ప్రధానమంత్రితో రోల్స్ రాయస్ సీఈవో భేటీ

February 11th, 10:24 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రోల్స్ రాయస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ టుఫాన్ ఎర్గిన్‌బిల్‌గిక్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ‘‘భారత్‌లో రోల్స్ రాయస్ తన కార్యకలాపాల్ని పెంచుకోవడాన్నీ, ఉత్సాహంతో, ఆవిష్కరణలతో నిండిన భారత యవతతో కలిసి పనిచేయడాన్నీ స్వాగతిస్తున్నాం’’ అని అన్నారు.