మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 17th, 11:20 am
మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీ సోదరులారా!మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం
September 17th, 11:19 am
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి - వాగ్దేవికి నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజు దేవశిల్పీ, నైపుణ్యం, సృజనాత్మకతకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతి అని చెబుతూ ఆయనకు శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. హస్త కళా నైపుణ్యం, అంకితభావంతో దేశ నిర్మాణంలో పాలుపంచు కొంటున్న కోట్లాది సోదరీసోదరులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
August 17th, 12:45 pm
కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 17th, 12:39 pm
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.గుజరాత్ లోని దాహోద్ లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
May 26th, 11:45 am
గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, గుజరాత్ మంత్రివర్గంలోని నా సహచరులందరూ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర విశిష్ట ప్రముఖులు, దాహోద్ లోని నా ప్రియమైన సోదరులు, సోదరీమణులారా!గుజరాత్‌లోని దాహోద్‌లో రూ. 24,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 26th, 11:40 am
గుజరాత్‌లోని దాహోద్ లో రూ.24,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2014లో తాను మొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మే 26నే కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైనదని అన్నారు. దేశాన్ని నడిపించే బాధ్యతను నిర్వర్తించడంలో గుజరాత్ ప్రజలు తనకు అందించిన మద్దతును, ఆశీర్వాదాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఈ నమ్మకం, ప్రోత్సాహమే దేశానికి రేయింబవళ్లు సేవ చేయాలనే తన అంకితభావానికి ఆధారంగా నిలిచాయని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న పాత పద్దతులను వదిలించుకుని ప్రతి రంగంలోనూ దూసుకువెళ్లేలా గడచిన కొన్నేళ్లలో భారత్ అసాధారణమైన, ఊహకందని నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ‘‘ఈరోజు నిరాశ, చీకటి నుంచి బయటపడి సరికొత్త విశ్వాసం, ఆశావాదం నిండిన కొత్తయుగంలోకి దేశం అడుగుపెట్టింది’’ అని చెప్పారు.25 మే 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 122 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 25th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం... నేడు యావద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమై ఉంది. ఆగ్రహంతో ఉంది. సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే. మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి హిందుస్థానీ శిరస్సును ఉన్నతంగా నిలిపింది. సరిహద్దు దాటి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత అద్భుతం. 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 30th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-ఈ వారం భారతదేశంపై ప్రపంచం
March 20th, 12:22 pm
ఆకాశం నుండి సముద్రాల వరకు, ఏఐ నుండి పురాతన చేతిపనుల వరకు, ఈ వారం భారతదేశం యొక్క కథ విస్తరణ, పురోగతులు మరియు సాహసోపేతమైన కదలికలతో కూడుకున్నది. అభివృద్ధి చెందుతున్న విమానయాన పరిశ్రమ, హిందూ మహాసముద్రంలో శాస్త్రీయ ఆవిష్కరణ, చారిత్రాత్మక ఉపగ్రహ ప్రయోగం మరియు ఏఐ ఉద్యోగాల పెరుగుదల - భారతదేశం భవిష్యత్తులోకి నమ్మకంగా అడుగుపెడుతోంది. అంతేకాకుండా, అర్మేనియాతో సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయి, ఒక ప్రధాన అంతరిక్ష సంస్థ భారత తీరాలను చూస్తోంది మరియు చేతివృత్తులవారు వారసత్వ బొమ్మల తయారీకి కొత్త ప్రాణం పోస్తున్నారు. భారతదేశం యొక్క ఆపలేని పెరుగుదలను నిర్వచించే కథలలోకి ప్రవేశిద్దాం.రిపబ్లిక్ ప్లీనరీ సదస్సులో ప్రధాని ప్రసంగం
March 06th, 08:05 pm
