సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
May 22nd, 01:00 pm
పర్యటన సందర్భంగా మీ ఆప్యాయత, స్నేహం, భారతదేశంతో మీకున్న బలమైన అనుబంధాన్ని మేం మనస్ఫూర్తిగా అనుభూతి చెందాం. నేడు మీ భారత పర్యటన.. మన ఉమ్మడి ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన
May 20th, 10:28 pm
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.అనువాదం: ఇటలీ ప్రధానమంత్రితో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని ప్రసంగం
May 20th, 05:00 pm
గడిచిన దాదాపు మూడున్నర సంవత్సరాల్లో నాకు ప్రధాన మంత్రి మెలోని గారితో పలుమార్లు సమావేశమయ్యే అవకాశాలు లభించాయి. ఇది భారత్, ఇటలీ దేశాల మధ్య ఉన్న సన్నిహిత సహకారానికి, పరస్పర అవగాహనకు నిదర్శనం. ఆమె నాయకత్వంలో మన ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త వేగాన్ని, నూతన దిశను, సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకున్నాయి. మన బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ ఈ రోజు మనం ఒక 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' ప్రకటిస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.భారత్-నార్డిక్ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన
May 19th, 04:25 pm
ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన
May 18th, 04:44 pm
గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.India-Netherlands Joint Statement on the visit of Prime Minister of India to Netherlands
May 17th, 03:45 am
At the invitation of Netherlands PM Rob Jetten, PM Modi paid an official visit to the Netherlands. They held discussions and expressed their desire to further expand and deepen the multifaceted relationship between the two countries. Noting with satisfaction the progress achieved in recent years, they elevated bilateral ties to a 'Strategic Partnership' and welcomed the adoption of a Strategic Partnership Roadmap.ఆస్ట్రియా ఛాన్సలర్‌తో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
April 16th, 11:55 am
40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా ఛాన్సలర్ భారతదేశ పర్యటనకు రావడం చాలా ముఖ్యమైన విషయం. 2026లో భారత్-ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత భారత్-ఈయూ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఛాన్సలర్ స్టాకర్ పర్యటన ద్వారా మేం భారత్-ఆస్ట్రియా సంబంధాలను ఒక నూతన యుగంలోకి తీసుకెళ్తున్నాం.నెక్ట్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 12th, 10:47 pm
ఇవాళ మార్చి 12వ తేదీ చరిత్రాత్మకమైన రోజు. మార్చి 12, 1930న సబర్మతి ఆశ్రమం నుంచి మహాత్మాగాంధీ దండి యాత్ర ప్రారంభించారు. ఇది భారత స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటన. ఈ ప్రయాణం దేశంలోని ప్రతి మూలను తాకింది. దీని ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించటం. ఈ చరిత్రాత్మక రోజుకు నేటితో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులుగా మనం మరో ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రయాణమే అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) కోసం అడుగులు వేయటం. మన లక్ష్యం ఒకటే. మన గమ్యం ఒకటే - అభివృద్ధి చెందిన భారతదేశం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఇలాంటి సదస్సుల్లో జరిగే మేధోమధనం, వాటి ద్వారా లభించే సారాంశం కీలక పాత్ర పోషిస్తాయి. నెక్ట్స్ సమ్మిట్ కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఎంతో మందిలో పాత మిత్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ నా నమస్కారాలు.ఎన్‌ఎక్స్‌టీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
March 12th, 08:30 pm
చారిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఐటీవీ నెట్‌వర్క్ నిర్వహించిన ఎన్ఎక్స్‌టీ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రస్తుత లక్ష్యానికి మధ్య ఉన్న పోలికలను ఆయన వివరించారు. 1930 నాటి దండి యాత్ర దేశాన్ని స్వాతంత్య్రం వైపు ఎలాగైతే ఏకం చేసిందో ప్రస్తుత 'వికసిత భారత్' మిషన్ కూడా 140 కోట్ల భారతీయుల ఉమ్మడి లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. “చారిత్రాత్మక దండి యాత్ర ప్రారంభమై దాదాపు 100 సంవత్సరాలు గడిచిన తరుణంలో నేడు భారతీయులమైన మనం మరోసారి 'వికసిత భారత్' సాధన కోసం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం” అని ప్రధాని పేర్కొన్నారు.LDF and UDF have deprived Keralam of its youth power: PM Modi in Ernakulam
