India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta
July 07th, 11:47 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
July 07th, 05:30 pm
ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ఆంగ్ల అనువాదం: లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం.... ప్రధాని సమాధానం
February 04th, 07:00 pm
గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నిన్న, ఈ రోజు అర్థరాత్రి వరకు గౌరవ ఎంపీలందరూ ఈ ధన్యవాద తీర్మానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా అనుభవజ్ఞులైన ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సహజంగానే ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం అవసరం ఉన్న చోట ప్రశంసలు ఉంటాయి. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ కొన్ని ప్రతికూల విషయాలు ఉంటాయి. ఇది చాలా సహజం! అధ్యక్షా.. దేశ ప్రజలు నాకు 14వసారి ఇక్కడ కూర్చొని రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించారు. ఇది నా అదృష్టం. కాబట్టి ఈ రోజు నేను ప్రజలకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చర్చలో పాల్గొని చర్చను గొప్పగా చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.Prime Minister Shri Narendra Modi’s reply to the Motion of Thanks on the President’s Address in Lok Sabha
February 04th, 06:55 pm
During the Motion of Thanks on the President’s Address, PM Modi highlighted key achievements, stating 250 million people were lifted out of poverty, 40 million houses were built, and 120 million households got piped water. He emphasized ₹3 lakh crore saved via DBT and reaffirmed commitment to Viksit Bharat, focusing on youth, AI growth, and constitutional values.హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు 2024లో ప్రధాని ప్రసంగానికి అనువాదం
November 16th, 10:15 am
వందేళ్ల క్రితం, పూజనీయ బాపూజీ హిందూస్థాన్ టైమ్స్‌ను ప్రారంభించారు. ఆయన గుజరాతీ మాట్లాడతారు. వందేళ్ల తర్వాత మరో గుజరాతీని మీరు ఇక్కడకు ఆహ్వానించారు. హిందూస్థాన్ టైమ్స్‌కు, ఈ వందేళ్ల చారిత్రక ప్రయాణంలో ఈ పత్రికతో కలసి పనిచేసిన వారికి, అభివృద్ధిలో భాగస్వాములైనవారికి, సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ అభినందనలకు, గౌరవానికి వీరంతా అర్హులు. వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ గుర్తింపునకు మీరంతా అర్హులు, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రాగానే, ఈ కుటుంబ సభ్యులను నేను కలుసుకున్నాను. వందేళ్ల ప్రయాణాన్ని (హిందూస్థాన్ టైమ్స్) తెలియజేసే ప్రదర్శనను సందర్శించాను. మీకు సమయం ఉంటే, ఇక్కడి నుంచి వెళ్లే ముందు దాన్ని సందర్శించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అది ప్రదర్శన మాత్రమే కాదు. ఓ అనుభవం. నా కళ్ల ముందే వందేళ్ల చరిత్ర నడయాడిన అనుభూతికి నేను లోనయ్యాను. భారత దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చన నాటి పత్రికలను నేను చూశాను. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి విశిష్ట వ్యక్తులు హిందూస్థాన్ టైమ్స్‌లో వ్యాసాలు రాసేవారు. వారి రచనలు పత్రికను సుసంపన్నం చేశాయి. నిజంగా మనం చాలా దూరమే ప్రయాణించాం. స్వాంతంత్య్రం సాధించడానికి చేసిన పోరాటం నుంచి, స్వాంతంత్య్రం అనంతరం సరిహద్దులు లేని ఆశల తరంగాలను చేరుకోవడం వరకు చేసిన ప్రయాణం అద్భుతం, అసాధారణం. అక్టోబర్ 1947లో కశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత ప్రతి పౌరుడూ అనుభవించిన ఉత్సాహాన్ని మీ వార్తా పత్రిక ద్వారా తెలుసుకున్నాను. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో హింస ఎలా చెలరేగిందో కూడా తెలుసుకోగలిగాను. గతానికి భిన్నంగా జమ్ము కశ్మీర్లో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన వార్తలను ఈ రోజు మీ పత్రికలో ప్రచురిస్తున్నారు. పత్రిక మరో పేజీ కూడా పాఠకుల దృష్టిని ఆకర్షించింది. ఒక వైపు అస్సాంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారన్న వార్తను ప్రచురిస్తే, మరో పక్క అటల్‌జీ బీజేపీకి పునాది వేశారన్న వార్త ప్రచురించారు. ఈ రోజు అస్సాంలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించడం కాకతాళీయమే.న్యూఢిల్లీలో ‘2024- హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్’ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 16th, 10:00 am
