రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై ఇండియా-ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన

July 09th, 10:55 am

భారత్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులమైన మేం.. మా మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఏకమై.. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా, శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన ప్రాంతంగా మార్చాలన్న ఉమ్మడి ఆశయంతో రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనకు కట్టబడి ఉంటామని తెలియజేస్తున్నాం.

ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

July 07th, 03:15 pm

ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.

ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 07th, 03:00 pm

ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్‌.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సహకారంపై భారత్ - జపాన్ సంయుక్త ప్రకటన

July 02nd, 10:14 pm

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలూ - వ్యాపారాలూ, పాలన, భద్రతా రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తూ.. సర్వోపయోగకర సాంకేతికతగా నేటి కాలాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తోందని భారత్, జపాన్ ప్రధానమంత్రులు వ్యాఖ్యానించారు. ఏఐ రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ, పాలన అంశాల్లో నేడు మనం తీసుకునే నిర్ణయాలు.. భవిష్యత్తులో ఆవిష్కరణలు, సామాజిక సంక్షేమం, ఆర్థిక భద్రత, ప్రపంచ క్రమంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని వారు అంగీకరించారు. ఈ అవగాహనే ప్రాతిపదికగా.. ఇరుదేశాల్లో ఆవిష్కరణలనూ, వృద్ధినీ పెంపొందించుకోవడంతోపాటు ఏఐ రంగంలో సామర్థ్యాన్నీ, పోటీతత్వాన్నీ పరస్పరం మెరుగుపరచుకునే దిశగా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తద్వారా సురక్షితమైన, భద్రమైన, విశ్వసనీయ, సమ్మిళిత, మానవుడే కేంద్రంగా ఉండే, సుస్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించాలని వారు సంకల్పించారు.

ఐక్యరాజ్యసమితి ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న మేజర్ అభిలాషా బరాక్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

June 07th, 02:06 pm

ఐక్యరాజ్యసమితి ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న మేజర్ అభిలాషా బరాక్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం మేజర్ అభిలాషా బరాక్ లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి తాత్కాలిక బలగాల (యూఎన్ఐఎఫ్ఐఎల్) విభాగంలో ఎంగేజ్‌మెంట్ టీమ్ కమాండర్‌గా, జెండర్ ఫోకల్ పాయింట్‌గా సేవలందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టును అభినందించిన ప్రధానమంత్రి

June 07th, 01:58 pm

ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ మొత్తం వారు అద్భుతంగా ఆడారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

Yoga is the best way to maintain a healthy lifestyle with minimal expense: PM Modi at World Yogasana Championship in Ahmedabad

June 04th, 06:41 pm

PM Modi inaugurated the first World Yogasana Championship in Ahmedabad, calling yoga India’s timeless gift to humanity and expressing confidence that Yogasana will gain recognition as a competitive sport in global multi-sport events, including the Olympics. Highlighting yoga’s role in health, wellness and healthy ageing, he urged participants to become ambassadors of the ‘Yoga 365’ campaign and spread yoga’s message worldwide.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన పోటీలకు ప్రధానమంత్రి శ్రీకారం

June 04th, 06:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించే తొలి ‘ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “అంతర్జాతీయ క్రీడా చరిత్రలో అహ్మదాబాద్ గడ్డపై నేడొక కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది” అన్నారు.

సైప్రస్ దేశాధ్యక్షుడి అధికారిక పర్యటన సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన

May 22nd, 09:31 pm

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ 2026 మే 20 నుంచి 23 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేపట్టారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్‌కు సైప్రస్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడంతో ఇది మరింత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్లకు (2031-2035) కేబినెట్ ఆమోదం... యూఎన్ఎఫ్‌సీసీసీకి నివేదించేలా నిర్ణయాలు

March 25th, 05:35 pm

భారత పర్యావరణ కార్యాచరణను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. 2031 నుంచి 2035 కాలానికి గాను దేశపు ‘జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్ల (ఎన్‌డీసీ)’కు ఆమోదం తెలిపింది. యూఎన్ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం దేశం తన పర్యావరణ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు సుస్థిరాభివృద్ధి, వాతావరణపరంగా న్యాయంపై నిబద్ధతను ఈ నిర్ణయంతో పునరుద్ఘాటించింది.

నెక్ట్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 12th, 10:47 pm

ఇవాళ మార్చి 12వ తేదీ చరిత్రాత్మకమైన రోజు. మార్చి 12, 1930న సబర్మతి ఆశ్రమం నుంచి మహాత్మాగాంధీ దండి యాత్ర ప్రారంభించారు. ఇది భారత స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటన. ఈ ప్రయాణం దేశంలోని ప్రతి మూలను తాకింది. దీని ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించటం. ఈ చరిత్రాత్మక రోజుకు నేటితో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులుగా మనం మరో ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రయాణమే అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) కోసం అడుగులు వేయటం. మన లక్ష్యం ఒకటే. మన గమ్యం ఒకటే - అభివృద్ధి చెందిన భారతదేశం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఇలాంటి సదస్సుల్లో జరిగే మేధోమధనం, వాటి ద్వారా లభించే సారాంశం కీలక పాత్ర పోషిస్తాయి. నెక్ట్స్ సమ్మిట్ కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఎంతో మందిలో పాత మిత్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ నా నమస్కారాలు.

