ఇంధన రంగ కంపెనీల సీఈఓలతో చర్చించిన ప్రధాని
January 28th, 09:09 pm
ప్రస్తుతం జరుగుతున్న 'ఇండియా ఎనర్జీ వీక్ (ఐఈడబ్ల్యూ) 2026’లో భాగంగా ప్రపంచ ఇంధన రంగ సీఈఓలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు. ఈ రోజు ప్రధాని నివాసమైన లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ)
December 31st, 03:11 pm
ఒడిశా రాష్ట్రంలో ‘ఎన్‌హెచ్(ఓ)’ కింద ‘ఈపీసీ’ పద్ధతిలో ప్రస్తుత 2 వరుసల జాతీయ రహదారిని అంచుల చదును సహా విస్తరణ-బలోపేతం చేసే పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్‌హెచ్-326 పరిధిలో 68.600 కిలోమీటరు నుంచి 311.700 కిలోమీటరు వరకూ రహదారిని రెండు వైపులా అంచుల చదును (పేవ్డ్ షోల్టర్స్) సహా ఉన్నతీకరిస్తారు.గీత, వేదాంతాలపై శ్రీ మసెటీకి ఉన్న మక్కువ హర్షణీయమన్న ప్రధానమంత్రి
November 20th, 07:54 am
ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ప్రభావాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. గీత పట్ల, వేదాంతం పట్ల మక్కువను పెంచుకొన్న శ్రీ జోనస్ మసెటీని ప్రధాని అభినందించారు. శ్రీ జోనస్ మసెటీ బృందం రామాయణంపై ఒక ప్రదర్శనను సంస్కృత భాషలో సమర్పించగా, ఆ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి తిలకించారు. అనంతరం కళాకారులతో సమావేశమయ్యారు.‘ప్రబుద్ద భారత’ 125వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం
January 31st, 03:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు స్వామి వివేకానందుడు ప్రారంభించిన రామకృష్ణ తత్వానికి సంబంధించిన ప్రబుద్ధ భారత మాసపత్రిక 125వ వార్షిక ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రబుద్ధ భారత 125వ వార్షిక ఉత్సవాలలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 31st, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు స్వామి వివేకానందుడు ప్రారంభించిన రామకృష్ణ తత్వానికి సంబంధించిన ప్రబుద్ధ భారత మాసపత్రిక 125వ వార్షిక ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ
October 09th, 02:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ఈ రోజు సమావేశమై వారితో ముఖాముఖి సంభాషించారు.