న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన ‘2024-హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’ నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వందేళ్ల కిందట జాతి పిత మహాత్మా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన హిందుస్థాన్ టైమ్స్ పత్రిక, నూరేళ్ళ చారిత్రాత్మక ప్రయాణం పూర్తిచేసినందుకు పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. తొలినాళ్ళ నుంచీ పత్రికతో అనుబంధం కలిగిన వారిని అభినందిస్తూ, వారికి అన్ని విధాలా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. పత్రిక శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, అద్భుతమైన ఈ ప్రదర్శనను ప్రతినిధులందరూ తప్పక సందర్శించాలని సూచించారు. భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం, రాజ్యాంగం అమలు… మొదలైన అలనాటి చారిత్రక ఘట్టాలకు సంబంధించిన పాత ప్రతులను చూసే అవకాశం కలిగిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్ వంటి లబ్ధ ప్రతిష్ఠులు హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాసేవారని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరు నాటి పరిస్థితులకు, అనంతర కాలంలోని ఆశలూ ఆకాంక్షలకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన పత్రిక ప్రయాణం అద్భుతమనదగ్గదని అన్నారు. అక్టోబర్ 1947లో భారతదేశంలో కాశ్మీర్ విలీనానికి సంబంధించిన వార్తను తానూ మిగతా దేశవాసులతో కలిసి అబ్బురంగా చదివానని శ్రీ మోదీ నెమరువేసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంలో అసంగదిగ్ధత కాశ్మీర్ ను ఏ విధంగా ప్రతికూలంగా ప్రభావితం చేసిందో ఆ క్షణం తనకు అవగతమైందని, ఏడు సుదీర్ఘ దశాబ్దాల పాటు కాశ్మీర్ హింసను ఎదుర్కొనవలసి వచ్చిందని అన్నారు. ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో రికార్డు సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం గురించి వార్తల ప్రచురణ తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తనని ఆకర్షించిన మరో వార్త గురించి చెబుతూ, వార్తా పత్రిక ఒకవైపు పుటలో అస్సాం ను సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించిన వార్త ప్రచురితమవగా, మరోవైపు భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపనకు సంబంధించిన వార్త ప్రచురితమైందని వెల్లడించారు. నేడు అస్సాంలో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు అదే బీజేపీ కీలక భూమిక పోషిస్తూండడం తనకు ఆనందం కలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.స్వచ్చతా హీ సేవ - 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం
October 02nd, 10:15 am
నేడు పూజ్య బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి. ఈ భరతమాత గొప్ప కుమారులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. గాంధీజీ, ఇతర మహనీయులు భారతదేశం కోసం కన్న కలను సాకారం చేసేందుకు కలిసి పనిచేయడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది.స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 02nd, 10:10 am
పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన సామూహిక ఉద్యమాల్లో ఒకటైన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ 155వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ స్వచ్ఛభారత్ దివస్ 2024 కార్యక్రమం నిర్వహించారు. అమృత్, అమృత్ 2.0, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోబర్‌ధన్ పథకాల కింద పలు ప్రాజెక్టులతో పాటు మొత్తం రూ. 9600 కోట్ల విలువైన అనేక పారిశుధ్య, పరిశుభ్రతా ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ‘స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత’ ఈ ఏడాది స్వచ్ఛతా హి సేవా నినాదం అని తెలిపారు.చతుర్దేశాధినేతల సమావేశం : సమాచార పత్రం
September 25th, 11:53 am
అమెరికాలోని శ్వేత సౌధంలో చతుర్దేశాధినేతల తొట్టతొలి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అధ్యక్షుడు బైడెన్ సెప్టెంబరు 24న భారత, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, యోషిహిడే సుగా, స్కాట్ మోరిసన్‌లకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనడంలో ఆచరణాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం సహా స్నేహ సంబంధాల బలోపేతానికి తోడ్పడే విశిష్ట చర్యలు చేపట్టాలని అధినేతలు ఆకాంక్షించారు. ఈ మేరకు కోవిడ్-19 అంతం దిశగా సురక్షిత, ప్రభావశీల టీకాల ఉత్పత్తి-లభ్యత పెంపు, ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతులకు ప్రోత్సాహం, వాతావరణ మార్పు సంక్షోభ నిరోధం, ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాల్లో భాగస్వామ్యం, అంతరిక్షం, సైబర్ భద్రత, నాలుగు దేశాల్లోనూ భవిష్యత్తరం ప్రతిభాపాటవాల వృద్ధి వంటివి ఈ చర్యలలో భాగంగా ఉన్నాయి.Swachh Bharat mission has benefited the poor and the women most: PM Modi
September 25th, 06:31 am
PM Modi received 'Global Goalkeeper Award for the Swachh Bharat Abhiyan, from the Bill and Melinda Gates Foundation. Award presented by Mr. Bill Gates. In last five years a record more than 11 crore toilets were constructed. If Swachh Bharat mission has benefited someone the most, it is the poor of this country and the women, said the PM.స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు గాను ‘గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు’ ను అందుకొన్న ప్రధాన మంత్రి
