గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 పెట్టుబడులు, మౌలికవసతుల సదస్సు 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 11:10 am
తూర్పు, ఈశాన్య భారతం నేడు నూతన భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. భారత ఘన చరిత్రలో తూర్పు రాష్ట్రాల పాత్ర విశేషమైంది, అలాగే నేడు అభివృద్ధి చెందిన భారత్ సాధనలోనూ తూర్పు, ఈశాన్య ప్రాంతాలు కీలకం కానున్నాయి. అసోం సామర్థ్యం, అబివృద్ధిని ఈ అడ్వాంటేజ్ అసోం సదస్సు ప్రంపంచంతో అనుసంధానిస్తుంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అసోం ప్రభుత్వానికి, హిమంత జీ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రజలు అక్షరమాలను నేర్చుకునేటప్పుడు, ‘ఏ అంటే అసోం' అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు అని 2013 ఎన్నికల ప్రచారంలో యాదృచ్చికంగా నేను చెప్పిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది.పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో అడ్వాంటేజ్ అసోం 2.0 శిఖరాగ్ర సదస్సు 2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 25th, 10:45 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అసోంలోని గౌహతి లో అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతూ, భారతదేశ తూర్పు ఈశాన్య ప్రాంతాలు ఈ రోజు భవిష్యత్తు వైపు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాయి. అడ్వాంటేజ్ అసోం అనేది అసోం సామర్థ్యాన్ని, పురోగతిని ప్రపంచంతో పెనవేయడానికి ఒక బృహత్తర చొరవ అని శ్రీ మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధిలో తూర్పు ప్రాంతం పోషించిన ప్రధాన పాత్రకు చరిత్రే సాక్ష్యమని ఆయన అన్నారు. ఈ రోజు వికసిత్ భారత్ వైపు మన పురోగమనంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు తమ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్వాంటేజ్ అసోం అదే స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అసోం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. 'ఎ ఫర్ అసోం' అనేది ప్రామాణికంగా మారడానికి ఎంతో దూరం లేదని 2013లో తాను చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.న్యూ ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 06th, 02:10 pm
అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్‌రాడ్ సంగ్మా గారు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా గారు, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేంసింగ్ తమాంగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, సుకాంత మజుందార్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మిజోరం, నాగాలాండ్ ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు , మహిళలు, ప్రముఖులారా,అష్టలక్ష్మి మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 02:08 pm
అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానిస్తూ, ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవం కూడా ఉందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొందని, ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ గొప్ప ప్రేరణను అందిస్తోందని ప్రధాని అన్నారు. భారత పౌరులందరి పక్షాన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్.!!ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం-2024కి ఆమోదం తెలిపిన క్యాబినెట్
March 07th, 11:18 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 10 సంవత్సరాల కాలానికి ఉత్తర్ పూర్వ రూపాంతర పారిశ్రామికీకరణ పథకం,2024 (ఉన్నతి– 2024)కు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య ప్రతిపాదనను ఆమోదించింది. నోటిఫికేషన్ తేదీ నుండి 8 సంవత్సరాల పాటు మొత్తం రూ.10,037 కోట్ల వ్యయ బాధ్యతలకు కట్టుబడి ఉంటుంది.