టోక్యోలో జరిగిన 25వ వేసవి డెఫ్లింపిక్స్-2025లో అద్భుత ప్రదర్శన చేసిన భారత డెఫ్లింపియన్లకు ప్రధాని అభినందనలు

November 27th, 05:10 pm

టోక్యోలో జరిగిన 25వ వేసవి డెఫ్లింపిక్స్ 2025లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత డెఫ్లింపియన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

జపాన్ రాష్ట్రాల గవర్నర్లతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 30th, 08:00 am

ఈ సమావేశ మందిరంలో నేను సైతామా నగర వేగాన్నీ, మియాగీ నగర స్థిరత్వాన్నీ, ఫుకోకా నగర చైతన్యాన్నీ, నారా పట్టణపు వారసత్వపు గొప్పతనాన్నీ అనుభూతి చెందుతున్నాను. కుమామోటో నగర వెచ్చదనం, నాగానో నగర తాజాదనం, షిజోకా సౌందర్యం, నాగసాకి ప్రాణనాడిని మీరు కలిగి ఉన్నారు. మీరంతా ఫ్యుజీ పర్వత బలాన్ని, సాకురా పూల మొక్క స్ఫూర్తినీ కలిగి ఉన్నారు. కలిసికట్టుగా మీరు జపాన్‌ను ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.

జపాన్ లోని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధానమంత్రి భేటీ

August 30th, 07:34 am

జపాన్‌లోని స్థానిక ప్రభుత్వాల గవర్నర్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. 16 మంది గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ముఖచిత్రం: భారత్ - జపాన్ ఆర్థిక భద్రతా సహకారం

August 29th, 08:12 pm

ఉమ్మడి విలువలు, పరస్పర గౌరవంపై ఆధారపడిన భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం రెండు దేశాల భద్రత, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో అత్యంత కీలకంగా ఉంది. మన వ్యూహాత్మక దృక్పథం, ఆర్థిక అవసరాలలో పెరుగుతున్న సమానత్వం ఆధారంగా ఉన్న మన ద్వైపాక్షిక సహకారానికి ఆర్థిక భద్రతాపరంగా సహకారం ఎంతో కీలకం.

జపాన్‌లోని టోక్యోకు చేరుకున్న ప్రధాని మోదీ

August 29th, 06:43 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం జపాన్ చేరుకున్నారు. జపాన్‌లో ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారతదేశం & జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ మరియు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా సమీక్షిస్తారు మరియు ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు.

వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు

September 22nd, 12:06 pm

సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.

శ్రీమతి దీపాలీ ఝవేరి.. మిస్టర్ ఓటాలను జ‌పాన్‌లోని జోటో ఫైర్ స్టేష‌న్ సత్కరించడంపై ప్ర‌ధానమంత్రి హర్షం

April 06th, 09:47 am

టోక్యో నగరంలో నిరుడు అక్టోబరు నెలలో ‘దాండియా మస్తీ-2022’ సందర్భంగా హఠాత్తుగా స్పృహ కోల్పోయిన ఒక వ్యక్తిని ‘సీపీఆర్‌, ఎఇడి’ ప్రక్రియల ద్వారా ప్రవాస భారతీయురాలు శ్రీమతి దీపాలీ ఝవేరీతోపాటు జపాన్‌ పౌరుడు మిస్టర్‌ ఓటా రక్షించారు. ఈ నేపథ్యంలో జోటో అగ్నిమాపక కేంద్రం వీరిద్దరినీ ఇటీవల సత్కరించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో జరిగిన అంత్యక్రియలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

September 27th, 04:34 pm

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో టోక్యో లోని నిప్పోన్ బుడోకన్ లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు. ఇరవై కి పైగా దేశాధినేతలు / ప్రభుత్వాధినేతలు సహా వంద కు పైగా దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

జపాన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

September 27th, 09:54 am

జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కీర్తిశేషుడైన ప్రధాని భారతదేశం-జపాన్ భాగస్వామ్యాన్ని బలపరచడం తో పాటు గా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, అరమరికల కు తావు ఉండనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ తాలూకు దార్శనికత ను రూపుదిద్దడం లో కూడా అందించిన తోడ్పాటుల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.

జపాన్‌లోని టోక్యో చేరుకున్న ప్రధాని మోదీ

September 27th, 03:49 am

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని టోక్యో చేరుకున్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే రాష్ట్ర అంత్యక్రియలకు ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని కిషిదాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే ఆధికారిక అంత్యక్రియల లో పాలుపంచుకోవడంకోసం ఈ రోజు రాత్రి టోక్యో కు బయలుదేరి వెళ్ళనున్న ప్రధాన మంత్రి

September 26th, 06:04 pm

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే ఆధికారిక అంత్యక్రియల లో పాలుపంచుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో కు ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్ళనున్నారు.

కామన్వెల్త్ గేమ్స్-2022కి వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో జూలై 20న సంభాషించనున్న ప్ర‌ధానమంత్రి

July 18th, 05:06 pm

కామన్‌వెల్త్‌ క్రీడల్లో (సీడబ్ల్యూజీ) పాల్గొనేందుకు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూలై 20న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషిస్తారు. క్రీడాకారులతోపాటు శిక్షకులు కూడా ఈ ఇష్టాగోష్ఠి సమావేశంలో పాలుపంచుకుంటారు.

