, ఉప ముఖ్యమంత్రి సురేంద్ర కుమార్ గారూ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునిల్ గారూ, నా పార్లమెంటు సహచరుడు జుగల్ కిషోర్ గారూ, ఇతర ప్రజా ప్రతినిధులూ, ప్రియమైన సోదరీసోదరులరా... వీరుడైన జోరావర్ సింగ్ నడయాడిన గడ్డ ఇది. ఈ నేలకు ప్రణమిల్లుతున్నాను.

జమ్మూ కాశ్మీర్ లో రూ.46,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభం, అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

June 06th, 12:45 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో 46,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. ధైర్యవంతుడైన వీర్ జోరావర్ సింగ్ భూమికి వందనం చేస్తూ, నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప వేడుక అని ఆయన వ్యాఖ్యానించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ లోయ ఇప్పుడు భారతదేశంలోని విస్తారమైన రైల్వే నెట్వర్క్ తో అనునుసంధానితమైందని శ్రీ మోదీ అన్నారు.

2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్-2 (వీవీపీ-2)కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

April 04th, 03:11 pm

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్-2 (వివిపి-2) ను కేంద్ర పథకంగా (100% కేంద్ర నిధులు) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది, తద్వారా వికసిత భారత్ - 2047 లక్ష్యానికి అనుగుణంగా సురక్షితమైన, భద్రమైన, పటిష్ఠమైన సరిహద్దులను సాధించే దిశగా ప్రభుత్వం తన నిబద్ధతను మరింతగా చాటుకుంది. ఇప్పటికే వీవీపీ-1 పరిధిలోకి ఉన్న ఉత్తర సరిహద్దు కాకుండా అంతర్జాతీయ భూ సరిహద్దుల (ఐఎల్ బీ)కు ఆనుకుని ఉన్న బ్లాకుల్లో ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

‘ఈటీ నౌ’ ప్రపంచ వాణిజ్య సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

February 15th, 08:30 pm

క్రితం సారి ఈటీ సమిట్ ఎన్నికలు బాగా దగ్గర పడిన సమయంలో ఏర్పాటయ్యింది. మేం పాలన చేపట్టిన మూడోసారి భారత్ మరింత వేగంతో పనిచేస్తుందని అప్పుడు మీకు సవినయంగా మనవి చేశాను. గుర్తుంది కదా! అప్పుడు ప్రస్తావించిన వేగాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూడగలగడం, దేశం నా ఆశయానికి మద్దతుగా నిలవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా బీజేపీ- ఎన్డీఏకు తమ దీవెనలను అందిస్తున్నారు. వికసిత్ భారత్ (సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం) ఆశయానికి ఒడిశా ప్రజలు గత జూన్ లో మద్దతునివ్వగా, అటు తరువాత హర్యానా ప్రజలు, ఇప్పుడు ఢిల్లీ పౌరులూ భారీ మద్దతును తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలంతా ఏకతాటిపై నిలబడుతున్నారు అనేందుకు ఇదో తార్కాణం!

‘ఈటీ నౌ' ప్రపంచ వాణిజ్య సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

February 15th, 08:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఈటీ నౌ’ ప్రపంచ వాణిజ్య సదస్సు-2025లో ఇవాళ ప్రసంగించారు. మూడోదఫా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వ పాలనలో భారత్‌ సరికొత్త వేగంతో ముందంజ వేస్తుందని మునుపటి ‘ఈటీ నౌ’ సదస్సులో తాను సవినయంగా ప్రకటించానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ వేగం ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తున్నదని, దీనికి యావద్దేశం పూర్తి మద్దతు ఇస్తున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. వికసిత భారత్‌పై తమ నిబద్ధతకు అపార మద్దతు ప్రకటించిన ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, న్యూఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌ స్వప్న సాకారంలో పౌరులందరూ భుజం కలిపి నడుస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం

February 06th, 04:21 pm

భారత్ సాధించిన విజయాలను, భారత్ పట్ల ప్రపంచ అంచనాలను, 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణం కోసం దేశంలోని సామాన్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంకల్పాన్ని గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎంతో చక్కగా వివరించారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా సాగిన వారి ప్రసంగం మనందరికీ భవిష్యత్ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఈ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రసంగానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్యస‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మాధానం

February 06th, 04:00 pm

పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, భారత్‌పై ప్రపంచం అంచనాలు, వికసిత భారత్‌ సంకల్ప సాకారంలో సామాన్యుల ఆత్మవిశ్వాసంవగైరాలను రాష్ట్రపతి ప్రసంగం విశదీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రభావవంతమైన ఈ ప్రసంగం భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసేదిగా ఉందని అభివర్ణించారు. ఇంతటి ఉత్తేజకర ప్రసంగం చేసినందుకుగాను రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.

We launched the SVAMITVA Yojana to map houses and lands using drones, ensuring property ownership in villages: PM

January 18th, 06:04 pm

PM Modi distributed over 65 lakh property cards under the SVAMITVA Scheme to property owners across more than 50,000 villages in over 230 districts across 10 states and 2 Union Territories. Reflecting on the scheme's inception five years ago, he emphasised its mission to ensure rural residents receive their rightful property documents. He expressed that the government remains committed to realising Gram Swaraj at the grassroots level.

స్వామిత్వ లబ్దిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

January 18th, 05:33 pm

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన లబ్ధిదారుడు శ్రీ మనోహర్ మేవాడతో సంభాషించిన ప్రధానమంత్రి, పథకానికి సంబంధించి తన అనుభవాన్ని పంచుకోవాలని కోరారు. ఆస్తి పత్రాలతో రుణం పొందడం గురించి అలాగే తన జీవితంలో దానివల్ల కలిగిన ప్రయోజనాలను శ్రీ మనోహర్‌ను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. తన డెయిరీ ఫామ్ కోసం 10 లక్షల రుణం తీసుకున్నాననీ, అది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంతగానో సహాయపడిందని శ్రీ మనోహర్ వివరించారు. తాను, తన పిల్లలు, తన భార్య కూడా డెయిరీ ఫామ్‌లో పనిచేయడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఆస్తి పత్రాలు ఉండటం వల్లే బ్యాంకు రుణం పొందడం సులభతరమైందని శ్రీ మనోహర్ సంతోషంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవితాల్లో కష్టాలు తగ్గాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వామిత్వ యోజన లక్షలాది కుటుంబాల ఆదాయాన్ని పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు గర్వంగా తల ఎత్తుకుని, జీవితంలో సుఖాన్ని అనుభవించేలా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. స్వామిత్వ యోజనను ఈ దార్శనికతకు కొనసాగింపుగా ప్రధానమంత్రి అభివర్ణించారు.

స్వామిత్వ పథకం కింద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ద్వారా

January 18th, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్వామిత్వ పథకం కింద 65 లక్షలకుపైగా ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 230కిపైగా జిల్లాల్లోని 50,000కుపైగా గ్రామాల ప్రజలు వీటిని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- అనేక గ్రామాలు-గ్రామీణ ప్రాంతాలకు ఇది చరిత్రాత్మక దినమని, ఇందుకుగాను లబ్ధిదారులతోపాటు పౌరులందరికీ అభినందనలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 15th, 11:08 am

జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.