Prime Minister congratulates space scientists and engineers for successful launch of LVM3-M6 and BlueBird Block-2

December 24th, 10:04 am

PM Modi hailed scientists and engineers for the successful launch of the LVM3-M6 rocket, describing it as a significant step in India’s efforts towards an Aatmanirbhar Bharat. He remarked that placing the heaviest satellite ever launched from Indian soil, the United States’ BlueBird Block-2, into its intended orbit marks a proud milestone in India’s space journey.

భారత్‌-జోర్డాన్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 16th, 12:24 pm

కాలుష్య రహిత వృద్ధి లేనిదే నేటి ప్రపంచం ముందడుగు వేయడం సాధ్యం కాదు. అందువల్ల కాలుష్య రహిత ఇంధనం ఇక ఎంతమాత్రం ఐచ్ఛికం కాదు... అదొక అవసరంగా మారిపోయింది. ఆ మేరకు భారత్‌ ఇప్పటికే సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ సహా ఇంధన నిల్వలో పెట్టుబడిదారుగా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో జోర్డాన్‌కు అపార సామర్థ్యం ఉంది కాబట్టి, దాన్ని రెండు దేశాలూ సంయుక్తంగా మరింత సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి, కింగ్ అబ్దుల్లా II

December 16th, 12:23 pm

అమ్మాన్‌లో ఈ రోజు నిర్వహించిన ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జోర్డాన్ యువరాజు హుస్సేన్, ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, పెట్టుబడుల మంత్రి కూడా హాజరయ్యారు. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని రాజు, ప్రధాని ఇద్దరూ గుర్తించారు. సామర్థ్యాన్ని, అవకాశాలను వృద్ధిగా, సంక్షేమంగా మార్చాలని రెండు దేశాల పారిశ్రామిక వేత్తలను కోరారు. దక్షిణాసియా, పశ్చిమాసియా పరిధి దాటి విస్తరించిన ఆర్థిక కారిడార్‌ను తయారుచేయడానికి జోర్డాన్ స్వేచ్ఛాయుత వ్యాపార ఒప్పందాలను, భారత ఆర్థిక శక్తిని ఏకం చేయాలని జోర్డాన్ రాజు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి

December 11th, 08:50 pm

అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మాట్లాడారు.

బందీల విడుదలను స్వాగతించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 13th, 07:59 pm

రెండు సంవత్సరాలకు పైగా బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల కుటుంబాల ధైర్యానికీ, శాంతి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.

భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ తో ప్రధానమంత్రి భేటీ

October 11th, 11:58 pm

భారత్ లో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

గాజా శాంతి ప్రణాళిక విజయవంతం పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందించిన ప్రధానమంత్రి

October 09th, 09:31 pm

చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఆయనకు అభినందనలు తెలిపారు.

గాజా సంఘర్షణకు స్వస్తి పలికే దిశగా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ చేపట్టిన శాంతి సాధన యత్నాలను స్వాగతించిన ప్రధానమంత్రి

September 30th, 09:19 am

గాజా సంఘర్షణను సమాప్తం చేయడానికి అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జే ట్రంప్ నడుం కట్టి ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.

సెప్టెంబర్ 25న ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో పాల్గొననున్న ప్రధానమంత్రి

September 24th, 06:33 pm

సెప్టెంబర్ 25న సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

అమెరికాలోని టెక్సాస్‌ వరదల్లో ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

July 06th, 12:06 am

అమెరికాలోని టెక్సాస్‌‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో ప్రాణనష్టం, ముఖ్యంగా పిల్లలు మరణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంత ప్రయోగం పట్ల ప్రధానమంత్రి హర్షం

June 25th, 01:30 pm

భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

శ్రీ జో బైడెన్ త్వరగా కోలుకోవాలి: ప్రధానమంత్రి

May 19th, 02:30 pm

అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ ఆరోగ్యం పట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శీఘ్రంగా, సంపూర్ణంగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ‘‘డాక్టర్ జిల్ బైడెన్‌తో పాటు కుటుంబ సభ్యుల వేదనలో నేను పాలుపంచుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి

April 21st, 08:56 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు గౌరవనీయ జే.డి. వాన్స్‌, రెండో మహిళ శ్రీమతి ఉషా వాన్స్, వారి పిల్లలు, అమెరికా పరిపాలన యంత్రానికి చెందిన సీనియర్ అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు.

మెగా ఇండియా-యుఎస్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న ప్రధాని మోదీ, ట్రంప్

February 14th, 06:46 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ఒక చిరస్మరణీయ సందర్భం, ఇది రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. తన పర్యటనలో, ప్రధాని మోదీ అమెరికా నాయకులు, వ్యాపార దిగ్గజాలు మరియు భారతీయ ప్రవాసులతో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత మరియు దౌత్యం వంటి కీలక రంగాలను కవర్ చేస్తూ ఉన్నత స్థాయి సమావేశాలు మరియు చర్చలలో పాల్గొన్నారు. ఈ పర్యటన భారతదేశం మరియు అమెరికా మధ్య బలమైన సంబంధాన్ని పునరుద్ఘాటించింది, కొత్త ప్రపంచ క్రమాన్ని రూపొందించడంలో రెండు దేశాలను ప్రపంచ భాగస్వాములుగా ఉంచింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భార‌త్‌-అమెరికా సంయుక్త ప్రకటన

February 14th, 09:07 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ డొనాల్డ్ జె.ట్రంప్ 2025 ఫిబ్రవరి 13న వాషింగ్టన్, డి.సి.లో ఆయనకు సాదర ఆతిథ్యమిచ్చారు.

భారత్ - అమెరికా సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రకటనకు తెలుగు అనువాదం

February 14th, 04:57 am

ముందుగా నాకు ఆత్మీయ స్వాగతాన్ని, ఆతిథ్యాన్ని అందించిన నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్ తన నాయకత్వ పటిమ ద్వారా భారత్-అమెరికా మధ్య సంబంధాలను పునరుజ్జీవింపచేశారు.

ప్రధానమంత్రితో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) అధిపతి భేటీ

February 13th, 11:51 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) అధిపతి, టెస్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ ఎలాన్ మస్క్ ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ భేటీ

February 13th, 11:32 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ ఈ రోజు సమావేశమయ్యారు.

వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ప్రధాని మోదీ

February 13th, 11:59 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూఎస్ఏ లోని వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర నాయకులను కలుస్తారు. ఆయన వివిధ ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు.

U.S Director of National Intelligence calls on Prime Minister

February 13th, 11:04 am

The U.S. Director of National Intelligence, Ms. Tulsi Gabbard, called on Prime Minister Shri Narendra Modi today.