ఉత్తరప్రదేశ్‌లోని జాతీయ రహదారి- 19, వారణాసి రింగ్ రోడ్డు నడుమ

July 15th, 04:53 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా.. జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్ మధ్య గంగా నది తీరం వెంబడి సరికొత్త లింక్/కనెక్టర్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 46.039 కిలోమీటర్ల ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ‘మిశ్రమ వార్షిక చెల్లింపు విధానం (హ్యామ్)’లో చేపట్టనున్నారు. దీని మొత్తం వ్యయం రూ.14,447.64 కోట్లు కాగా.. ఇందులో సివిల్ నిర్మాణ పనుల కోసం రూ.6,037.85 కోట్లు (జీఎస్టీ మినహా ప్రజా సదుపాయాల మార్పిడి వ్యయం సహా), జాతీయ రహదారుల (ఓ) కింద భూసేకరణ కోసం రూ.541.11 కోట్లు కేటాయించారు. ఆరు వరుసల ఎత్తయిన ప్రధాన వాహన మార్గాన్నీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కేబుల్ వంతెననూ, అత్యాధునిక సాంకేతికతతో వాహనదారులూ పాదచారులిద్దరికీ సేవలందించే ప్రత్యేకమైన వంతెననూ, మెట్ల మార్గాలూ, ర్యాంపు మార్గాలూ, లింక్ రోడ్లనూ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు.

రూ.10,998.32 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో ఉత్తరప్రదేశ్‌లోని వరుణ నది ఒడ్డున ఎక్కి- దిగే మార్గాలు, వృత్తాకార మార్గాలతో కూడిన 6, 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

July 15th, 04:47 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వరుణ నది వెంబడి ఉన్న ఎన్‌హెచ్-31, వారణాసి రింగ్ రోడ్డును కలుపుతూ 43.218 కిలోమీటర్ల పొడవైన అనుసంధాన కారిడార్ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధాన రహదారి, వంతెనలు, వృత్తాకార మార్గాలు, ఎక్కి-దిగే మార్గాలు, సర్వీసు రోడ్లతో 6,4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ఏఐ) నిర్మించనుంది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.10,998.32 కోట్లు కాగా.. సివిల్ నిర్మాణ పనులకు రూ.4,565.33 కోట్లు, భూసేకరణకు రూ.934.91 కోట్లు కేటాయించారు.

గంగానదిపై రైలు, రోడ్డు మార్గాల బ్రిడ్జి సహా 'వారణాసి-పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బహుళ మార్గాల బ్రిడ్జి' నిర్మాణాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి

October 16th, 03:18 pm

ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, రైల్వే శాఖకు చెందిన రూ.2,642 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. బహుళ మార్గాల నూతన ప్రాజెక్టు వివిధ మార్గాల్లో రద్దీని తగ్గించి, రాకపోకలను సులభతరం చేయడమే కాక, భారతీయ రైల్వేలకు చెందిన అతి రద్దీ మార్గాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి-ఛందౌలీ మధ్య ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.