PM to visit Rajasthan and Gujarat on 4 July
July 03rd, 11:25 am
PM Modi will visit Rajasthan and Gujarat on 4 July to launch development projects across multiple sectors. The Rajasthan visit includes the launch of the Modified UDAN Scheme in Jodhpur and the dedication of India’s first greenfield integrated Refinery-cum-Petrochemical Complex in Balotra. In Sanand, Gujarat, he will inaugurate the CG Semi OSAT facility with an annual production capacity of up to 5 billion semiconductor chips.న్యూఢిల్లీలో నిర్వహించిన ‘రిపబ్లిక్ సమ్మిట్-2026’లో ప్రధానమంత్రి ప్రసంగం
June 22nd, 10:24 pm
స్వర సాధన.. మనోకామన.. ఆరాధన- ఇలాంటి శుభారంభం తర్వాత, మీ కార్యక్రమమే కొనసాగి ఉంటే చాలా బాగుండేదేమో... ఏదేమైనా మీకందరికీ నమస్కారం!‘రిపబ్లిక్ సదస్సు-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 22nd, 08:00 pm
రిపబ్లిక్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం వేగవంతమైన, ముఖ్యమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో ‘‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’’ అనే ఇతివృత్తంతో చర్చను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.గడచిన దశాబ్దంగా భారత్ సాధిస్తున్న విజయాలకు, విశ్వసనీయమైన అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ‘‘దేశమే ప్రథమం’’ అనే సిద్ధాంతమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, అభివృద్ది, ప్రతికూలతల నుంచి నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం ఉందని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు.. రాబోయే శతాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా భారత్ ఎదుగుతోంది. నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ క్షేమం కోసం నిబద్ధతే ఆధారంగా భారత్ వృద్ధి చెందుతోంది’’ అని ప్రధాని వివరించారు.డామన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 07:20 pm
మీరంతా ఇక్కడకు ఎలాగైతే వచ్చారో అలాగే లక్షద్వీప్‌లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనతో అనుసంధానమయ్యారు. ఈరోజు లక్షద్వీప్‌లో అభివృద్ధికి ఒక కొత్త ఆరంభం జరిగింది. లక్షద్వీప్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఒక కొత్త ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడంతో పాటు కొన్ని పథకాలకు శంకుస్థాపనలు కూడా చేశాం.డామన్‌లో సుమారు రూ. 2,970 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు... ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 07:15 pm
డామన్‌లో సుమారు రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన గత పర్యటనను గుర్తుచేసుకుంటూ, తాను గతంలో చేసిన పరిశీలన ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన మన దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నివసించే వివిధ ప్రాంతాల ప్రజలతో యావత్ దేశపు అందమైన దృశ్యాన్ని అందిస్తూ, మినీ ఇండియాకు సజీవ ఉదాహరణగా డామన్ నిలుస్తోంది అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ప్రధానమంత్రి అధ్యక్షతన 51వ ప్రగతి సమావేశం
May 27th, 10:01 pm
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిని సమర్థంగా సమన్వయం చేయడం ద్వారా క్రియాశీల పాలనను, సకాలంలో పథకాల అమలును నిర్ధారించడం లక్ష్యంగా పనిచేసే ఐసీటీ ఆధారిత బహుళ-మాధ్యమ వేదిక 'ప్రగతి' (పీఆర్ఏజీఏటీఐ) 51వ సమావేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఉదయం 'సేవా తీర్థ్'లో జరిగింది.అనువాదం: హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 10th, 03:45 pm
సైబరాబాద్‌కు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ సామర్థ్యం ఉంది. తెలంగాణ, దేశం సాధిస్తోన్న వేగవంతమైన అభివృద్ధికి ఇది ఒక ప్రధాన కేంద్రం. అందుకే తెలంగాణను దేశపు అతిపెద్ద తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నేడు సైబరాబాద్ నుంచి ఎన్నో భారీ ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ వేలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అనుసంధానత కూడా మరింత బలోపేతం అవుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సుమారు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన సహా దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 10th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని తెలంగాణలోని హైదరాబాద్‌లో దాదాపు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ- జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యంగల కూడలిగా హైదరాబాద్ నగర పరిణామాత్మక ప్రాశస్త్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణ సహా యావద్దేశాన్నీ శరవేగంగా పురోగమింపజేయడంలో ఈ ప్రాంతం కీలక పోషిస్తున్నదని ప్రస్ఫుటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రారంభించిన వివిధ భారీ ప్రాజెక్టులు ఈ రాష్ట్రాన్ని ఓ ప్రధాన తయారీ కూడలిగా నిలుపుతాయని ఆయన పేర్కొన్నారు. నేటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో వేలాది కొత్త ఉపాధి అవకాశాల సృష్టి సహా ప్రాంతీయ అనుసంధానం బలోపేతం కాగలదన్నారు. ప్రగతికి దోహదం చేసే ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర ప్రజలకూ ఎంతో ప్రయోజనం కల్పిస్తాయంటూ వారికి అభినందనలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం
May 05th, 07:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఇవాళ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో రూ.23,437 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో:జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్లకు (2031-2035) కేబినెట్ ఆమోదం... యూఎన్ఎఫ్‌సీసీసీకి నివేదించేలా నిర్ణయాలు
March 25th, 05:35 pm