44వ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

June 19th, 05:01 pm

ఈ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ ఈవెంట్‌లో కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు, వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, చెస్ మరియు ఇతర క్రీడా సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రతినిధులు ఉన్నారు. , ఇతర ప్రముఖులందరూ, చెస్ ఒలింపియాడ్ జట్టు సభ్యులు మరియు ఇతర చెస్ క్రీడాకారులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

PM launches historic torch relay for 44th Chess Olympiad

June 19th, 05:00 pm

Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది

May 24th, 11:00 am

ఆరోగ్య రంగంలో సహకారాన్ని కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. వాక్సిన్ అభివృద్థి, సంబంధిత రంగాలపై కుదిరిన ఒప్పందాన్ని 2027 వరకు కొనసాగించి బయో మెడికల్ రంగంలో సంయుక్త పరిశోధన లు చేపట్టే అంశంపై కూడా రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది.

భారతదేశ ప్రభుత్వాని కి మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వానికి మధ్య పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం

May 23rd, 06:25 pm

భారతదేశ ప్రభుత్వం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం ఒక ఇన్ వెస్ట్ మెంట్ ఇన్ సెంటివ్ అగ్రిమెంట్ (ఐఐఎ) ను జపాన్ లోని టోక్యో లో ఈ రోజు న కుదుర్చుకొన్నాయి. ఈ ఒప్పంద పత్రాల పై భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ వినయ్ క్వాత్రా, యు.ఎస్. ఇంటర్ నేశనల్ డెవలప్ మెంట్ ఫైనేన్స్ కార్పొరేశన్ (డిఎఫ్ సి) లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ స్కాట్ నైథన్ సంతకాలు చేశారు.

ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు - తెలుగు అనువాదం

May 23rd, 05:25 pm

ఈ రోజు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మీ అందరితో కలిసి ఉండటం నాకు సంతోషాన్నిచ్చింది. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ అనేది ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాంతాన్ని సారధిగా మార్చాలనే మన సమిష్టి సంకల్పానికి ప్రతి రూపం. ఈ ముఖ్యమైన చొరవకు నేను అధ్యక్షుడు బిడెన్‌కి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండో-పసిఫిక్ ప్రాంతం తయారీ, ఆర్థిక కార్యకలాపాలు, ప్రపంచ వాణిజ్యం మరియు పెట్టుబడులకు కేంద్రం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని వాణిజ్య కార్యకలాపాలలో భారతదేశం శతాబ్దాలుగా ప్రధాన కేంద్రంగా ఉందనడానికి చరిత్ర సాక్ష్యం గా నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాణిజ్య నౌకాశ్రయం భారతదేశంలోని నా సొంత రాష్ట్రమైన గుజరాత్‌ లోని లోథాల్‌ లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల, ఈ ప్రాంతంలోని ఆర్థిక సవాళ్లకు మనం సాధారణ మరియు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడం చాలా అవసరం.

టోక్యో లో బిజినెస్ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి అధ్యక్షత వహించిన - ప్రధానమంత్రి

May 23rd, 04:12 pm

టోక్యో లో 2022 మే నెల, 23వ తేదీన జపాన్ వ్యాపార ప్రముఖులతో ఏర్పాటైన బిజినెస్-రౌండ్-టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఇండో-పసిఫిక్ ఇకానామిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్ పెరిటీ (ఐపిఇఎఫ్) నుప్రారంభించడానికి ఏర్పాటైన కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు

May 23rd, 02:19 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో లో ఈ రోజు న ఇండో-పసి ఇకానామిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్ పెరిటీ (ఐపిఇఫ్) ని ఏర్పాటు చేయడాని కి సంబంధించిన చర్చల ను ప్రారంభించేందుకు నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో యుఎస్ఎ అధ్య‌క్షుడు శ్రీ‌ జోసెఫ్ ఆర్. బైడెన్, జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో కూడా పాల్గొన్నారు. వారితో పాటు ఇతర భాగస్వామ్య దేశాలు అయినటువంటి ఆస్ట్రేలియా, బ్రునెయి, ఇండోనేశియా, కొరియా గణతంత్రం, మలేశియా, న్యూజీలేండ్, ఫిలీపీన్స్, సింగపూర్, థాయీలేండ్ ఇంకా వియత్ నామ్ ల నేతలు కూడాను వర్చువల్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఎన్ఇసి కార్పొరేశన్ చైర్ మన్ డాక్టర్ నొబుహిరొ ఎండో తో సమావేశమైన ప్రధాన మంత్రి

May 23rd, 12:23 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ఇసి కార్పొరేశన్ చైర్ మన్ డాక్టర్ నోబుహిరో ఎండో తో టోక్యో లో ఈ రోజు న సమావేశమయ్యారు. భారతదేశం యొక్క టెలికమ్యూనికేశన్ రంగం లో ఎన్ఇసి పోషించినటువంటి పాత్ర ను, ప్రత్యేకించి చెన్నై- అండమాన్ & నికోబార్ దీవులు (సిఎఎన్ఐ) మరియు కోచి-లక్షద్వీప్ దీవుల (కెఎల్ఐ) కి సంబంధించిన ఒఎఫ్ సి ప్రాజెక్టుల లో ఎన్ఇసి యొక్క పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం లో భాగం పెట్టుబడి కి ఉన్నటువంటి అవకాశాల ను గురించి కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.