March 11th, 03:00 pm
Amid a massive gathering in Ernakulam today, Prime Minister Narendra Modi said the enthusiasm and confidence of the people reflected a strong aspiration for Keralam’s development and a new political direction in the state. He emphasised that the aspirations of the people clearly indicate a desire for faster growth and new opportunities.PM Modi addresses a mega public meeting in Ernakulam, Keralam
March 11th, 02:20 pm
Amid a massive gathering in Ernakulam today, Prime Minister Narendra Modi said the enthusiasm and confidence of the people reflected a strong aspiration for Keralam’s development and a new political direction in the state. He emphasised that the aspirations of the people clearly indicate a desire for faster growth and new opportunities.ఫిన్లాండ్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
March 05th, 11:55 am
ఫిన్లాండ్ అధ్యక్ష హోదాలో తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన గౌరవనీయ అలెక్సాండర్ స్టూబ్ గారికి నా హృదయపూర్వక స్వాగతం. ఆయనొక విశిష్ట ప్రపంచ నాయకుడు మాత్రమేగాక మాననీయ రచయిత.. విజ్ఞాని కూడా.భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
February 18th, 08:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లివచ్చారు.2030 వైపు: ఉమ్మడి భారతదేశం-యూరోపియన్ యూనియన్ సమగ్ర వ్యూహాత్మక అజెండా
January 27th, 06:48 pm
2026 జనవరి 27న న్యూఢిల్లీలో జరిగిన 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ఉమ్మడి భారతదేశం-ఈయు సమగ్ర వ్యూహాత్మక అజెండా, భాగస్వాములిద్దరికీ మరియు విస్తృత ప్రపంచానికి పరస్పర ప్రయోజనకరమైన, కాంక్రీట్ మరియు పరివర్తనాత్మక ఫలితాలను అందించడానికి ఈయు-భారతదేశ సహకారాన్ని విస్తృతం చేయడం, లోతుగా చేయడం మరియు మెరుగైన సమన్వయం చేయడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.భారతదేశం - యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడి భారతదేశ అధికారిక పర్యటన మరియు 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంపై ఈయు సంయుక్త ప్రకటన
January 27th, 06:15 pm
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ 77వ భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా భారతదేశానికి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా, మైలురాయి భారతదేశం-ఈయు ఎఫ్టిఏ పై చర్చలు విజయవంతంగా ముగిసినందుకు నాయకులు ప్రశంసించారు మరియు 2030 వైపు: భారతదేశం-ఈయు ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక అజెండాను ఆమోదించారు.జర్మన్ ఛాన్సలర్‌తో సంయుక్త మీడియా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 12:49 pm
ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంలో ఛాన్సలర్ మెర్జ్‌ను స్వాగతించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్-జర్మనీ మధ్య తత్వం, జ్ఞానం, ఆధ్యాత్మికతల వారధిని స్వామి వివేకానంద స్వయంగా నిర్మించడం ఒక సంతోషకరమైన యాదృచ్చిక అంశం. ఈ రోజున ఛాన్సలర్ మెర్జ్ సందర్శన ఆ వారధికి కొత్త శక్తిని, కొత్త విశ్వాసాన్ని, పరిధినీ ఇస్తోంది.యూకే ప్రధానితో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
October 09th, 11:25 am
భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని కీర్ స్టార్మర్‌కు ముంబయిలో ఈ రోజు స్వాగతం చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను.పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్
September 17th, 07:14 pm
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడిన డెన్మార్క్ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టే ఫ్రెడరిక్సన్
September 16th, 07:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు డెన్మార్క్ ప్రధానమంత్రి గౌరవ మెట్టే ఫ్రెడరిక్సన్తో టెలిఫోన్ లో మాట్లాడారు.ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి
September 06th, 06:11 pm
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్ ద్వారా సంభాషించారు.