భారత పర్యావరణ కార్యాచరణను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. 2031 నుంచి 2035 కాలానికి గాను దేశపు ‘జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్ల (ఎన్‌డీసీ)’కు ఆమోదం తెలిపింది. యూఎన్ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం దేశం తన పర్యావరణ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు సుస్థిరాభివృద్ధి, వాతావరణపరంగా న్యాయంపై నిబద్ధతను ఈ నిర్ణయంతో పునరుద్ఘాటించింది.అనువాదం: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై లోక్‌సభలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
March 23rd, 02:15 pm
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, వాటి వల్ల భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడటానికి నేను ఈ గౌరవనీయ సభ ముందుకు వచ్చాను. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. గత రెండు మూడు వారాలుగా శ్రీ జైశంకర్ గారు, శ్రీ హర్దీప్ పూరీ గారు ఈ విషయంపై అవసరమైన తాజా సమాచారాన్ని ఈ సభకు అందించారు. ఇప్పుడు ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై దీని ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం అన్వేషించాలని ప్రపంచమంతా అన్ని పక్షాలను కోరుతోంది.పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 23rd, 02:00 pm
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాని వల్ల భారత్ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతోందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, మానవ జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందన్నారు. దీనిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి తీవ్రత గురించి వివరిస్తూ.. ‘‘ఈ సంక్షోభాన్ని వీలైనంత తర్వగా పరిష్కరించాలని అన్ని పక్షాలకు ప్రపంచమంతా విజ్ఞప్తి చేస్తోంది’’ అన్నారు.Tiruchirappalli turns out in huge numbers for PM Modi’s public meeting
March 11th, 06:00 pm
At a massive public meeting in Tamil Nadu’s Tiruchirappalli, Prime Minister Narendra Modi hailed Tiruchirappalli as a land of courage and faith, recalling the bravery of the Marudu Brothers and paying tribute to Major M. Saravanan for his sacrifice during the Kargil War. “Trichy is a land of courage and faith,” he said, adding that the Centre proudly honours Tamil Nadu’s culture and heritage. He also highlighted that C. P. Radhakrishnan, a son of the state, serves as the Vice President of India.ఢిల్లీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 08th, 03:54 pm
అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాం. కాసేపటి క్రితమే, ముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. మెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయి, ఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోంది. ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతో, ఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది. ఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 08th, 10:26 am
దేశ రాజధానీ నగరం ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం” అని పేర్కొన్నారు.పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో సుస్థిర, బలమైన ఆర్థిక వృద్ధిపై పీఎం ప్రసంగం
March 03rd, 11:30 am
బడ్జెట్ వెబినార్ సిరీస్‌లో భాగంగా గత వారం మొదటి వెబినార్ జరిగింది. అది విజయవంతమైందని నాకు తెలిసింది. బడ్జెట్ నిబంధనల అమలుపై ప్రతి ఒక్కరూ అద్భుతమైన సూచనలు ఇచ్చారు. మీ అందరి క్రీయాశీలక భాగస్వామ్యాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఇవాళ రెండో వెబినార్ జరుగుతుంది. ఇవాళ కూడా విస్తృత శ్రేణి అంశాలపై వేలాది మంది లెక్కలేనన్ని సూచనలు ఇస్తారని, వివిధ రంగాల నిపుణులు కూడా మనతో పాల్గొంటారని నాకు సమాచారం ఉంది. బడ్జెట్ పై ఇంతటి భారీ స్థాయి చర్చ నిర్వహించటం విజయవంతమైన ప్రయోగం. ఈ వెబినార్‌లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. దేశ ఆర్థిక వృద్ధిని నిరంతరం బలోపేతం చేయటమే ఈ వెబినార్ ఇతివృత్తం. పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచానికే ఆశా కిరణంలా భారత్ మారిన తరుణంలో ప్రపంచ సరఫరా వ్యవస్థను పునర్ వ్యవస్థీకరిస్తున్న వేళ, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి వేగవంతమైన ఆర్థిక పురోగతే ప్రధాన ఆధారం. మన లక్ష్యం, మన సంకల్పం స్పష్టంగా ఉన్నాయి. నిర్మాణ సామర్థ్యం, ఉత్పత్తి, అనుసంధానతను పెంచటంతో పాటు ఎగుమతులను కూడా మరింతగా పెంచాల్సిన అవసముంది. ఇవాళ మీరు చేస్తున్న ఈ మేధోమదనం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.‘ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేయడం’పై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 03rd, 11:15 am
‘ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేసుకోవడం’ అంశంపై ఈ రోజు నిర్వహించిన బడ్జెట్ అనంతర రెండో వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత వారం ఉత్సాహాన్ని గుర్తుచేసుకుంటూ.. మొదటి వెబినార్ విజయవంతమైందని, బడ్జెటులో పేర్కొన్న అంశాల అమలుపై అద్భుతమైన సూచనలు వచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 22nd, 01:30 pm
బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్ జాతికి అంకితం
February 22nd, 01:12 pm
మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.India’s direction and vision for AI are clear, AI is a shared resource for the welfare of humanity: PM Modi
February 19th, 01:00 pm
In his remarks at the Leaders’ Plenary Session during the India AI Impact Summit, PM Modi noted how India has seen technology serve humanity, citing the digital vaccination platform that helped vaccinate millions on time. Highlighting that for India technology is not a medium of power but of service, he underlined that AI too must follow this path to ensure the welfare of humanity. For the ethical use of AI, the PM offered three valuable suggestions.