మీరంతా అలసిపోయి ఉంటారు.. అర్నబ్ గొంతు వినీవినీ మీ చెవులూ అలసిపోయుంటాయి. కూర్చో అర్నబ్.. ఇంకా ఎన్నికల సీజన్ మొదలవలేదు. ముందుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రిపబ్లిక్ టీవీకి శుభాకాంక్షలు. ఇంత పెద్ద పోటీని నిర్వహించి క్షేత్రస్థాయిలో యువతను భాగస్వాములను చేయడం ద్వారా వీరందరినీ మీరిక్కడికి తీసుకొచ్చారు. జాతీయ స్థాయి చర్చల్లో యువత భాగస్వామ్యం ఆలోచనల్లో కొత్తదనాన్ని రేకెత్తిస్తుంది. అది వ్యవస్థలో నవోత్తేజాన్ని నింపుతుంది. దాన్నే మనమిప్పుడు ఇక్కడ ఆస్వాదిస్తున్నాం. ఓ రకంగా యువత భాగస్వామ్యంతో బంధనాలన్నింటినీ విచ్ఛిన్నం చేయగలం, హద్దులకు అతీతంగా విస్తరించ గలం. దానితో అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ ఉండదు. చేరుకోలేని గమ్యమంటూ ఏదీ లేదు. ఈ సదస్సు కోసం రిపబ్లిక్ టీవీ కొత్త ఆలోచనలతో పనిచేసింది. ఈ కార్యక్రమం విజయవంతమవడం పట్ల మీ అందరికీ అభినందనలు. మీకు నా శుభాకాంక్షలు. ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. ఒకటి- నేను కొన్ని రోజులుగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆ లక్ష మందీ కూడా తమ కుటుంబాల్లో రాజకీయాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తులై ఉండాలి. కాబట్టి ఓ రకంగా ఇలాంటి కార్యక్రమాలు నా లక్ష్య సాధనకు రంగం సిద్ధం చేస్తున్నాయి. రెండు- వ్యక్తిగతంగా నాకో ప్రయోజనముంది. అదేమిటంటే 2029లో ఓటు వేయబోతున్న వారికి 2014కు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో ఏ అంశాలుండేవో తెలియదు. పదీ పన్నెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగేవని వారికి తెలియదు. 2029లో ఓటు వేసే సమయానికి.. గతంతో పోల్చి చూసుకునే సదుపాయం వారికి ఉండదు. ఆ పరీక్షలో నేను పాసవ్వాలి. ఆ దిశగా యువతను సన్నద్ధులను చేసేలా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకుంది.PM Modi addresses Republic Plenary Summit 2025
March 06th, 08:00 pm
PM Modi addressed the Republic Plenary Summit in Delhi. Shri Modi highlighted that the world is now recognising this century as India's century and the country's achievements and successes have sparked new hope globally. He stated that India, once perceived as a nation that would sink itself and others, is now driving global growth.ఎంఎస్ఎంఈ రంగంపై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్లు మూడింటిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
March 04th, 01:00 pm
క్యాబినెట్ సహచరులు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సోదర సోదరీమణులారా!బడ్జెట్ అనంతర వెబినార్లనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
March 04th, 12:30 pm
బడ్జెట్ అనంతర వెబినార్లనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వృద్ధి చోదకాలుగా ఎంఎస్ఎంఈలు, తయారీ, ఎగుమతులు, అణు ఇంధన కార్యక్రమాలు, నియంత్రణ, పెట్టుబడి, సులభతర వాణిజ్య సంస్కరణలు అన్న అంశాలపై వెబినార్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ, ఎగుమతులపై బడ్జెట్ అనంతర వెబినార్లకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ అని చెప్తూ, అంచనాలను మించి విస్తరించడం ఇందులోని ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. అనేక రంగాల్లో నిపుణులు ఊహించిన దానికి మించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ బడ్జెట్ లో తయారీ, ఎగుమతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం
February 06th, 04:21 pm
భారత్ సాధించిన విజయాలను, భారత్ పట్ల ప్రపంచ అంచనాలను, 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణం కోసం దేశంలోని సామాన్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంకల్పాన్ని గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎంతో చక్కగా వివరించారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా సాగిన వారి ప్రసంగం మనందరికీ భవిష్యత్ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఈ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రసంగానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
February 06th, 04:00 pm
పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, భారత్‌పై ప్రపంచం అంచనాలు, వికసిత భారత్ సంకల్ప సాకారంలో సామాన్యుల ఆత్మవిశ్వాసంవగైరాలను రాష్ట్రపతి ప్రసంగం విశదీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రభావవంతమైన ఈ ప్రసంగం భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసేదిగా ఉందని అభివర్ణించారు. ఇంతటి ఉత్తేజకర ప్రసంగం చేసినందుకుగాను రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.ఆంగ్ల అనువాదం: లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం.... ప్రధాని సమాధానం
February 04th, 07:00 pm
గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నిన్న, ఈ రోజు అర్థరాత్రి వరకు గౌరవ ఎంపీలందరూ ఈ ధన్యవాద తీర్మానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా అనుభవజ్ఞులైన ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సహజంగానే ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం అవసరం ఉన్న చోట ప్రశంసలు ఉంటాయి. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ కొన్ని ప్రతికూల విషయాలు ఉంటాయి. ఇది చాలా సహజం! అధ్యక్షా.. దేశ ప్రజలు నాకు 14వసారి ఇక్కడ కూర్చొని రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించారు. ఇది నా అదృష్టం. కాబట్టి ఈ రోజు నేను ప్రజలకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చర్చలో పాల్గొని చర్చను గొప్పగా చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.Prime Minister Shri Narendra Modi’s reply to the Motion of Thanks on the President’s Address in Lok Sabha
February 04th, 06:55 pm
During the Motion of Thanks on the President’s Address, PM Modi highlighted key achievements, stating 250 million people were lifted out of poverty, 40 million houses were built, and 120 million households got piped water. He emphasized ₹3 lakh crore saved via DBT and reaffirmed commitment to Viksit Bharat, focusing on youth, AI growth, and constitutional values.వికసిత్ భారత్ దిశగా పయనించాలన్న మన అందరి సంకల్పానికి ప్రేరణను అందించనున్న బడ్జెటు: ప్రధానమంత్రి
February 01st, 05:53 pm
కేంద్ర బడ్జెటు 2025 భారత ప్రగతి పయనంలో ఒక గొప్ప మేలిమలుపు అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశలో మన దేశ పయనానికి జోరందించడంలో ఈ బడ్జెటుకు ప్రాధాన్యం ఉందని ఆయన ఉద్ఘాటించారు.కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 01st, 03:00 pm
దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ఓ ముఖ్య మజిలీకి చేరుకొన్నాం. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్, ఇది మన దేశంలో ప్రతి ఒక్కరి కలలను నెరవేర్చే బడ్జెట్. అనేక రంగాల్లో యువత ప్రవేశించడానికి వీలుగా వాటి తలుపులను మేం తెరిచాం. అభివృద్ధి చెందిన భారత్ ఉద్యమాన్ని ముందుకు నడిపేది సామాన్య పౌరులే. ఈబడ్జెట్ బలాన్ని ఇంతలంతలు చేసేస్తుంది. పొదుపు మొత్తాలను, పెట్టుబడిని, వినియోగాన్ని, వృద్ధిని శరవేగంగా పెంచేయనుంది. ఈ జనతా జనార్దన్ బడ్జెట్ ను.. ప్రజల బడ్జెట్ ను తీసుకువచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీని, ఆమెకు సహకారాన్ని అందించిన ఆమె బృందం సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను.కేంద్ర బడ్జెటు 2025-26పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన
February 01st, 02:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర బడ్జెటు 2025-26పై తన అభిప్రాయాలను ఈ రోజు వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. భారతదేశం అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ఒక ముఖ్య ఘట్టాన్ని ఆవిష్కరించిందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ఈ బడ్జెటు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అద్దంపట్టడంతోపాటు దేశంలో ప్రతి ఒక్కరి కలలను నెరవేరుస్తుందని వ్యాఖ్యానించారు. యువత కోసం అనేక రంగాల్లో తలుపులను తెరిచారు, సామాన్య పౌరుడే వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాడని ఆయన స్పష్టంచేశారు. ఈ బడ్జెటు బలాన్ని అనేక రెట్లు పెంచనుందని, ఈ బడ్జెటు పొదుపును, పెట్టుబడిని, వినియోగాన్ని, వృద్ధిని ఇంతలంతలు చేస్తుందని ప్రధాని అన్నారు. ‘ప్రజల బడ్జెటు’ను ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు, ఆమె బృందానికి అభినందనలు తెలిపారు.