కామన్వెల్త్ దేశాల లోక్‌సభల స్పీకర్లు, అధ్యక్షుల 28వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
January 15th, 11:00 am
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, అంతర్-పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలు శ్రీమతి టూలియా అక్సన్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ క్రిస్టోఫర్ కలిలా, కామన్వెల్త్ దేశాల స్పీకర్లు, అధ్యక్లులు, ఇతర ప్రతినిధులు, సోదరసోదరీలారా!రాజ్యాంగ సౌధం సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు.. ప్రిసైడింగ్ ఆఫీసర్ల 28వ సదస్సుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
January 15th, 10:32 am
న్యూఢిల్లీలోని ‘రాజ్యాంగ సౌధం’లోని సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు-ప్రిసైడింగ్ అధికారుల 28వ సదస్సును (సీఎస్‌పీఓసీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్ర ఎంతో విశిష్టమైనదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా చట్టసభల స్పీకర్లకు మాట్లాడే అవకాశం అంతగా ఉండదంటూ- ఇతరులు చెప్పేది వినడం, ప్రతి ఒక్కరి అభిప్రాయ వెల్లడికి అవకాశమివ్వడం వారి బాధ్యతని పేర్కొన్నారు. అత్యుత్సాహం చూపే, వివాదాస్పదంగా వ్యవహరించే సభ్యులను కూడా చిరునవ్వుతో నిభాయించే స్పీకర్లలో సహనం అత్యంత సార్వత్రిక లక్షణమని అభివర్ణించారు.న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్ 2025లో ప్రధాని ప్రసంగం
October 31st, 06:08 pm
న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
October 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
September 12th, 04:45 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ చర్చల శతాబ్ది కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
June 24th, 11:30 am
బ్రహ్మర్షి స్వామి సచ్చిదానంద గారు, శ్రీమఠం స్వామి శుభాంగ నందా గారు, స్వామి శారదానంద గారు, గౌరవనీయులైన సాధువులందరూ, ప్రభుత్వంలో నా సహచరులు శ్రీ జార్జ్ కురియన్ గారు, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ అదూర్ ప్రకాష్ గారు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు, గౌరవనీయులైన పెద్దలందరూ,శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ మధ్య చారిత్రక చర్చ జరిగి శతాబ్ది అవుతోన్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
June 24th, 11:00 am
గొప్ప ఆధ్యాత్మిక, నైతిక విలువలు కలిగిన మహానుభావులు శ్రీ నారాయణ గురు.. మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రక చర్చకు శతాబ్ధి అవుతోన్న సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన దేశ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టానికి ఈ వేదిక సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. మన స్వాతంత్రోద్యమానికి ఈ ఇద్దరు మహానుభావుల మధ్య జరిగిన చారిత్రక చర్చ కొత్త దిశానిర్దేశం చేసిందని.. స్వాతంత్య్ర లక్ష్యాలకు, స్వతంత్ర భారత్ కలకు నిర్దిష్ట అర్థాన్నించిందని పేర్కొన్నారు. “100 సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ నారాయణ గురు- మహాత్మాగాంధీల సమావేశం నేటికీ స్ఫూర్తిదాయకంగా, సందర్భోచితంగా ఉంది. సామాజిక సామరస్యం, అభివృద్ధి చెందిన భారత్ విషయంలో సమష్టి లక్ష్యాల కోసం ఉత్తేజానిచ్చే వనరుగా పనిచేస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాక శతాబ్ధి సందర్భంగా శ్రీ నారాయణ గురు పాదాలకు నమస్కరించిన ప్రధాని.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.అహ్మదాబాద్ రామకృష్ణ మఠం కార్యక్రమంలో వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
December 09th, 01:30 pm
పూజ్య స్వామి గౌతమానందజీ మహరాజ్, రామకృష్ణ మఠానికి చెందిన దేశవిదేశాల సాధువులు, మహాత్ములు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్, కార్యక్రమంలో భాగమైన విశిష్ఠ అతిథులు, సోదర సోదరీమణులు.. అందరికీ నా నమస్కారాలు!గుజరాత్ లో రామకృష్ణ మఠం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 09th, 01:00 pm
గుజరాత్ రామకృష్ణ మఠం ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పూజ్య స్వామి గౌతమానందజీ మహరాజ్, రామకృష్ణ మఠానికి చెందిన దేశవిదేశాల సాధువులు, మహాత్ములు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్, కార్యక్రమంలో భాగమైన విశిష్ఠ అతిథులు తదితరులకు అభినందనలు తెలిపారు. మాతా శారదాదేవి, గురుదేవులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల వారి పాదాలకు ప్రణామాలు అర్పించారు. నేటి కార్యక్రమం స్వామి ప్రేమానంద్ మహరాజ్ జీ జయంతి సందర్భంగా ఏర్పాటయ్యిందంటూ వారికి వందనాలర్పించారు.తొలి అంతర్జాతీయ సౌర ఉత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం
September 05th, 11:00 am
గౌరవనీయ ప్రముఖులారా, విశిష్ట అతిథులారా, నా ప్రియ మిత్రులారా! మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి అంతర్జాతీయ సౌరోత్సవానికి మీ అందరినీ సంతోషంగా స్వాగతిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమికి అభినందనలు.