ప్రధానమంత్రితో నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమా సమావేశం

June 25th, 10:40 pm

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ద్రవ్య వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దీనిపై ప్రధానమంత్రి వివరిస్తూ- “దేశమంతటా చౌకగా, విస్తృతంగా ఆర్థిక సేవల ప్రదానంలో భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల విప్లవం తోడ్పాటు సహా ఇతరత్రా అంశాలపై మేం చర్చించాం” అని పేర్కొన్నారు. ప్రపంచంలోని భాగస్వామ్య దేశాలతో ఈ అనుభవాన్ని పంచుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో ప్రధానమంత్రి సమావేశం

February 20th, 09:52 pm

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా 20 ఫిబ్రవరి 2026న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ మిస్టర్ ఆంటోనియో గుటెర్రస్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శితో ప్రధానమంత్రి సమావేశం

December 01st, 06:45 pm

భారత జి20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మద్దతుపై ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పు సమస్య పరిష్కారంలో లక్ష్యాల సాధన దిశగా భారత్ చేపట్టిన కార్యక్రమాలు, చర్యల పురోగమనాన్ని ఆయన ప్రముఖంగా వివరించారు.