జీ7 సదస్సు నేపథ్యంలో యూకే ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
June 17th, 12:36 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైపాక్షిక సమావేశం నిర్వహించారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి
June 10th, 11:50 pm
హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.భారత ప్రధానితో బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి భేటీ
June 04th, 09:56 pm
బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.నెసెట్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 08:20 pm
ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.ఇజ్రాయెల్ పార్లమెంట్ - నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 25th, 08:00 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు జెరూసలేంలోని నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు.ఫిబ్రవరి 16న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026'ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
February 15th, 02:21 pm
2026 ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.ప్రధానమంత్రితో రోల్స్ రాయస్ సీఈవో భేటీ
February 11th, 10:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రోల్స్ రాయస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ టుఫాన్ ఎర్గిన్‌బిల్‌గిక్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ‘‘భారత్‌లో రోల్స్ రాయస్ తన కార్యకలాపాల్ని పెంచుకోవడాన్నీ, ఉత్సాహంతో, ఆవిష్కరణలతో నిండిన భారత యవతతో కలిసి పనిచేయడాన్నీ స్వాగతిస్తున్నాం’’ అని అన్నారు.భారత్-యూకే సంయుక్త ప్రకటన
October 09th, 03:24 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని స్వీకరించిన యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ 2025 అక్టోబర్ 8,9 తేదీల్లో భారత్‌లో అధికార పర్యటన చేశారు. ఆయన వెంట ఆ దేశ వ్యాపార, వాణిజ్య మంత్రి, వాణిజ్య బోర్డు అధ్యక్షుడు పీటర్ కైల్, స్కాట్లాండ్ మంత్రి డోగ్లస్ అలెగ్జాండర్, పెట్టుబడుల మంత్రి జేసన్ స్టాక్‌వుడ్‌తో పాటు 125 మంది సీఈవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సాంస్కృతిక నాయకులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది.బ్రిటన్ ప్రధానమంత్రి భారత్ పర్యటన: ముఖ్య నిర్ణయాలు
October 09th, 01:55 pm
భారత్-బ్రిటన్ కనెక్టివిటీ, ఆవిష్కరణ కేంద్రం స్థాపన.అధికారిక పర్యటన నిమిత్తం తొలిసారి భారత్‌కు వచ్చిన యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌కు స్వాగతం పలికిన ప్రధానమంత్రి
October 08th, 12:21 pm
యునైటెడ్ కింగ్డమ్ నుంచి అతి పెద్ద వాణిజ్య బృందంతో కలసి చరిత్రాత్మక పర్యటన నిమిత్తం తొలిసారిగా భారత్‌కు విచ్చేసిన ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు.శ్రీ స్వరాజ్ పాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 22nd, 09:41 am
శ్రీ స్వరాజ్ పాల్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.తమిళనాడు తూత్తుకుడిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
July 26th, 08:16 pm
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, నా కేబినెట్ సహచరులు కింజరపు రామమోహన్ నాయుడు గారు, డా. ఎల్. మురుగన్ గారు, తమిళనాడు మంత్రులు తంగం తెన్నరసు గారు, డా. టి.ఆర్.బి. రాజా గారు, పి. గీతా జీవన్ గారు, అనితా ఆర్. రాధాకృష్ణన్ గారు, ఎంపీ కణిమొళి గారు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మన ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ గారు, తమిళనాడు సోదర సోదరీమణులారా!తమిళనాడు తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
July 26th, 07:47 pm
తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రాంతీయంగా అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరచడంతోపాటు.. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంచేలా, శుద్ధ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ రంగాల్లో వరుసగా చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ వీర సైనికులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. సాహసికులైన వీరయోధులకు ప్రణమిల్లారు. దేశం కోసం ప్రాణత్యాగానికీ వెనుకాడని అమరులకు మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.జులై 26, 27 తేదీల్లో ప్రధాని తమిళనాడు పర్యటన
July 25th, 10:09 am
యూకే, మాల్దీవుల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళనాడు సందర్శిస్తారు. ట్యుటికోరన్‌లో జులై 26 రాత్రి 8 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 4,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేస్తారు.బ్రిటన్ గౌరవ కింగ్ ఛార్లెస్ III తో ప్రధానమంత్రి భేటీ
July 24th, 11:00 pm
బ్రిటన్ రాజు గౌరవ ఛార్లెస్ IIIని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొన్నారు. రాజు గారి వేసవి నివాసం శాండ్రింఘమ్ ఎస్టేట్‌లో ఆయనతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు.భారత్, బ్రిటన్ వ్యాపారవేత్తలతో సమావేశమైన ఇరు దేశాల ప్రధానమంత్రులు
July 24th, 07:38 pm
చారిత్రాత్మక భారత్, బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ రోజు ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఆరోగ్యం, ఔషధాలు, రత్నాలు - ఆభరణాలు, వాహనాలు, ఇంధనం, తయారీ, టెలికాం, టెక్నాలజీ, ఐటీ, సరకు రవాణా, వస్త్రాలు, ఆర్థిక సేవల రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రంగాలు రెండు దేశాల్లో ఉపాధి కల్పన, సమగ్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.భారత్- బ్రిటన్ దార్శనికత 2035
July 24th, 07:12 pm
జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.బ్రిటన్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం
July 24th, 04:20 pm
ముందుగా, ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి స్టార్మర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన విజయాన్ని ఈ రోజు సూచిస్తుంది. అనేక సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల తర్వాత మన రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఈ రోజు ఖరారైనందుకు సంతోషిస్తున్నాను.India and the UK are laying the foundation for a new chapter in our shared journey: PM Modi
July 24th, 04:00 pm
During his official visit to the United Kingdom, PM Modi met with the UK PM Keir Starmer. The two leaders held a one-on-one meeting as well as delegation level talks and welcomed the signing of the historic India-UK Comprehensive Economic and Trade Agreement (CETA). They reviewed the entire gamut of the bilateral relationship and adopted the India-UK Vision 2035.బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ
July 24th, 03:59 pm
బ్రిటన్‌లో ఈ నెల 23-24 తేదీల్లో అధికారిక పర్యటన సందర్భంగా ఆ దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ కీర్ స్టార్మర్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. బకింగ్‌హామ్‌షైర్‌లో ఉన్న చెకర్స్‌లోని బ్రిటన్ ప్రధాని నివాసానికి చేరుకున్న శ్రీ మోదీకి శ్రీ స్టార్మర్ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలూ ముఖాముఖి సమావేశంతోపాటు ప్రతినిధి బృంద స్థాయి చర్చలు నిర్వహించారు.