శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి
June 10th, 11:50 pm
హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.స్వీడన్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి
May 18th, 12:10 am
స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో స్వీడన్ యువరాణి విక్టోరియా కూడా పాల్గొన్నారు. స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్టాఫ్, రాణి సిల్వియాల తరఫున ఆమె ప్రధానమంత్రి మోదీకి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజు కార్ల్ XVI గుస్టాఫ్ 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.రవీంద్రనాథ్ ఠాగూర్ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక బహుమతులను ఇచ్చిపుచ్చుకున్న భారత్, స్వీడన్ ప్రధానులు
May 17th, 11:18 pm
నోబెల్ బహుమతి గ్రహీత, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని స్మరించుకుంటూ స్వీడన్ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక స్మారక బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు.ఎంపిక చేసిన స్వీడన్ వ్యాపార దిగ్గజాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భేటీ
May 17th, 11:16 pm
భారత్, స్వీడన్ దేశాలు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, సుస్థిరత వంటి ఉమ్మడి విలువల ద్వారా అనుసంధానమయ్యాయని, ఇవి ఉన్నత లక్ష్యాలను కలిగి భవిష్యత్ ఆధారిత ఆర్థిక భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు భారత్, స్వీడన్ భాగస్వామ్యం కేవలం ఒక ఆర్థిక సంబంధం మాత్రమే కాదని, అది ఆలోచనలు, సాంకేతికత, ఆవిష్కరణలు, సహ సృష్టి ల భాగస్వామ్యమని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. భారతదేశ వృద్ధికి స్వీడిష్ కంపెనీలు సుదీర్ఘకాలంగా అందిస్తున్న సహకారాన్ని ఆయన స్వాగతించారు. పరిశోధన, ఆవిష్కరణలు, ఇంధన మార్పు, తయారీ ఉత్పాదక రంగాలలో మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.స్వీడన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
May 17th, 06:09 pm
ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వయంగా స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి రక్షణగా స్వీడన్ తన యుద్ధ విమానాలను కూడా పంపింది. ఈ పర్యటన భారత్-స్వీడన్ సంబంధాల లోతు పెరుగుతున్న తీరును, కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉన్న ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతోంది.యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
May 15th, 07:56 am
ప్రధాని మోదీ 2026 మే 15 నుండి 20 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన వివిధ దేశాధినేతలతో సమావేశమై, కీలక రంగాలలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో జరిగే 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' మరియు ఓస్లోలో జరిగే '3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్'లో ఆయన పాల్గొనడం ఈ పర్యటనలోని ముఖ్యాంశాలు.ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)
May 11th, 09:00 pm
ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.స్వీడన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సమావేశం
December 01st, 08:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘దుబాయ్’లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.కాప్-28లో పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ కార్యక్రమానికి భారత్-స్వీడన్ సహాధ్యక్షత
December 01st, 08:29 pm
దుబాయ్‌లో కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా 2024-26 కాలానికిగాను పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ (లీడ్ ఐటీ2.0) సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్ సహాధ్యక్షత వహించారు.కాప్-28లో ప్రపంచ హరిత ప్రోత్సహక కార్యక్రమంపై యుఎఇ-భారత్ సహాధ్యక్షత
December 01st, 08:28 pm
దుబాయ్‌లో 2023 డిసెంబరు 1న కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘ప్రపంచ హరిత ప్రోత్సాహక కార్యక్రమం’పై ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మాననీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. స్వీడన్ ప్రధాన మంత్రి గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్, మొజాంబిక్ అధ్యక్షుడు మాననీయ ఫిలిప్ న్యుసి, ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు చార్లెస్ మిషెల్ ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా అన్ని దేశాలకూ ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు.స్వీడన్ కుతదుపరి ప్రధాని గా శ్రీ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
October 19th, 09:46 am
స్వీడన్ కు తదుపరి ప్రధాని గా శ్రీ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.