Cabinet approves extension corridor from Noida Sector 142 to Botanical Garden (Noida) for a length of 11.56 Km with 8 stations
February 14th, 01:08 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the Extension Corridor from Noida Sector 142 to Botanical Garden (Noida) of the Noida Metro Rail Project, covering a length of 11.56 km with 8 elevated stations. The project will enhance connectivity, stimulate economic activity and ease urban mobility for both residents and commuters, while significantly reducing carbon emissions.రేపు గుజరాత్‌లో ప్రధానమంత్రి పర్యటన
September 19th, 05:22 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు గుజరాత్‌లో పర్యటిస్తారు. ఉదయం 10:30 గంటలకు భావ్‌నగర్‌లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
January 17th, 11:00 am
నేను గత లోక్‌సభ ఎన్నికలు సమీపంలో ఉన్న సమయంలో మిమ్మల్ని కలుసుకున్నాను. ఆ సమయంలో మీ అందరి నమ్మకం వల్ల వచ్చేసారి కూడా ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోకు నేను తప్పకుండా వస్తానని చెప్పాను. దేశం మమ్మల్ని మూడోసారి ఆశీర్వదించింది. మీరంతా మరోసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 17th, 10:45 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో రవాణా కు సంబంధించి దేశంలోనే అతి పెద్ద మొబిలిటీ ఎక్స్ పో- భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది 800 మంది ఎగ్జిబిటర్లు, 2.5 లక్షల మంది సందర్శకులతో పోలిస్తే, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని మరో రెండు వేదికలపై ఎక్స్ పో జరగడంతో ఈ ఏడాది ఎక్స్ పో పరిమాణం బాగా పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే 5 రోజుల్లో అనేక కొత్త వాహనాలను ప్రారంభిస్తారని, ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారని శ్రీ మోదీ పేర్కొన్నారు. “ఇది భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్‌పై గొప్ప సానుకూలతను చూపిస్తుంది” అని ఆయన అన్నారు. ఎగ్జిబిషన్ ను సందర్శించిన సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ అద్భుతమైనది, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. ప్రతి ఒక్కరికీ తన శుభాకాంక్షలను తెలియజేశారు.ప్రధానమంత్రి అధ్యక్షతన 45వ ప్రగతి సమావేశం
December 26th, 07:39 pm
క్రియాశీల పరిపాలన, సకాలంలో ప్రాజెక్టుల అమలుతోపాటు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండే ఐసీటీ ఆధారిత బహువిధ వేదిక అయిన ప్రగతి 45వ ఎడిషన్ గురువారం జరిగింది. దీనికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎనిమిది ముఖ్యమైన ప్రాజెక్టులను సమీక్షించారు. వీటిలో పట్టణ రవాణాకు సంబంధించి ఆరు మెట్రో ప్రాజెక్టులతోపాటు రోడ్డు అనుసంధానత, థర్మల్ విద్యుత్తుకు సంబంధించి ఒక్కో ప్రాజెక్టు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాజెక్టులన్నింటి విలువ రూ. లక్ష కోట్లకు పైమాటే.