ప్రధానమంత్రి అధ్యక్షతన 49వ ప్రగతి సమావేశం

September 24th, 09:56 pm

ఈ రోజు ఉదయం సౌత్ ‌బ్లాక్‌లో జరిగిన ఐసీటీ ఆధారిత బహుళ విధ వేదిక ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ - ప్రగతి 49వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ప్రధాన ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి, ఇబ్బందులను పరిష్కరించేందుకు, సకాలంలో పనులు పూర్తి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ వేదిక ఒక్క చోటకు చేరుస్తుంది.

We launched the SVAMITVA Yojana to map houses and lands using drones, ensuring property ownership in villages: PM

January 18th, 06:04 pm

PM Modi distributed over 65 lakh property cards under the SVAMITVA Scheme to property owners across more than 50,000 villages in over 230 districts across 10 states and 2 Union Territories. Reflecting on the scheme's inception five years ago, he emphasised its mission to ensure rural residents receive their rightful property documents. He expressed that the government remains committed to realising Gram Swaraj at the grassroots level.

స్వామిత్వ లబ్దిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

January 18th, 05:33 pm

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన లబ్ధిదారుడు శ్రీ మనోహర్ మేవాడతో సంభాషించిన ప్రధానమంత్రి, పథకానికి సంబంధించి తన అనుభవాన్ని పంచుకోవాలని కోరారు. ఆస్తి పత్రాలతో రుణం పొందడం గురించి అలాగే తన జీవితంలో దానివల్ల కలిగిన ప్రయోజనాలను శ్రీ మనోహర్‌ను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. తన డెయిరీ ఫామ్ కోసం 10 లక్షల రుణం తీసుకున్నాననీ, అది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంతగానో సహాయపడిందని శ్రీ మనోహర్ వివరించారు. తాను, తన పిల్లలు, తన భార్య కూడా డెయిరీ ఫామ్‌లో పనిచేయడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఆస్తి పత్రాలు ఉండటం వల్లే బ్యాంకు రుణం పొందడం సులభతరమైందని శ్రీ మనోహర్ సంతోషంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవితాల్లో కష్టాలు తగ్గాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వామిత్వ యోజన లక్షలాది కుటుంబాల ఆదాయాన్ని పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు గర్వంగా తల ఎత్తుకుని, జీవితంలో సుఖాన్ని అనుభవించేలా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. స్వామిత్వ యోజనను ఈ దార్శనికతకు కొనసాగింపుగా ప్రధానమంత్రి అభివర్ణించారు.

స్వామిత్వ పథకం కింద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ద్వారా

January 18th, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్వామిత్వ పథకం కింద 65 లక్షలకుపైగా ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 230కిపైగా జిల్లాల్లోని 50,000కుపైగా గ్రామాల ప్రజలు వీటిని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- అనేక గ్రామాలు-గ్రామీణ ప్రాంతాలకు ఇది చరిత్రాత్మక దినమని, ఇందుకుగాను లబ్ధిదారులతోపాటు పౌరులందరికీ అభినందనలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఆస్తి సొంతదారులకు స్వామిత్వ పథకంలో భాగంగా

January 16th, 08:44 pm

స్వామిత్వ పథకంలో భాగంగా 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. జనవరి 18న మధ్యాహ్నం సుమారు 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాని 10 రాష్ట్రాలతోపాటు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 230కి పైగా జిల్లాల్లో 50,000కు పైగా గ్రామాల్లో ఆస్తి సొంతదారులకు ఈ ఆస్తి కార్డుల్ని పంపిణీ చేస్తారు.

స్వామిత్వ పథకం ద్వారా 50 లక్షల మందికి పైగా యాజమాన్య పత్రాలను పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి

December 26th, 04:50 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 27 మధ్యాహ్నం 12.30 గం.లకు జరిగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 200 జిల్లాల్లో ఉన్న 46,000 గ్రామాల్లోని యజమానులకు స్వామిత్వ పథకం కింద 50 లక్షల స్థిరాస్థి కార్డులను అందజేస్తారు.

జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ‘బలవర్ధక బియ్యం’ ఉచిత పంపిణీ సహా ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు మంత్రివర్గ ఆమోదం

October 09th, 03:07 pm

జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ సహా అన్ని ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) ఉచిత పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాలు ప్రస్తుతం అమలవుతున్న విధానాల్లోనే కొనసాగుతాయి.

ప్రధాని అధ్యక్షతన ఆగస్ట్ 7న నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

August 05th, 01:52 pm

భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటున్న ఈ అమృత సందర్భం గా రాష్ట్రాలు మరింత ఉత్సాహం, శక్తి, స్వయం సమృద్ధి, స్వావలంబన మరియు సహకార సమాఖ్య స్ఫూర్తితో ‘ఆత్మ నిర్భర్ భారత్’ వైపు పయనించాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, నిలకడతో నిరంతరం కొనసాగే ప్రగతి కోసం, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించే దిశగా, నీతి ఆయోగ్ ఏడవ పాలక మండలి సమావేశం 7 ఆగస్టు 2022న నిర్వహించబడుతుంది. కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారం మరియు సయోధ్య తో కొత్త శకం వైపు పయనంలో సమన్వయానికి మార్గం సుగమం చేస్తుంది.

ప్రభుత్వ పథకాలలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

April 08th, 03:58 pm

డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్ ), ప్రధాన మంత్రి పోషణ్ శ క్తి నిర్మాణ్ - పిఎమ్ పోషణ్ [పూర్వ మ ధ్యాహ్న భోజన ప థ కం -ఎండిఎమ్ ) ఇంకా భార త ప్ర భుత్వానికి చెందిన ఇతర సంక్షేమ ప థకాల (ఓడబ్ల్యుఎస్ ) ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర కేంద్ర పాలిత ప్రాంతాల లో 2024 నాటికి దశల వారీగా పోషక విలువలు కలిగిన (ఫోర్టిఫైడ్ )బియ్యాన్ని సరఫ రా చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన