భువనేశ్వర్‌లో ‘ఉత్కర్ష్ ఒడిశా’- మేక్ ఇన్ ఒడిశా సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 28th, 11:30 am
ఒడిశా రాష్ట్ర గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఒడిశా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ పారిశ్రామిక-వాణిజ్యవేత్తలు, దేశవిదేశాల పెట్టుబడిదారులు, ఈ కార్యక్రమానికి హాజరైన ఒడిశా సోదరసోదరీమణులారా!భువనేశ్వర్ లో 'ఉత్కర్ష్ ఒడిశా' - మేక్ ఇన్ ఒడిశా సదస్సు- 2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 28th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉత్కర్ష్ ఒడిశా – మేక్ ఇన్ ఒడిశా సమ్మేళనం, 2025 మేక్ ఇన్ ఒడిశా ఎగ్జిబిషన్ లను ప్రారంభించారు. 2025 జనవరి నెలలో తాను ఒడిశాలో పర్యటించడం ఇది రెండోసారి అని, ప్రవాసీ భారతీయ దివస్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తాను మొదటిసారి వచ్చానని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఒడిశాలో జరిగిన అతిపెద్ద వ్యాపార శిఖరాగ్ర సదస్సు బిజినెస్ సమ్మిట్ ఇదేనని, మేక్ ఇన్ ఒడిశా కాన్ క్లేవ్ 2025లో 5-6 రెట్లు ఎక్కువ మంది పెట్టుబడిదారులు పాల్గొంటున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు.జనవరి 28న ఒడిశా, ఉత్తరాఖండ్‌లలో ప్రధానమంత్రి పర్యటన
January 27th, 06:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 28న ఒడిశాలోనూ, ఉత్తరాఖండ్‌లోనూ పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11 గంటలకు ఆయన ‘ఉత్కర్ష్ ఒడిశా-మేక్ ఇన్ ఒడిశా కాన్‌క్లేవ్- 2025’ను భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ప్రారంభిస్తారు. ఆ తరువాత, ఆయన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు వెళ్తారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు 38వ నేషనల్ గేమ్స్‌ను ఆయన ప్రారంభించనున్నారు.