‘వైబ్రంట్‌ గుజరాత్‌’ కచ్‌.. సౌరాష్ట్ర ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 11th, 02:45 pm

గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాననీయులు, పారిశ్రామిక ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 11th, 02:30 pm

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మోదీ మాట్లాడుతూ, 2026 ప్రారంభం తర్వాత తాను మొదటిసారి గుజరాత్‌కు వచ్చానని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తాను సోమనాథుని దివ్య దర్శనం చేసుకున్నానని, ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. “వికాస్ భీ, విరాసత్ భీ” (అభివృద్ధి - వారసత్వం) మంత్రం ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు దేశం నలుమూలల నుంచి, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల వచ్చిన అందరికీ ప్రధానమంత్రి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపారు.

జనవరి 11న రాజ్‌కోట్‌‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

January 09th, 12:07 pm

ప్ర‌ధానమంత్రి 2026 జనవరి 11న రాజ్‌కోట్‌ను సందర్శిస్తారు. కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో భాగంగా నిర్వహించే ట్రేడ్ షో ను మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు రాజ్‌కోట్‌ లోని మార్వాడీ విశ్వవిద్యాలయంలో కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు ఉద్దేశించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. 13 గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (జీఐడీసీ) ఎస్టేట్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటించడంతో పాటు, రాజ్‌కోట్‌లోనే జీఐడీసీ వైద్య పరికరాల పార్కును కూడా ప్రారంభిస్తారు.

జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని

January 09th, 12:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటిస్తారు. జనవరి 10 సాయంత్రానికి ప్రధాని సోమనాథ్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో సోమనాథ్ ఆలయంలో నిర్వహించే ఓంకార మంత్రోచ్ఛారణలో పాల్గొంటారు. అనంతరం డ్రోన్‌ ప్రదర్శనను వీక్షిస్తారు.