ఢిల్లీ ఓటర్లు నగరాన్ని 'ఆప్-డా' నుండి విముక్తి చేయాలని సంకల్పించారు: ప్రధాని మోదీ

January 03rd, 01:03 pm

పేద కుటుంబాలకు ఇళ్లు సహా కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి పక్కా ఇంటి లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ, వృద్ధి, వ్యవస్థాపకత మరియు మహిళల నేతృత్వంలోని అభివృద్ధి సంవత్సరంగా 2025 కోసం భారతదేశ విజన్‌ను ఆయన నొక్కి చెప్పారు.

ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

January 03rd, 12:45 pm

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు న్యూఢిల్లీలో పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ శ్రీ మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025వ సంవత్సరం భారత దేశ అభివృద్ధికి విస్తృత అవకాశాలను తీసుకువస్తుందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యం వైపు దేశాన్ని ముందుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక సుస్థిరతలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా మారింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఏడాది దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా మారడం, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో యువతకు సాధికారత కల్పించడం, వ్యవసాయంలో నూతన రికార్డులు నెలకొల్పడం, మహిళా కేంద్ర అభివృద్ధిని ప్రోత్సహించడం, జీవన సౌలభ్యంపై దృష్టి సారించి ప్రతి పౌరునికీ నాణ్యమైన జీవితాన్ని అందించడమే 2025లో భారత్ లక్ష్యమని శ్రీ మోదీ వివరించారు.

జనవరి 3 న ఢిల్లీలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి

January 02nd, 10:18 am

‘అందరికీ ఇళ్లు’ అనే తన ఆలోచనకు అనుగుణంగా ఢిల్లీలోని అశోక్ విహార్‌లో నిర్మించిన స్వాభిమాన్ గృహసముదాయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శిస్తారు. యథాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో భాగంగా జుగ్గీ జోప్రి (జేజే) క్లస్టర్ల నివాసితుల కోసం వీటిని నిర్మించారు. జనవరి 3, 2025న దాదాపుగా మధ్యాహ్నం 12.10 గంటలకు వీటిని ప్రధాని సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.