స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య150 వ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి

August 02nd, 08:38 pm

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

Prime Minister pays tribute to Munshi Premchand on his birth anniversary

July 31st, 01:48 pm

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to renowned litterateur Munshi Premchand on his birth anniversary.

Prime Minister shares Sanskrit Subhashitam paying tribute to Shaheed Udham Singh

July 31st, 09:12 am

On the Balidan Diwas of Udham Singh, PM Modi paid heartfelt tributes to the great revolutionary martyr and shared a Sanskrit Subhashitam comparing the spirit of valour to the rising sun. He said that the saga of courage and valour embodied in Udham Singh’s life will continue to inspire every generation in the country.

చంద్రశేఖర్ ఆజాద్ జయంతి... శ్రద్ధాంజలి అర్పించిన ప్ర‌ధానమంత్రి

July 23rd, 08:22 am

చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. చంద్రశేఖర్ ఆజాద్ నిర్భయత్వాన్ని, ధైర్య సాహసాల్ని, తిరుగులేని దేశభక్తిని చాటి భారతదేశ స్వాతంత్య్రక సమర చరిత్రలో గౌరవాన్విత స్థానాన్ని సొంతం చేసుకున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి

July 23rd, 08:12 am

లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహోన్నత వ్యక్తిగా లోకమాన్య తిలక్ జాతీయ భావాన్ని మేల్కొలిపారని, ప్రజాసేవకు తమను తాము అంకితం చేసుకొనేలా తరతరాలకు స్ఫూర్తినందించారని ప్రధాని కొనియాడారు.

Prime Minister speaks with the Amir of Qatar

July 16th, 09:35 pm

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with the Amir of the State of Qatar, H.H. Sheikh Tamim bin Hamad Al Thani.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి... నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

July 06th, 12:21 pm

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ నిర్మాణానికి కారకులైన ప్రముఖులలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒకరని ప్రధాని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రఖ్యాత విద్యావేత్త, దార్శనికత కలిగిన నేత అని, భారత్ ఏకత, గౌరవం, ప్రగతి కోసం జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

July 05th, 12:09 pm

కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. సమాజంలోని అణగారిన-బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయడంలో ఆయన అంకితభావం సదా స్మరణీయమని వ్యాఖ్యానించారు.

స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు

July 04th, 01:50 pm

నేడు స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవం (మహాసమాధి దినం) సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో స్వామి వివేకానంద చేసిన అసాధారణ కృషి తరతరాలకూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు. ఆయన అపారమైన జ్ఞానం, శాశ్వతమైన ఆదర్శాలు నేటికీ దేశంలోని లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలనే మన సామూహిక సంకల్పానికి, స్వామిజీ అందించిన ఆధ్యాత్మిక సందేశం నిరంతరం సరికొత్త శక్తిని, స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

హుల్ దివస్ సందర్భంగా వీర యోధులకు ప్రధానమంత్రి నివాళులు

June 30th, 06:10 pm

నేడు హుల్ దివస్ సందర్భంగా విదేశీ పాలన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన సిదో-కన్హూ, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి వీర యోధులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గిరిజన ఆత్మగౌరవం, మర్యాదను కాపాడటం కోసం వారు చేసిన పోరాటం, త్యాగాల గాథ దేశ ప్రజల హృదయాల్లో నిరంతరం సరికొత్త శక్తిని నింపుతూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్‌కు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:46 pm

రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు నివాళులర్పించారు. సాహూ మహారాజ్‌ తన జీవితాన్ని అణగారిన, శ్రమ దోపిడీకి గురైన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆదర్శాలు రాబోయే తరాలకు, దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

హజ్రత్ ఇమామ్ హుస్సేన్‌కు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:30 pm

హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్‌) కాలాతీత త్యాగాన్ని.. సత్యం, న్యాయం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతను స్మరించుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇమామ్ హుస్సేన్ జీవితం, ఆయన వీరమరణం... ధైర్యం, దృఢ సంకల్పాల శాశ్వత శక్తికి నిదర్శనంగా నిలుస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

June 25th, 10:53 am

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామిక విలువలను రక్షించిన వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ చరిత్రలో అత్యంత నిరాశామయ అధ్యాయాలలో ఎమర్జెన్సీ ఒకటి అని ఆయన అన్నారు. ఆ సమయం... మౌనంగా ఉండిపోకుండా, రాజ్యాంగంలోని ఆదర్శాలను నిలబెట్టిన అసంఖ్యాక పౌరుల అసాధారణ ధైర్య, సాహసాలను, ధీరత్వాన్ని చాటిందని కూడా ఆయన అన్నారు.

పహాడ్‌పూర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సభ్యుల సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి

June 20th, 08:47 pm

పహాడ్‌పూర్‌లోని పాఠశాల ప్రాంగణంలో ఉన్న దివంగత శ్రీ శ్యామ్ చరణ్ ముర్ము, దివంగత శ్రీ లఖన్ ముర్ము, దివంగత శ్రీ సిపున్ ముర్ము సమాధుల వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు.

స్లోవేకియాలో అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 15th, 06:00 pm

స్లోవేకియా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు బ్రాటిస్లావాలోని స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై… భారత ప్రధానమంత్రిగా అత్యధిక కాలం కొనసాగిన శ్రీ నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకుల అభినందనలు

June 09th, 07:32 pm

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, అత్యధిక కాలం భారత ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న శ్రీ నరేంద్ర మోదీని ప్రపంచ నేతలు హృదయపూర్వకంగా అభినందించారు. ప్రపంచంలోని వివిధ దేశాల నాయకులు ఆయన పరిణామాత్మక పాలనను, వర్ధమాన దేశాల కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. సార్వజనీన, గతిశీల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను రూపొందించడంపై ఆయన దార్శనికతను వారు వేనోళ్ల ప్రశంసించారు.

లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

May 31st, 11:15 am

లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆమెకు నివాళి అర్పించారు.

దివంగత నేత శ్రీ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు

May 28th, 09:56 am

దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు.

వీర్‌ సావర్కర్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

May 28th, 09:52 am

నేడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన్ను స్మరించుకున్నారు. సావర్కర్‌ అసాధారణ ధైర్యసాహసాలకు, దేశభక్తికి, సమాజ సంస్కరణలకు ఆయన చేసిన కృషికి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

May 21st, 09:02 am

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.