ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం

December 17th, 12:25 pm

పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని

December 17th, 12:12 pm

భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్’ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Cabinet approves policy for auction of Coal Linkage for Seamless, Efficient & Transparent Utilisation (CoalSETU)

December 12th, 04:18 pm

Adding to the series of coal sector reforms being undertaken by the Government, the Cabinet Committee, chaired by PM Modi, has today approved the Policy for Auction of Coal Linkage for Seamless, Efficient & Transparent Utilisation (CoalSETU) by creating a “CoalSETU window” in the NRS Linkage Policy. The Policy will allow allocation of coal linkages on auction basis on long-term for any industrial use and export.

జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో ప్రధాని పర్యటన

December 11th, 08:43 pm

మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబరు 15 – 16 తేదీల్లో హషేమైట్ రాజ్యమైన జోర్డాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా గౌరవ మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్‌తో భారత ప్రధానమంత్రి సమావేశమై.. భారత్, జోర్డాన్ మధ్య సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించడంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపైనా చర్చిస్తారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. భారత్ - జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పర వృద్ధి, సంక్షేమం కోసం సహకారానికి కొత్త మార్గాల అన్వేషణకు, అలాగే.. ప్రాంతీయ శాంతి, సమృద్ధి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో అంకితభావాన్ని పునరుద్ఘాటించేందుకు ఇదో మంచి అవకాశం.

రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర‌్భంగా తీర్మానాలు

December 05th, 05:53 pm

ఒక దేశ పౌరులు మరొక దేశ భూభాగానికి తాత్కాలిక కార్మిక కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రభుత్వం, రష్యా ఫెడరేషన్

భారత్ - రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతర సంయుక్త ప్రకటన

December 05th, 05:43 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు 2025 డిసెంబర్ నాలుగు, ఐదు తేదీలలో భారత్ లో పర్యటించారు.

జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ

November 23rd, 09:46 pm

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి శ్రీ సనే తకైచీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబరు 29న టెలిఫోన్ సంభాషణ అనతరం జపాన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం కావడం ఇదే తొలిసారి.

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

November 23rd, 02:18 pm

జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ సిరిల్ రామఫోసాను కలిశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చినందుకు... సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు రామఫోసాకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి, వాటి ఆధారంగా మరింత పురోగతి సాధనకు దక్షిణాఫ్రికా జీ20 చేసిన ప్రయత్నాలనూ ఆయన అభినందించారు.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే జీ20 నాయకుల సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ

November 19th, 10:42 pm

20వ జీ20 నాయకుల సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ 2025 నవంబర్ 21-23 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ను సందర్శిస్తారు. శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా, జీ20 ఎజెండాలోని కీలక అంశాలపై భారతదేశం యొక్క దృక్పథాలను ప్రధానమంత్రి ప్రదర్శించారు. శిఖరాగ్ర సమావేశాల సమయంలో, ఆయన ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు మరియు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబిఎస్ఏ) నాయకుల సమావేశంలో కూడా పాల్గొంటారు.

భారత ఎగుమతి వ్యవస్థ బలోపేతం కోసం రూ.25,060 కోట్లతో ‘ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌’కు మంత్రిమండలి ఆమోదం

November 12th, 08:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఇవాళ ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం)కు ఆమోదం తెలిపింది. దేశం నుంచి ఎగుమతుల పరంగా పోటీతత్వాన్ని బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఇది ‘ఎంఎస్‌ఎంఈ'లు, తొలిసారి ఎగుమతిదారులు, శ్రామికశక్తి ఆధారిత రంగాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ 2025–26లో ప్రకటించిన కీలక కార్యక్రమం.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ

October 17th, 04:22 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దుల్లాటీ ఈ రోజు సమావేశమయ్యారు.

బ్రిటన్ ప్రధానమంత్రి భారత్ పర్యటన: ముఖ్య నిర్ణయాలు

October 09th, 01:55 pm

భారత్-బ్రిటన్ కనెక్టివిటీ, ఆవిష్కరణ కేంద్రం స్థాపన.

యూకే ప్రధానితో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

October 09th, 11:25 am

భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని కీర్ స్టార్మర్‌కు ముంబయిలో ఈ రోజు స్వాగతం చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను.

నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్యానికి ఆర్థిక సాయం, దేశీయ సామర్ధ్యాన్ని బలోపేతం చేయడానికి సమగ్ర నాలుగు స్తంభాల వ్యూహం

September 24th, 03:08 pm

నౌకా వాణిజ్య రంగ వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తిస్తూ భారత నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య రంగాల పునరుజ్జీవనం కోసం రూ 69,725 కోట్ల సమగ్ర ప్యాకేజీని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి.. దీర్ఘకాలిక ఆర్థిక సాయాన్ని మెరుగుపరచడానికి.. గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి.. సాంకేతిక సామర్థ్యాలు-నైపుణ్యాలను మెరుగుపరచడానికి.. బలమైన నౌకా వాణిజ్య మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చట్టపరమైన, పన్నులపరమైన, విధానపరమైన సంస్కరణల అమలు కోసం రూపొందించిన నాలుగు స్తంభాల వ్యూహాన్ని ఈ ప్యాకేజీ పరిచయం చేస్తుంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన గ్రీస్ ప్రధాని

September 19th, 02:51 pm

హెలెనిక్ రిపబ్లిక్ ప్రధాని గౌరవ కిరియాకోస్ మిట్సోటాకిస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడిన డెన్మార్క్ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టే ఫ్రెడరిక్సన్

September 16th, 07:29 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు డెన్మార్క్ ప్రధానమంత్రి గౌరవ మెట్టే ఫ్రెడరిక్సన్తో టెలిఫోన్ లో మాట్లాడారు.

భారత్ - అమెరికా మధ్య బలమైన సంబంధాలున్నాయని స్పష్టం చేసిన ప్రధాని

September 10th, 07:52 am

భారత్ - అమెరికా మధ్య బలమైన సత్సంబంధాలున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవిష్యత్తును అందించడం లక్ష్యంగా ఇరుదేశాలూ కలిసి పనిచేస్తాయని శ్రీ మోదీ అన్నారు.

భారత్ - సింగపూర్ సంయుక్త ప్రకటన

September 04th, 08:04 pm

గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ భారత్‌లో అధికారికంగా పర్యటించిన సందర్భంగా భారత్, సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళికపై సంయుక్త ప్రకటన:

సింగపూర్ ప్రధానితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం

September 04th, 12:45 pm

ప్రధానమంత్రి శ్రీ వాంగ్ పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత మొదటిసారిగా భారత్ అధికార పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ పర్యటన మరింత మహత్తరమైంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత ప్రస్తుతం 60వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.

జర్మనీ విదేశాంగ మంత్రితో భారత ప్రధాని భేటీ

September 03rd, 08:40 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌తో భేటీ అయ్యారు. ‘‘భారత్, జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా.. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరత, తయారీ, రవాణా సహా ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు విస్తృత అవకాశాలు స్పష్టంగా మన కళ్లముందున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.