September 25th, 06:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు గాను బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ ప్రదానం చేసిన గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ను 2019వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ నాడు అందుకొన్నారు. ఈ పురస్కార ప్రదానోత్సవం న్యూ యార్క్ లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ (యుఎన్‌జిఎ) సమావేశాల సందర్భం గా జరిగింది.PM Modi's bilateral meetings on the sidelines of UNGA
September 24th, 02:47 am
On the sidelines of the UNGA, PM Modi held bookstall meetings with several world leaders in New York.న్యూఢిల్లీలో నిర్వహించిన పిఎంఎన్ సి హెచ్ పార్ట్ నర్స్ ఫోరమ్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
December 12th, 08:46 am
ప్రపంచ వ్యాప్తం గా అనేక దేశాల నుండి పార్ట్ నర్స్ ఫోరమ్, 2018కి విచ్చేసిన వారందరికీ ఆత్మీయ స్వాగతం. భాగస్వామ్యాలు మాత్రమే మనల్ని మన లక్ష్యాల వద్దకు చేర్చుతాయి. పౌరుల మధ్య భాగస్వామ్యాలు, సామాజిక వర్గాల మధ్య భాగస్వామ్యాలు, దేశాల మధ్య భాగస్వామ్యాలు.. మనకు తెలుసు. దీనికి ప్రతిఫలం గా సుస్థిర అభివృద్ధి ప్రణాళిక అనేది మనకు సిద్దిస్తుంది.పార్ట్‌నర్స్ ఫోరమ్ 2018 ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి శ్రీ మోదీ
December 11th, 12:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 12వ తేదీ నాడు నాలుగో పార్ట్‌నర్స్ ఫోరమ్ ను న్యూ ఢిల్లీ లో ప్రారంభించనున్నారు. డిసెంబర్ 12 వ, 13 వ తేదీ లలో రెండు రోజులు పాటు జరిగే అంతర్జాతీయ సమావేశాన్ని భారత ప్రభుత్వం పార్ట్ నర్ శిప్ ఫర్ మేటర్నల్, న్యూ బార్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పిఎమ్ ఎన్ సిహెచ్) యొక్క భాగస్వామ్యం తో నిర్వహించనుంది. చిన్నారులు, పూర్వ కౌమార దశ లో ఉన్న వారు మరియు మహిళల ఆరోగ్యాన్ని, ఇంకా అభ్యున్నతి ని మెరుగుపరచడం కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమాని కై 85 దేశాలకు చెందిన సుమారు 1500 మంది ని ఒక చోటుకు తీసుకువస్తోంది. అన్ని ప్రాంతాలకు చెందిన మరియు అన్ని ఆదాయ స్థాయి లకు చెందిన దేశాల తో సహా కీలకమైన ప్రపంచ సంస్థ లు మరియు ప్రాంతీయ సంఘాల కు (ఉదాహరణకు జి7, జి20, బిఆర్ఐసిఎస్ వగైరా) అధ్యక్షత వహిస్తున్న దేశాలను ఎంపిక చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది.ప్రధాన మంత్రి తో పిఎమ్ఎన్‌సిహెచ్ ప్రతినిధివర్గం భేటీ; 2018 పార్ట్‌నర్స్ ఫోరమ్ యొక్క గుర్తింపు చిహ్నం అందజేత
April 11th, 08:21 pm
ది పార్ట్ నర్ షిప్ ఫర్ మేటర్నల్, న్యూ బార్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పిఎమ్ఎన్‌సిహెచ్) యొక్క ప్రతినిధివర్గం ప్రధాన మంతి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమైంది.మానవ సేవే మాధవ సేవ: ప్రధాని మోదీ
October 20th, 01:44 pm
కేదార్నాథ్లో ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించిన, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. కేదార్నాథ్ యొక్క ఈ పవిత్ర భూమి నుండి, నేను భోవల్ బాబా యొక్క ఆశీర్వాదం కోరుకుంటాను మరియు 2022 లో 75 సంవత్సరాల స్వాతంత్ర్యంను గుర్తుచేసుకునే సమయానికి అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క స్వప్నాన్ని సాకారం చేసేందుకు పూర్తిగా అంకిత భావంతో కృషి చేస్తాను.కేదార్‌నాథ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; అవస్థాపన పథకాలకు శంకుస్థాపన
October 20th, 12:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కేదార్‌నాథ్ ను సందర్శించారు. ఆయన కేదార్‌నాథ్ దేవాలయంలో అర్చనలో పాలు పంచుకొన్నారు.ఒక దేశం దాని వారసత్వాన్ని మర్చిపోతే ముందుకు సాగదు: ప్రధాని మోదీ
October 17th, 11:05 am
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంను ప్రధాని మోదీ ప్రారంభించారు. పేద ప్రజలకు సరసమైన ఆరోగ్య రక్షణ కల్పించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. నివారణ ఆరోగ్య రక్షణ, మరియు బంధుత్వత మరియు చికిత్సకు ప్రాప్యతను మెరుగుపర్చేందుకు ఆయన ఉద్ఘాటించారు.అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 17th, 11:04 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ (ఎఐఐఎ)ను ఈ రోజు న్యూ ఢిల్లీలో దేశ ప్రజలకు అంకితం చేశారు.స్వచ్ఛత అనేది భారతదేశ పేద ప్రజలకు సేవ చేసే మార్గం: ప్రధాని మోదీ
September 23rd, 10:24 am
వారణాసిలోని పశుధన్ ఆరోగ్య మేళాలో నేడు ప్రధాని మోదీ పాల్గొన్నారు, పిఎంఏవై లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అతను షహన్షాపూర్ గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమానికి హాజరైనారు.