పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 29th, 01:30 pm

ఈ చారిత్రాత్మక అలీపుర్‌దువార్ గడ్డ నుంచి బెంగాల్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను!

పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్‌లో రూ.1010 కోట్లకుపైగా విలువైన ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన

May 29th, 01:20 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్‌లో నగర గ్యాస్ సరఫరా (సిజిడి) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నగర గ్యాస్ సరఫరా (సిజిడి) నెట్‌వర్క్‌ విస్తరణలో ఇదొక కీలక ముందడుగు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో- చారిత్రక అలీపూర్‌దౌర్‌ గడ్డమీదినుంచి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత సుసంపన్న సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దీని సరిహద్దులే కాకుండా ఇక్కడి ప్రాచీన సంప్రదాయాలు, సంబంధాలు కూడా ఈ అంశాన్ని స్పష్టంగా నిర్వచిస్తాయని చెప్పారు. మన పొరుగు దేశం భూటాన్‌తో అలీపూర్‌దౌర్‌ సరిహద్దును పంచుకుంటుండగా, దీనికి సరసనేగల అస్సాం ఈ ప్రాంతాన్ని అక్కున చేర్చుకుంటుందన్నారు. మరోవైపు జల్పాయ్‌గురి ప్రకృతి సౌందర్యం, కూచ్బెహార్ ప్రతిష్ఠ ఈ ప్రాంతంలో అంతర్భాగాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాల్ వారసత్వం, ఐక్యతలోనూ విశిష్ట పాత్రగల ఈ సుసంపన్న అలీపూర్‌దౌర్‌ నేలను సందర్శించడం తనకు దక్కిన గౌరవమని ఆయన హర్షం ప్రకటించారు.