రూ.10,998.32 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో ఉత్తరప్రదేశ్‌లోని వరుణ నది ఒడ్డున ఎక్కి- దిగే మార్గాలు, వృత్తాకార మార్గాలతో కూడిన 6, 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
July 15th, 04:47 pm
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వరుణ నది వెంబడి ఉన్న ఎన్‌హెచ్-31, వారణాసి రింగ్ రోడ్డును కలుపుతూ 43.218 కిలోమీటర్ల పొడవైన అనుసంధాన కారిడార్ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధాన రహదారి, వంతెనలు, వృత్తాకార మార్గాలు, ఎక్కి-దిగే మార్గాలు, సర్వీసు రోడ్లతో 6,4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ఏఐ) నిర్మించనుంది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.10,998.32 కోట్లు కాగా.. సివిల్ నిర్మాణ పనులకు రూ.4,565.33 కోట్లు, భూసేకరణకు రూ.934.91 కోట్లు కేటాయించారు.ఏప్రిల్ 11న ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పర్యటన
April 09th, 09:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 11న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. వారణాసిలో ప్రధాని... ఉదయం 11 గంటలకు రూ. 3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.