జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్లకు (2031-2035) కేబినెట్ ఆమోదం... యూఎన్ఎఫ్‌సీసీసీకి నివేదించేలా నిర్ణయాలు
March 25th, 05:35 pm
భారత పర్యావరణ కార్యాచరణను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. 2031 నుంచి 2035 కాలానికి గాను దేశపు ‘జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్ల (ఎన్‌డీసీ)’కు ఆమోదం తెలిపింది. యూఎన్ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం దేశం తన పర్యావరణ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు సుస్థిరాభివృద్ధి, వాతావరణపరంగా న్యాయంపై నిబద్ధతను ఈ నిర్ణయంతో పునరుద్ఘాటించింది.రోమ్, గ్లాస్గో పర్యటనలకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన
October 28th, 07:18 pm
ప్రధానమంత్రి మారియో డ్రాఘి ఆహ్వానం మేరకు నేను 2021 అక్టోబర్ 29-31 తేదీల మధ్య ఇటలీలోని రోమ్ నగరాన్ని, వాటికన్ నగరాన్ని సందర్శిస్తున్నాను. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు ఆ తర్వాత 2021 నవంబర్ 1-2 తేదీల్లో యునైటెడ్ కింగ్ డమ్ లోని గ్లాస్గో నగరాన్ని సందర్శిస్తాను.