ఎన్‌ఎక్స్‌టీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

March 12th, 08:30 pm

చారిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఐటీవీ నెట్‌వర్క్ నిర్వహించిన ఎన్ఎక్స్‌టీ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రస్తుత లక్ష్యానికి మధ్య ఉన్న పోలికలను ఆయన వివరించారు. 1930 నాటి దండి యాత్ర దేశాన్ని స్వాతంత్య్రం వైపు ఎలాగైతే ఏకం చేసిందో ప్రస్తుత 'వికసిత భారత్' మిషన్ కూడా 140 కోట్ల భారతీయుల ఉమ్మడి లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. “చారిత్రాత్మక దండి యాత్ర ప్రారంభమై దాదాపు 100 సంవత్సరాలు గడిచిన తరుణంలో నేడు భారతీయులమైన మనం మరోసారి 'వికసిత భారత్' సాధన కోసం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం” అని ప్రధాని పేర్కొన్నారు.

ఫిన్లాండ్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో భారత్‌-ఫిన్లాండ్ సంయుక్త ప్రకటన

March 05th, 08:03 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ అలెగ్జాండర్ స్టూబ్‌ 7వ తేదీవరకూ భారత్‌లో పర్యటిస్తారు. ప్రస్తుత హోదాలో తొలిసారి మన దేశానికి వచ్చిన ఆయన ప్రధానంగా న్యూఢిల్లీ, ముంబయి నగరాలను సందర్శిస్తారు. ఆయనతోపాటు ఫిన్లాండ్ వాతావరణ-పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి సారీ ముల్తాలా, ఉపాధి శాఖ మంత్రి శ్రీ మాటియస్ మార్టినెన్ సహా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో 5వ తేదీన న్యూఢిల్లీలో 11వ దఫా రైసినా చర్చలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు స్టూబ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రధానోపన్యాసం చేశారు. భారత్‌ గత నెల ఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో పాల్గొన్న నేపథ్యంలో అధ్యక్షుడు స్టూబ్‌ ఇప్పుడు పర్యటిస్తున్నారు.

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో ప్రధానమంత్రి సమావేశం

February 20th, 09:52 pm

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా 20 ఫిబ్రవరి 2026న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ మిస్టర్ ఆంటోనియో గుటెర్రస్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రారంభించనున్న ప్రధాని

February 18th, 03:55 pm

న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో 2026 ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీనికి ముందుగా ఫిబ్రవరి 18 సాయంత్రం 7 గం.లకు వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే వివిధ దేశాల నాయకులకు స్వాగతం పలుకుతారు. అలాగే.. సదస్సుకు హాజరైన అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు.

ఎస్‌సీవో ఇరవై అయిదో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

September 01st, 10:14 am

ఎస్‌సీవో ఇరవై అయిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నందుకు సంతోషిస్తున్నాను. సాదర స్వాగతం పలికినందుకు, చక్కని ఆతిథ్యాన్ని అందించినందుకు అధ్యక్షుడు శ్రీ శీ జిన్‌పింగ్ ‌కు నేను హృదయపూర్వక కృత‌జ్ఞత‌లు తెలియజేస్తున్నాను.

నమీబియా జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 09th, 08:14 pm

ప్రతి ఒక్కరికి శుభాభినందనలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అద్భుత అవకాశాన్ని మీకు మీ ప్రజలు కల్పించారు. రాజకీయాల్లో ఇదొక గొప్ప అవకాశమే కాక, పెద్ద సవాలు కూడా! మీ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయగలరని ఆశిస్తున్నాను.

Prime Minister addresses the Namibian Parliament

July 09th, 08:00 pm

PM Modi addressed the Parliament of Namibia and expressed gratitude to the people of Namibia for conferring upon him their highest national honour. Recalling the historic ties and shared struggle for freedom between the two nations, he paid tribute to Dr. Sam Nujoma, the founding father of Namibia. He also called for enhanced people-to-people exchanges between the two countries.

Rio de Janeiro Declaration- Strengthening Global South Cooperation for a More Inclusive and Sustainable Governance

July 07th, 06:00 am

The leaders of BRICS countries, met in Rio de Janeiro, Brazil for the 17th BRICS Summit. The leaders reaffirmed their commitment to the BRICS spirit of mutual respect and understanding, sovereign equality, solidarity, democracy, openness, inclusiveness, collaboration and consensus. They strongly condemned terrorism and welcomed the inclusion of new countries as BRICS partner countries.

బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం: అంతర్జాతీయ పాలనలో సంస్కరణ

July 06th, 09:41 pm

17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రెజిల్ నాయకత్వంలో మన బ్రిక్స్ సహకారం కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని సంతరించుకుంది. మనలో నిండిన ఈ శక్తి ఎస్‌ప్రెసో కాదు.. డబుల్ ఎస్‌ప్రెసో షాట్ లాంటిది. ఈ విషయంలో నేను అధ్యక్షుడు లూలా దార్శనికతను, ఆయన అచంచలమైన విశ్వాసాన్ని అభినందిస్తున్నాను. బ్రిక్స్ కుటుంబంలో ఇండోనేషియా చేరిన నేపథ్యంలో నా స్నేహితుడు, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవోకు భారత్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.